Relangi
-
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - రేలంగి
-
రేలంగి జామ.. భలే మామ!
పశ్చిమగోదావరి ,ఇరగవరం: ఆంధ్ర ఆపిల్‌గా పేరుగాంచిన జామ కాయలకు పెట్టింది పేరు ఇరగవరం మండలం రేలంగి గ్రామం. ఇక్కడ పండించే జామ కాయలకు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలలోనూ విపరీతమైన గిరాకీ ఉంది. పూర్వం నుంచి ఈ గ్రామంలో 200 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జామ పంట ఉపాధి కల్పిస్తోంది. గ్రామంలోనే జామ తోటలు పెంచి వాటి నుంచి పండిన కాయలను రేలంగి చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయించడమే కాకుండా ఏలూరులోని జ్యూస్ ఫ్యాక్టరీకి సరఫరా చేస్తారు. దూర ప్రాంతాలకూ ఎగుమతి చేసే వ్యాపారులున్నారు. దీంతో సీజన్లో గ్రామం నుంచి బెంగళూరు, తిరుపతి, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు లారీల్లో జామ కాయలను తరలిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లాలోని భీమవరం, ఆకివీడు, నిడదవోలు, అమలాపురం తదితర ప్రాంతాలకు రైళ్లలో రవాణా చేస్తుంటారు. పూర్వం రేలంగిలో జామ కాయల ఎగుమతి కోసం ప్రత్యేకంగా రైళ్లుల్లో కూడా రవాణా చేసేవారని ప్రచారం ఉంది. 150 ఎకరాల్లో సాగు ప్రస్తుతం రేలంగి గ్రామంలో 150 ఎకరాల వరకూ జామ తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరానికి కౌలుగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ చెల్లిస్తున్నారు. పెంచిన జామ తోటలకు ఐతే సంవత్సరానికి రూ. 60 వేలను కౌలుగా చెల్లిస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ఒక ఎకరానికి సంవత్సరంలో పది నుంచి 14 టన్నుల వరకూ దిగుబడి వస్తోందని, టన్నుకు సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ ధర పలుకుతోందని చెప్పారు. ఇటీవల అలహాబాద్ సఫేదా, థాయ్‌లాండ్, కేజీ 48 రకాలను కూడా గ్రామంలో పండిస్తున్నారు. ఈ వంగడాలను కడియద్ద, అశ్వారావుపేట, తదితర చోట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 8 సంవత్సరాల తర్వాత పూర్తిగా ఈ చెట్లను తొలగించి మళ్లీ కొత్త మొక్కలు నాటుతారు. ఇక్కడ కాయలను రేలంగి గ్రామం మీదుగా ప్రయాణించేవారు తప్పక రుచి చూడటం రివాజు. లాభసాటి పంట పూర్వం నుంచి జామ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నాలుగు ఎకరాల పొలంలో జామ తోట పంటతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సంవత్సరానికి ఎకరానికి దాదాపు రూ.లక్ష వరకూ ఆదాయం వస్తోంది. –శిరిగినీడి వెంకటేశ్వరరావు, జామ రైతు, రేలంగి వారసత్వంగా సాగుతున్నాం మా తాత, తండ్రుల కాలం నుంచి జామ పంట పండిస్తున్నాం. పూర్వంతో పోలిస్తే ప్రస్తుతం జామ పంటకు లభిస్తోన్న రేటు చాలా బాగుంది. వరితో పోలిస్తే జామ పంట లాభదాయకంగానే ఉంది. సంవత్సరానికి ఎకరానికి రూ.25 వేలు ఖర్చు చేస్తే రూ.లక్ష వరకూ ఆదాయం వస్తోంది. –పరుచూరి వెంకట్రావు, జామరైతు, రేలంగి -
నవ్వుల రేడు.. రేలంగి
