Registration Income
-
రిజిస్ట్రేషన్ల ఆదాయంపై కరోనా దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ పుణ్యమాని రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక్క నెలలో రావాల్సిన ఆదాయం వచ్చేందుకు మూడు నెలలు పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మరో రెండు రోజుల్లో ముగియనుండగా ఆ శాఖ ఆదాయం రూ. 600 కోట్ల మార్క్ చేరింది. లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెల పూర్తిగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో ఆ నెలలో రూ.12 కోట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వచ్చాయి. ఇక, మే నెల ఆరో తేదీ నుంచి మళ్లీ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అయినా ఆ నెలలో సెలవు దినాలు పోను కేవలం రూ.200 కోట్లకుపైగా మాత్రమే రాబడి వచ్చింది. జూన్ నెలలో కొంత మేర రియల్ లావాదేవీలు పుంజుకోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.400 కోట్లకు చేరింది. వెరసి మూడు నెలల్లో రూ.1500–1800 కోట్లు రావాల్సి ఉండగా అతికష్టంగా రూ.600 కోట్లు ఖజానాకు సమకూరాయి. కాగా, జూన్ నెల రాబడులు ఆశాజనకంగానే ఉన్నాయని, రాజధాని హైదరాబాద్ శివార్లలో క్రమంగా రియల్ ఎస్టేట్ రంగం కుదుటున పడుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే జూలై మాసం నుంచి సాధారణ పరిస్థితుల్లో వచ్చే ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడో నెలలో ముచ్చటగా... వాస్తవానికి, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నెలకు రూ. 500–600 కోట్ల వరకు వస్తుంది. రోజుకు 5 వేల వరకు లావాదేవీలు జరిగి, రూ.20 కోట్ల వరకు రాబడి వచ్చేది. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడం, ప్రజల వద్ద తగినంత నగదు లభ్యత లేకపోవడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాయిదా పడ్డ రియల్ లావాదేవీలు మళ్లీ ప్రారంభం కాలేకపోయాయి. అంతకన్నా ముందు జరిగిన ఒప్పందాలూ ఆగిపోయాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా ఉండే వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు కూడా జరగలేదు. దీంతో దాదాపు మార్చి నెలలో సగ భాగం, ఏప్రిల్, మే నెలలు పూర్తిగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాల్లో స్తబ్దత నెలకొంది. మళ్లీ ఇప్పుడు గాడిలోకి.. కరోనా లాక్డౌన్ ఎత్తేసిన రెండో నెలలో భూ లావాదేవీలు మళ్లీ కోలుకున్నాయని జూన్ నెల రిజిస్ట్రేషన్ ఆదాయ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రియల్ లావాదేవీలు ఊహించిన దానికన్నా ఎక్కువ పెరిగాయని, ప్రజల వద్ద నగదు లభ్యత పెరగడంతో పాటు బ్యాంకులు కూడా రుణాలిచ్చే దిశలో ఉదారంగా వ్యవహరిస్తుండటం, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై తెలంగాణలో ఆంక్షలు తొలగించిన కారణంగా గతంలో వేసిన పెద్ద వెంచర్లు, జరిగిన ఒప్పందాల్లో కదలిక వచ్చింది. దీంతో జూన్ నెలలో సగటున రోజుకు రూ.14 కోట్ల మేర రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం సమకూరింది. ఇందులో 70 శాతానికిపైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిందేనని ఆ శాఖ ఉన్నతాధికారులంటున్నారు. అందుకే జూన్ నెలలో రాబడి రూ.400 కోట్లకు చేరిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై నెలలో ఆదాయం మరింత పెరిగి మునుపటిలా యథాతథ స్థితికి చేరుతుందనే ధీమా రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
ఆల్‌టైమ్ హై రికార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగియక ముందే రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.3 వేల కోట్లు దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ఆరు నెలల్లో రూ.2 వేల కోట్ల లోపు ఆదాయానికే పరిమితమైన రిజి్రస్టేషన్ల ఆదాయం ఈ ఏడాది ఆల్‌టైమ్ హై రికార్డుతో రూ.3,118 కోట్లకు చేరింది. ఆరు నెలలు ముగిసేందుకు మరో వారం రోజుల గడువు మిగిలి ఉండగానే ఈ రికార్డు సాధించడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్ మాసం దుమ్మురేపుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఆదాయం రూ.398 కోట్లు దాటిపోయింది. ఈ నెల 13కి రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.2,951 