గాయపడినా హెల్మెట్ వద్దంటున్నాడు!
ముంబై:ఇటీవల ముంబైలో జరిగిన నాల్గో టెస్టులో ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్ పాల్ రీఫెల్ ఫీల్డ్‌లో ఉండగా గాయపడిన సంగతి తెలిసిందే. భారత ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రీఫెల్ తల వెనుక తగిలింది. దాంతో రీఫెల్ ఫీల్డ్‌లో పడిపోయాడు. అనంతరం స్టేడియంలోని వైద్య సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం రీఫెల్ రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. దాంతో ఫీల్డ్ అంపైర్లకు హెల్మెట్ ఉండాలనే ప్రతిపాదనను వచ్చింది.. కాగా, దీనికి రీఫెల్ అభ్యంతరం చెప్పాడు. 'నా వరకూ ఫీల్డ్ అంపైర్లు టెస్టుల్లో హెల్మెట్‌తో అంపైరింగ్ చేయడం క్లిష్టంగానే ఉంటుంది. ఐదు రోజుల పాటు హెల్మెట్ ధరించి ఉండాలంటే చాలా కష్టమే కాదు.. అత్యంత భారంగా ఉంటుంది. అది సాధ్యం కాదు. ఒకవేళ హెల్మెట్‌తోనే అంపైరింగ్ చేయాలంటే నాకు నిజంగా ఇబ్బందికరంగా ఉంటుంది' అని రీఫెల్ పేర్కొన్నాడు.
ముంబైలో జరిగిన నాల్గో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 49.0 ఓవర్‌ను రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. ఈ క్రమంలోనే అతను విసిరిన రెండో బంతిని ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ లెగ్ స్టంప్ మీదుగా తరలించి సింగిల్ తీశాడు. అయితే భారత ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ నేరుగా విసిరిన బంతి అంపైర్ తల వెనుక బాగాన తగిలింది. దాంతో అంపైర్ ఫీల్డ్‌లో పడిపోయాడు. దాంతో ఈ సిరీస్ కు రీఫెల్ దూరం కావాల్సి వచ్చింది.