13న హాస్యనట కిరీటి జయంత్యుత్సవం ఆ నటన.. హావభావాలు అజరామరం ఆయన లేకున్నా.. పండించిన హాస్యం పదిలం తాడేపల్లిగూడెంలో స్థిరపడిన మహానటుడు పట్టణంతో పెనవేసుకున్న బంధం చూడగానే నవ్వు తెప్పించే ఆహార్యం.. అబ్బుర పరిచే హావభావాలు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే చమక్కులు.. ఇవన్నీ అలనాటి సినీ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య సొంతం. ఆయన తర్వాత ఎందరు హాస్య నటులు వచ్చినా ఆయన ముద్ర చెరిగిపోనిది. ఆయన పంచిన నవ్వు తరగిపోనిది. ఈనెల 13న రేలంగి జయంత్యుత్సవం సందర్భంగా ఆ మహా హాస్య నట కిరీటి ప్రస్థానం గురించి ఓ సారి.. తాడేపల్లిగూడెం ఒకటా.. రెండా.. ఎన్నో పాత్రలు.. హాస్యనటునిగానూ డ్యూయెట్లు.. సోలో సాంగ్స్.. అన్నింటిలోనూ మెప్పించి తనకు తానే సాటి అని నిరూపించుకున్న రేలంగి వెంకట్రామయ్య.. నటనా చాతుర్యం అజరామరం. ఆయన పండించిన హాస్యం ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ పదిలం. తొలి పద్మశ్రీ అవార్డు అందుకున్న హాస్యనటుడు ఆయన. ’సరదా..సరదా.. సిగరెట్టు.. ఇది దొరల్ తాగు సిగరెట్టు.. పాటలో ఆయన పలికించిన హాభావాలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. పారశీకం ఏంటి.. పరుషకం.. పరుషకం... టోపీ టింగురంగగా ఉందే అంటూ పాతాళభైరవిలో రాణీగారి తమ్ముడి పాత్రలో మెరిసిన రేలంగి నటన అద్భుతం. శర్మా... కరపీడనమే కదా చేయమను అంటూ మాయాబజారులో లక్ష్మణకుమారుని పాత్రకు వన్నె తెచ్చిన మేటి నటుడు రేలంగి. అదే సినిమాలో నాన్నగారు కోతి.. కోతిపిల్ల అంటూ.. భయంతో కూడిన హాస్యం పండించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు రేలంగి. ఆయన నటనా కౌసలానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. 1935 నుంచి 1975 వరకు సుమారు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో రేలంగి నిత్యం హాస్యరస గుళికలను ప్రేక్షకులకు అందించారు. కడుపుబ్బా నవ్వించారు. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపించి మెప్పించారు. రేలంగి సినీ ప్రస్థానం ఇదీ.. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో 1910 ఆగస్టు 13న జన్మించిన ఆయన 1919లో బృహన్నల నాటకంలో స్త్రీపాత్ర ద్వారా నాటకరంగం ప్రవేశం చేశారు. ఎస్.వి.రంగారావు వంటి వారు సభ్యులుగా ఉన్న చెన్నైలోని యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్లో చేరారు. 1931లో భక్తప్రహ్లాద సినిమా చూసి.. సినిమాలలో వేషాల కోసం కోల్‌కతా వెళ్లి సినీదర్శకుడు సి.పుల్లయ్యను కలిశారు. ఆయన నిర్మిస్తున్న శ్రీ కృష్ణతులాభారంలో పాత్ర పొందారు. వరవిక్రయం, గొల్లభామ వంటి సినిమాలలో నటించారు. గుణ సుందరి కథ సినిమాతో రేలంగికి మంచిపేరు వచ్చింది. మిస్సమ్మ, మాయాబజార్, దొంగ రాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పుచేసి పప్పుకూడు వంటి సినిమాలు ఆయనను అగ్రభాగాన నిలబెట్టాయి. ఆయన నటించిన ఆఖరి చిత్రం పూజ (1975). గిరిజ, సూర్యకాంతంలతో డ్యూయెట్లు అప్పట్లో సినిమాలో రేలంగి ఉంటే ఆయన పక్కన నాయికలూ ఉండాల్సిందే. గిరిజ , లేదంటే సూర్యకాంతం ఎక్కువగా ఆయన పక్కన నటించి మెప్పించారు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో కాశీకి పోయానో రామా హరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ అనే పాటలో గిరిజ, రేలంగి ప్రదర్శించిన హాస్య నటన ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతోంది. చదువుకున్న అమ్మాయిలు సినిమాలో ఏమిటీ ఈ అవతారం.. ఎందుకు ఈ సింగారం.. అంటూ సూర్యకాంతం, రేలంగి చేసిన సందడి ఇప్పుడు చూసినా అబ్బురపరుస్తోంది. కేవలం రేలంగి తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖంలో నవ్వు వెల్లివిరిసేది. ఆయన నడక, నటన, డైలాగు చెప్పే తీరు మేళవించి ఆయనను మహా హాస్య నటునిగా ప్రేక్షకుల మదిలో నిలబెట్టాయి. గాయకుడిగానూ.. హాస్య నటుడిగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లోనే ఆయన గాయకునిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వినవేబాల నా ప్రేమ గోల అంటూ పాతాళభైరవిలో ఆయన పాడిన పాట ఇప్పటి తరాన్నీ కట్టిపడేస్తోందంటే అతిశయోక్తి కాదు. మిస్సమ్మ సినిమాలో కాణీ ధర్మం చేయి బాబూ.. అనే పాట కూడా ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. 