కోట్ల పైచిలుకు ఉండగా, 25కి అది రూ.3,118 కోట్లకు చేరింది. మొత్తం 12 రోజుల్లో (రెండు ఆదివారాలు, వినా యక నిమజ్జనం) సెలవులు పోను 9 రోజుల్లోనే రూ.167 కోట్ల ఆదాయం వచి్చంది. సగటున రోజుకు రూ.20 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, 5 వేలకు పైగా డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రిజి్రస్టేషన్ జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయంలో సగం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే వస్తోంది. యాదాద్రి జిల్లాలోనూ ఈ ఏడాది ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం వచి్చంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం తక్కువ ఉన్న జిల్లాల్లో కొమురం భీం, జయశంకర్, భద్రాద్రి జిల్లాలున్నాయి. -
పని ఈజీ.. ఆదాయం డబుల్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకేతికంగా మెరుగుపడింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నది. పనిని సులభతరం చేసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఇదివరకు ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు, నెట్వర్క్ సమస్యలతో సతమతమయ్యే ఈ శాఖలో గత ఏడాది కాలంగా అవరోధాలు లేకుండా అమలవుతున్న సేవలు ఆదాయాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా 2017 చివర్లో రెయిల్‌టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా మెరుగైన సేవలు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధికి కారణమవుతున్నాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ సొంత నెట్వర్క్.. ఆ తర్వాత అప్‌గ్రేడ్ తెలంగాణ ఏర్పాటైన మూడేళ్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్తోనే కలసి రిజిస్ట్రేషన్ల నెట్వర్క్ ఉండేది. స్టేట్‌వైడ్ ఏరియా నెట్వర్క్(స్వాన్) పేరుతో ఉండే దీని ద్వారానే తెలంగాణలోని 141, ఆంధ్రప్రదేశ్‌లోని 270 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయ లావాదేవీలు జరిగేవి. దీంతో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ బిజీ ఏర్పడి తరచూ సేవలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ ద్వారా 2 ఎంబీపీఎస్ ద్వారా మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీని కోసం ఏటా రూ.1.2 కోట్లను ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తోంది. రూ.72 కోట్లతో విస్సెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థతో అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 7–9 కొత్త కంప్యూటర్లతోపాటు స్కానర్లు, ప్రింటర్లు, బయో మెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలు, ఐరిస్ రీడర్లు, మోడెమ్‌లను ఆ సంస్థ సరఫరా చేసి ఐదేళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి 5 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక ఇంజనీర్‌ను కూడా నియమించుకుని రోజువారీ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త పరికరాలు, రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకున్న 7 వేల టెరాబైట్ల సామర్థ్యం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నెట్వర్క్, సెంట్రల్ సర్వర్ల ఏర్పాటుతో లావాదేవీల్లో వేగం పెరిగింది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అప్లోడ్, డాటా ఎంట్రీ, ఫోటో క్యాప్చర్ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది. కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీ సమయాన్ని పావుగంట వరకు తగ్గించగలిగామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘గతంలో సర్వర్లలలో సాంకేతికంగా అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఒక్కోసారి 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండటం లేదు.’అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది గణనీయంగా లావాదేవీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం లావాదేవీలు పెరిగాయి. 2017–18 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 12 రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో మొత్తం 11,36,372 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 15,12,468 లావాదేవీలు జరగడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2017–18 మార్చిలో1,16,928 క్రయవిక్రయ లావాదేవీలు జరిగితే 2018–19 మార్చిలో 1,65,464 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది కన్నా 41 శాతం ఎక్కువని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 37% కన్నా ఎక్కువ సంఖ్యలో లావాదేవీల వృద్ధి కనిపించడం గమనార్హం. -
తెలంగాణలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ ఆదాయం
-
జీఎస్టీ పరిధిలోకి ‘రియల్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు గండిపెట్టే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా పంచుకుంటున్న కేంద్రం.. వీలైనన్ని ఎక్కువ సరుకులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై లీటర్‌కు రూ.2 ఎక్సైజ్ సుంకం తగ్గించి, 5 శాతం వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలకు ప్రతిపాదించి... తాజాగా రియల్ ఎస్టేట్, లిక్కర్ రంగాలపై దృష్టి సారించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పంచుకునే చర్యలకు ఉపక్రమించింది. దీంతోపాటు లిక్కర్ ముడి సరుకు అయిన ఇథనాల్ రవాణాపై పన్ను విధించడం ద్వారా పరోక్షంగా మద్యం ఆదాయాన్ని కూడా రాబట్టుకునే దిశలో ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్ర పోషించే ఈ మూడు రంగాల ఆదాయాన్ని పంచుకోవడంతో పాటు పన్ను విధించే అధికారాన్ని కూడా తానే తీసుకోవడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక వనరులపై పట్టుబిగించనుంది. ప్రతి లావాదేవీపై వాటా రియల్ ఎస్టేట్ రంగాన్ని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావడం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పంచుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్రానికి పంపిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఈ నెల 23న జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో కూడా చర్చ జరిగిందని, రియల్ ఎస్టేట్ని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలన్న కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ రంగాన్ని జీఎస్టీ పరిధిలోనికి తెస్తే రిజిస్ట్రేషన్ ఆదాయంలో సగం వాటా కేంద్రానికి ఇవ్వా ల్సి వస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2,800 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చింది. మరో రూ.3 వేల కోట్ల వరకు ఆదా యం వచ్చే అవకాశం ఉంది. ఇందులో రూ.2 వేల కోట్ల వరకు జీఎస్టీ ద్వారా కేంద్రానికి వెళ్లనుంది. అంటే ఆ మేరకు రాష్ట్ర ఖజానాకు గండిపడనుందనే చర్చ పన్నుల శాఖ వర్గాల్లో జరుగుతోంది. వచ్చేనెల 10న గువాహటిలో జరిగే 23వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఎజెండాగా పెట్టనున్నారని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించనుందని సమాచారం. లిక్కర్‌పై పరోక్షంగా.. పెట్రోల్, మద్యం జీఎస్టీ పరిధిలో లేవు. లిక్కర్ ఆదాయాన్ని పంచుకునేందుకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష మార్గాన్ని కేంద్రం ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగా మద్యం ఆదాయంపై ప్రభావితం చూపే ముడిసరుకు ఇథనాల్ రవాణాను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్‌పై ఇంకా రాని నిర్ణయం వాస్తవానికి పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలే వ్యాట్ వసూలు చేసుకుంటాయి. ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేలేదు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ధరలను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో కేంద్రం తాను విధిస్తోన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నెలకు రూ.44 కోట్ల చొప్పున ఏటా రూ.528 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై 5 శాతం వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరింది. అలా తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాల అంచనా. దీంతో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనను తిరస్కరించే యోచనలో రాష్ట్రం ఉన్నట్టు సమాచారం. -
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్!