1949లో గుణసుందరి కథ, 1951లో పాతాళభైరవి, 1952లో ధర్మదేవత, 1954లో విప్రనారాయణ, పెద్దమనుష్యులు, 1955లో మిస్సమ్మ, 1959లో అప్పుచేసి పప్పుకూడు, 1966లో పరమానందయ్యశిష్యుల కథలో ఆయన పాటలు పాడారు. రాజబాబు ప్రవేశం రేలంగి పుణ్యమే శరీర విన్యాసాల ద్వారా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్యనటుడు రాజబాబును సినిమాకు పరిచయం చేసింది రేలంగే. నిర్మాతగా ఆయన నిర్మించిన సామ్రాజ్యం సినిమాలో రాజబాబును రేలంగి పరిచయం చేశారు. స్వయం కృషితో ఎదిగారు తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆయన వివాహ బంధం ద్వారా తాడేపల్లిగూడెం పట్టణంతో అనుబంధాన్ని అల్లుకున్నారు. పట్టణంపై ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. దీంతో అప్పట్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానం.. సౌండ్ సిస్టంతో ఇక్కడ రేలంగి చిత్రమందిర్‌ను నిర్మించారు. భేషజాలకు. దర్పాలకు పోకుండా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రేలంగి. పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్య నటుడు పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి తెలుగు హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కావడం విశేషం. రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఒకే ఒక్క వారసుడు రేలంగికి ఒకే ఒక్క వారసుడు ఉన్నారు. సత్యనారాయణ బాబు. తండ్రి బాటలో నటనవైపు వెళ్లారు. నగేష్ లాంటి హాస్య నటుడిగా ఎదగాలని ఆకాంక్షించిన బాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్నేహితులు. కలిసి చదువుకున్నారు. కలిసి సినిమాలలోనూ నటించారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా బహుమతులు సాధించారు. బాలానందం సినిమాలో హీరో, విలన్‌గానూ బాబు పాత్రలు పోషించారు. తమిళంలోని ఒక సినిమాను చట్టాలు మారాలి అనే పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. ఇటీవలే ఆయన అనారోగ్యంతో మరణించారు. తాత బాటలో మనుమడు హేమంత్ తాత రేలంగి బాటలో సినిమాలలో రాణించాలని రేలంగి కుమారుడు సత్యనారాయణబాబు చిన్న కుమారుడు హేమంత్ సినిమాలలో నటిస్తున్నారు. రేలంగి పేరిట పట్టణానికి చెందిన బాల్ పాయింట్ చిత్రకారుడు ఎస్వీఆర్ చిన్ని తదితరుల ఆధ్వర్యంలో పద్మశ్రీ రేలంగి మెమోరియల్ కల్చరల్ యూనిట్ పేరుతో సంగీత, సాహిత్య సాంస్కృతిక, సేవాసంస్థను 1978లో ఏర్పాటు చేశారు. రేలంగి సినీ రంగ విశేషాలతో 1979లో ఒక సావనీర్‌ను ప్రచురించి విడుదల చేశారు. గూడెంలో రేలంగి జయంత్యుత్సవం రేలంగి గురించి ఇప్పటి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈనెల 13న ధవళసత్యం కళామిత్ర మండలి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలను బీవీఆర్ కళాకేంద్రంలో ఏర్పాటుచేశారు. పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నారు. హాస్య లఘు నాటికలు, రేలంగి సినీ గీతాల పోటీలు ఏర్పాటుచేశారు. రేలంగి గీతాలతో ప్రత్యేక ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేలంగి తనయుడు సత్యనారాయణబాబు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు హాజరు కానున్నారు. -
నవ్వుల రేడు రేలంగి
హావభావాలతో నిండైన హాస్యం హాస్యంలో తొలి పద్మశ్రీ అందుకున్న మహానటుడు నేడు ఆయన 41వ వర్ధంతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : హాస్యంతో గిలిగింతలు పెట్టించాడు. నడక, హావ భావాలతో కడుపుబ్బా నవ్విం చాడు. ఆబాలగోబాలాన్ని అలరిం చిన నవ్వులరేడు ‘రేలంగి’ గురించి తెలియని వారు ఉండరు. హాస్యం లో తొలి పద్మశ్రీ అందుకున్న మహా నటుడు రేలంగి వెంకట్రామయ్య వర్థంతి. జిల్లాలోని రావులపాలెంలో 1909 ఆగస్టు 8న 1909లో రేలంగి వెంకటస్వామి, అచ్చాయమ్మ దంపతులకు జన్మించా రు. తండ్రి వద్దే సంగీతం, హరికథలు నేర్చుకున్నారు. 15వ ఏట ‘బృహన్నల’ నాటకంలో స్త్రీ పాత్ర ద్వారా నటనకు శ్రీకారం చుట్టారు. 1937లో విడుదలైన భక్తప్రహ్లాద సినిమా చూసి తాను ఇక సినిమాల్లోనే నటించాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో రేలంగి అవకాశాల కోసం ఎదురు చూస్తుండగా 1935లో కోల్కత్తా వెళుతున్న శ్రీకృష్ణతులాభారం చిత్ర యూని ట్లో కలిసిపోయాడు. ఆ యూనిట్లో నెలకు రూ.30 జీతానికి పనిచేసేవారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి 12 ఏళ్లు దాటిపోయినా చిన్నచితకా వేషాలు తప్ప సరైన గుర్తింపు రాలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డారు. అదే సమయంలో హెచ్.ఎం.రెడ్డి నిర్మిస్తు న్న గుణసుందరి కథ చిత్రంలో మంచి పాత్ర లభించింది. అక్కడ నుంచి ఆయన దశ మారిపోయిం ది. తర్వాత మాయాబజార్, ప్రేమించిచూడు, సత్యహరిశ్చంద్ర, వెలుగునీడ లు, లవకుశ, జగదేకవీరుని కథ చిత్రాల్లో తనదైన హాస్యంతో వరుస విజయాలతో రేలంగి దూసుకుపోయారు. 1960లో ఆయ న సమాజం అనే చిత్రాన్ని నిర్మిం చారు. భాగస్వామిగా మిస్సమ్మ చిత్రాన్ని నిర్మించారు. ఆయన 1975 నవంబర్ 25న అనారోగ్యంతో కన్నుమూశారు. వితరణ శీలి తొలినాళ్లలో తినేందుకు తిండి కూడా ఉండేది కాదు. మద్రాసులో వేరుశనగ గింజలు తిని కడుపునింపుకొనేవారు. తర్వాత వరుస హిట్లతో చిత్ర పరిశ్రమలో కీలక వ్యక్తిగా మారిపోయారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన లోటు ఎవరూ భర్తీ చేయలేరు. – అడబాల మరిడయ్య, సినీ విశ్లేషకుడు -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఇరగవరం : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇరగవరం మండలం రేలంగి గ్రామ శివారు గమళ్ల పాలెంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్ఐ వి.ఎస్.వి.భద్రరావు కథనం ప్రకారం.. గమళ్ల పాలెం గ్రామానికి చెందిన కాసగాని వెంకన్న (25) స్నేహితుడు ఎ.నాగసత్యనారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై అత్తిలి మండలం పాలి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రేలంగి నుంచి పాలి వెళ్తున్న ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొంది. ఈ ఘటనలో వెంకన్న తలకు బలమైన గాయమైంది. అక్కడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణకు స్వల్పగాయాలయ్యాయి. ఈఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రేలంగి
-
తంగిరాలకు అంతిమ వీడ్కోలు