నోట్ల రద్దు, ఇతర కారణాలతో తగ్గిన రాబడి - అవినీతి, అధికారుల నిర్లక్ష్యమూ కారణమే - పెరిగిన మద్యం విక్రయాల ఆదాయం - ఫరవాలేదనిపించిన అమ్మకపు పన్ను - ముగిసిన 2016–17 ఆర్థిక సంవత్సరం - కేంద్ర పన్నుల్లోంచి వచ్చే రాష్ట్రవాటాపైనే సర్కారు ఆశలు! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మూడో ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31తో ముగిసిపోయింది. 2016–17లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఊహించినంత ఆదాయం రాకపోవడం సర్కారు అంచనాలను దెబ్బ తీసింది. నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబర్ నుంచి వరుసగా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో మద్యం అమ్మకాలతో వచ్చే రాబడి పెరగడం రాష్ట్ర ఖజానాకు కొంత ఊరటనిచ్చింది. మరోసారి లక్ష్యానికి దూరంగా.. వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈసారి కూడా చతికిల పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్న దశలో కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కోలుకోలేని దెబ్బతీసింది. వాస్తవానికి 2016–17లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయ లక్ష్యాన్ని (స్టాంపుడ్యూటీ మాత్రమే) రూ.4,291.99 కోట్లుగా నిర్దేశించింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.3,549 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నవంబర్ వరకు ప్రతి నెలా రూ.330 కోట్ల వరకు ఆదాయం రాగా.. డిసెంబర్లో రూ.243 కోట్లు, జనవరిలో రూ.222 కోట్లకు తగ్గిపో యింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తంగా లక్ష్యంలో 82.7 శాతం ఆదాయం లభించినా.. అది గతేడాది (83.7 శాతం) కన్నా తక్కువే. అవినీతి, నిర్లక్ష్యమే కారణం! మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో తనిఖీలు సక్రమం గా చేయకపోవడంతో కిందిస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, మార్కెట్ విలువ కంటే తక్కువగా లెక్కించి రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండికొట్టారని కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఏడేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు చేయకపోవడం, కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఐదేళ్లకు పైగా ఒకే స్థానంలో పనిచేస్తుండడం కూడా అవినీతికి ఆస్కారమి చ్చినట్టయిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఈ శాఖకు మూడేళ్లుగా పూర్తిస్థాయి కమిషనర్ కూడా లేరు. ఇన్చార్జిగా ఉన్న అధికారికే మరో రెండు విభాగాల బాధ్యత లను కూడా అప్పగించడం కూడా ఇబ్బం దికరంగా మారిందని చెబుతున్నారు. ఇక 10 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. తగ్గిన పన్నేతర ఆదాయం రాష్ట్రంలో పన్నేతర రాబడి గణనీయంగా తగి ్గపోయింది. ఫీజులు, జరిమానాలు, డివిడెండ్లు, లాభాలు, అటవీ ఉత్పత్తులు, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ఈ పద్దులో ఉంటుంది. 2015–16లో పన్నేతర రాబడి ద్వారా రూ.17,542 కోట్లు సమకూరుతాయని అంచనా వేయగా.. జనవరి నాటికి రూ.2,728 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆదుకున్న మద్యం విక్రయాలు రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చిన ఆదాయం చివరి నాలుగు నెలల్లో భారీగా పెరిగింది. మద్యం ఉత్పత్తులపై పన్ను ద్వారా రూ.4,543 కోట్లు రాబట్టాలని అంచనా వేయగా.. జనవరి నాటికే ఆ మేర ఆదాయం సమకూరడం గమనార్హం. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా అక్టోబర్‌లో రూ.291 కోట్లు, నవంబర్‌లో రూ.201 కోట్లురాగా.. డిసెంబర్లో ఏకంగా రూ.564 కోట్లు సమకూరాయి. నాలుగు నెలలకోసారి మద్యం కంపెనీలు చెల్లించే వాటా జమకావటంతో జనవరిలో రూ.812 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ రాబడి పెరిగింది. ఇక అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది పొడవునా నిలకడగా కొనసాగింది. -
ఇకపై ఏటా ఆస్తిపన్ను పెంపు
మంత్రులు నారాయణ, గంటా విశాఖపట్నం: ఏటా భూముల ధరలు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకున్నట్టే ఆస్తిపన్ను కూడా నిర్దిష్ట శాతం మేరకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ, మానవ వనరులు, విద్యాశాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వారు సోమవారం విశాఖ నగరంలో విలేకరులతో మాట్లాడారు.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర అన్ని సంస్థల్ని అనుసంధానిస్తూ రాష్ట్రంలో అధునాతన ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని వారు వివరించారు.