రేలంగి (తణుకు, తణుకు అర్బన్): ప్రముఖ పంచాంగ కర్త, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి(51)కి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అంతిమవీడ్కోలు పలికారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన పార్థివదేహం ఆదివారం తెల్లవారుజామున రేలంగిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆయన మృతి విషయం తెలుసుకున్న బంధువులు, అభిమానులు, ప్రముఖులు రేలంగి తరలివచ్చి పూర్ణయ్య సిద్ధాంతి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం రేలంగిలోని నరసింహస్వామి ఆలయ ప్రాంతంలోని శ్మశానవాటిక వద్ద శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రాథమిక విద్య రేలంగిలోనే.. తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి 1962 అక్టోబరులో ప్రముఖ పంచాంగకర్త, టీటీడీ ఆస్థాన సిద్ధాంతి హనుమంత్ సిద్ధాంతి, కమలమ్మ దంపతులకు జన్మించారు. 10వ తరగతి వరకు రేలంగిలోని తుమ్మలపల్లి మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్ అత్తిలి ఎస్వీవీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు. అనంతరం తండ్రి హనుమంత్ సిద్ధాంతి వద్ద, గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులైన సోమాంచి కృష్ణశాస్త్రి వద్ద జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల్లో అభ్యసనం చేశారు. తండ్రి హనుమంత్ సిద్ధాంతి బాటలోనే ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి నడిచారు. టీటీడీ ఆస్థాన సిద్ధాంతిగా, పంచాంగకర్తగా రాష్ట్రవ్యాప్తంగానే కాక ఒడిషా, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు. అనువంశికంగా 13 తరాలుగా ఈయన కుటుంబం పంచాంగకర్తలుగా పేరుగాంచారు. ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు, వ్యాపార, పత్రికా సంస్థలకు ఏటా పంచాంగం అందించిన ఘనత ఈయనకే దుక్కుతుంది. మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, శారదాపీఠం శృంగేరీ స్వామీజీ వంటి ప్రముఖుల దివ్య ఆశీస్సులు పొందడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో ఉగాది సత్కారాలు, వివిధ సంస్థలచే పౌర సన్మానాలు పొందారు. ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి తల్లి కమలమ్మ, భార్య శ్రీలక్ష్మి, కుమారుడు వెంకట బాల హనుమాన్, కుమార్తె కమల ప్రసన్న, సోదరుడు ప్రసాద్‌లను పలువురు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ దేవస్థానం తరఫున ముఖ్య ఇంజినీరింగ్ అధికారి శ్రీహరి హాజరై సిద్ధాంతి కుటుంబాన్ని పరామర్శించారు. గోపూజతోనే దినచర్య.. ఇంటి ఆవరణలోని గోవులను ప్రేమగా నిమరడం ద్వారానే ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి దినచర ్య ప్రారంభించేవారు. అనంతరం గృహంలో పూజ కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి వాస్తు, పంచాంగ, జ్యోతిష్య సలహా, సూచనల కోసం వచ్చే వారికి వివరంగా అన్ని విషయాలు తెలిపేవారు. నా శిష్యుడు కావడం గర్వంగా ఉంది ప్రభాకర పూర్ణయ్య మిత భాషి, నిగర్వి. వాగ్దేవీ కటాక్షాన్ని వాక్కులో ఓలలాడించే సరస్వతీ పుత్రుడు. జ్యోతిష్య శాస్త్ర, ముహూర్త జాతక రంగాల్లో మేటి విద్వాంసుడుగా రాణించిన అతడు నా విద్యార్థి కావడం గర్వంగా ఉంది. - భాగవతుల విశ్వనాథశర్మ, రిటైర్డ్ తెలుగు పండితులు, తణుకు రేలంగికి మంచి పేరు తెచ్చారు తణుకు వద్ద రేలంగి అనగానే రేలంగి సిద్ధాంతిగారి ఊరు అనే విధంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి మంచి పేరు తెచ్చారు. ఉదార స్వభావమున్న వ్యక్తి. ఎందరో ప్రముఖులు ఆయన కోసం గ్రామానికి వచ్చేవారు. ఆయన మృతి గ్రామానికి తీరని లోటు. - వడ్డి మార్కండేయులు, ఉపసర్పంచ్, రేలంగి -
తండ్రికిచ్చిన మాట కోసం.. సినీ పరిశ్రమకు దూరం
తాడేపల్లిగూడెం: ప్రముఖ సినీ హాస్యనటుడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య ఏకైక వారసుడు సత్యనారాయణ బాబు (75) కన్నుమూశారు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం ఆయన భౌతిక కాయానికి హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య కుసుమకుమారి, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణబాబు మృతితో తాడేపల్లిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నటన కలగానే మిగిలింది. బాల్యం నుంచి సత్యనారాయణ బాబుకు నటనంటే అమితాసక్తి. మద్రాసులో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌కందాతో కలసి సత్యనారాయణ బాబు సినిమాలో నటించారు. నాటకాలలో ప్రవేశమున్న బాబు మూడుసార్లు ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్నారు. నగేశ్ లాంటి మంచి కమెడియన్ కావాలనేది ఆయన కోరిక. బాలానందం అనే సినిమాలో హీరో, విలన్‌గా బాబు నటించారు. చట్టాలు మారాలి అనే తెలుగు సినిమాను తమిళంలోకి డబ్బింగ్ చేసి నిర్మాతగా కూడా అవతారమెత్తారు. అనంతరం సినీ రంగాన్ని వీడిన 75 ఏళ్ల వయసులోను తనలో ఉన్న నటనా ఆసక్తిని వదులుకోలేక, తన చిన్న కుమారుడు హేమంత్‌కు నటనలో శిక్షణ ఇప్పించారు. హేమంత్‌ను నటునిగా చూడాలని, గూడెంలో ఉన్న రేలంగి చిత్రమందిర్‌ను మల్లీఫ్లెక్సుగా తీర్చిదిద్దాలని ఆయన కన్న కలలు నెరవేరకుండానే దివికేగారు. బాబు పెద్దఅల్లుడు మెదక్ జిల్లా సదాశివపేట చైర్మన్‌గా పనిచేశారు. కొడుకులు ఇద్దరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. తండ్రి మాట కోసం.. నవ్వుల రేడు రేలంగి తనయుడు కావడంతో ఆ రోజుల్లోనే సత్యనారాయణ బాబుకు నాయకునిగా, ప్రతినాయకునిగా, హాస్యనటునిగా అనేక అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని సినిమాల్లో నటించినా ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయారు. తండ్రి జీవితంలో నేర్చుకున్న పాఠాలసారం నుంచి గ్రహించిన అనుభవంతో చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటించి, రేలంగి మెచ్చిన రాముడిలా బాబు జీవితకాలం మెలిగారు. చెన్నపట్నాన్ని వదిలి తాడేపల్లిగూడెంలో ఉంటూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు. గూడెంలో తండ్రి నిర్మించిన రేలంగి చిత్రమందిర్ బాధ్యతలను చూసుకుంటూ సత్యనారాయణ బాబు ఇక్కడే ఉండిపోయారు. అనంతరం ఆయన కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డా, ఎక్కువ కాలం గూడెంలో థియేటర్ వెనుక ఉన్న గెస్ట్‌హౌస్‌లోనే ఉండేవారు. తన కుటుంబానికి గుర్తింపునిచ్చిన గూడెంలో ఉండటానికే మక్కువ చూపేవారు. -
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...
స్కూల్లో చదువుకునే రోజుల్లో రేడియో పుణ్యమా అని ‘‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...’’ పాట చెవిన పడింది. తెగ నచ్చింది. కారణం... బరువైన భావాలు ఏమీ లేకుండా మామూలు మాటల్లో సంభాషణగా సాగడం. రాసింది కొసరాజుగారు. ఆ పాట నాకు బాగా నచ్చిందన్న విషయం గ్రహించి మా అమ్మగారు ఒక క్యాసెట్లో రికార్డ చేయించి ఇంట్లో పెట్టారు. అప్పటినుంచి టేప్ రికార్డర్లో పెట్టుకుని చాలాసార్లు వినేవాడిని. వినేకొద్దీ కొత్త కొత్త అర్థాలు తెలిసేవి. తర్వాత చాలాకాలానికి ‘కులగోత్రాలు (1962)’ టీవీలో వస్తే ఆ పాట కోసమే చూశాను. ఇంకా నచ్చింది. పేకాటలో డబ్బు పోగొట్టుకున్న రమణారెడ్డిని రేలంగి ఓదారుస్తూ, ధైర్యం చెబుతూ మళ్లీ ముగ్గులోకి దింపే క్రమం ఈ పాటలోని సారాంశం. అయ్యయ్యో చేతిలో డబ్బులుపోయెనే/ అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే/ఉన్నది కాస్తా ఊడింది... సర్వమంగళం పాడింది. పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది... అని నెత్తిమీద చెంగేసుకుని ఏడుస్తూ కూర్చుంటాడు రమణారెడ్డి. రేలంగి ప్రవేశించి ‘ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ/ ఓటమి తప్పలేదు భాయీ...’ అంటాడు. సాధారణంగా జూదం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది పాండవులు, శకుని. ‘ఆ మహామహా మన ధర్మరాజుకే తప్పలేదు భాయీ...’ అని రాయొచ్చు. కానీ కొసరాజుగారు నలమహారాజును ఉపమానంగా చెప్పారు. ఎందుకు చెప్పారో చాలాకాలం తెలియలేదు. ఆలోచించగా, ఆలోచించగా ఒక ఔచిత్యం ఉందనిపించింది. నలమహారాజు గుణగణాల్లో పాండవులందరూ కనిపిస్తారు. ధర్మరాజులాగ జూదమాడడం, భీముడిలాగ వంటచేయగలగడం, అర్జునుడి మాదిరిగా వివాహానికి స్వయంవరం కావడం, నకులుడిలాగ అశ్వాలను వేగంగా పరుగెత్తించగలగడం, సహదేవుడిలాగ కత్తియుద్ధంలో నిపుణుడు కావడం... వెరసి పాండవులంతా నలుడిలో కనిపిస్తారు. జూదం ఆడింది ధర్మరాజు అయినా నష్టపోయి కష్టాల పాలైంది మాత్రం పాండవులు ఐదుగురూనూ... అందుకే నలమహారాజును పంచపాండవుల ప్రతీకగా కొసరాజుగారు ప్రయోగించారేమో అనిపిస్తుంటుంది నాకు. అడగడానికి ఆయనలేరు, అనుకోవడమే తప్ప! సరే, ‘నలమహారాజుకే ఓటమి తప్పలేదు, నువ్వెంత?’ అనే అర్థంలో రేలంగి అనగానే... రమణారెడ్డి ‘మరి నువు చెప్పలేదు భాయీ’ అంటాడు. వెంటనే రేలంగి అది నా తప్పుగాదు భాయీ/ తెలివితక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ/ బాబూ నిబ్బరించవోయీ... అంటాడు. నిజమే! జూదమాడే వాడిని ప్రత్యర్థి ఎందుకు హెచ్చరిస్తాడు? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే... అనే సామెత కూడా అలా వచ్చిందే. ఇక డబ్బు పోయాక చేసేదేమీ లేకపోతే పుట్టేది వేదాంతమే. ‘నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది/ ఎంతో పుణ్యం దక్కేది’ అంటూ నిట్టూరుస్తున్న రమణారెడ్డికి వంతపాడుతూ ‘చక్కెర పొంగలి చిక్కేది’ అంటాడు పక్కనున్నతను. ఇది కొసరాజు గారి మార్కు. చిన్న కౌంటరుతో వినేవాళ్లకి నవ్వులు తెప్పించడం వీరి పాటల్లో సర్వసాధారణం. జూదంలో డబ్బు పోగొట్టుకున్నవాళ్ళు ‘మా ఆవిడకి ఇచ్చినా బాగుండేది. నెక్లెస్ కొనుక్కునేది’, ‘తిరుపతి హుండీలో వేసినా బాగుండేది పుణ్యం దక్కేది’ అనుకోవడం సర్వసాధారాణం. కొంతమంది బాధలో ఇంకాస్త అతిశయోక్తికి పోతారు. అందుకే కొసరాజుగారు ఇలా అనిపించారు. ‘ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎం.ఎల్.ఏ. దక్కేది’ అనగానే, రేలంగి ‘మనకు అంతటి లక్కేది’ అని రమణారెడ్డిని వాస్తవికలోకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఏడుపుల పర్వం అవగానే జూదరులు జూదం మానేస్తారనుకోవడం పొరపాటు. పోగొట్టుకున్నచోటే ఏరుకోవాలి అనేది వీళ్ళ ఫార్ములా. అందుకే రేలంగి, రమణారెడ్డిల మధ్య సంభాషణ ఇలా రాశారు కొసరాజు గారు. ఈ చరణంలో రమణారెడ్డికి బ్రెయిన్‌వాష్ చేయడానికి రేలంగి మిత్రులు కూడా చేరతారు. రేలంగి: గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు రేలంగి మిత్రులు: మళ్ళీ ఆడి గెల్వవచ్చు రేలంగి: ఇంకా పెట్టుబడెవడిచ్చు రేలంగి మిత్రులు: ఇల్లు కుదవ చేర్చవచ్చు రేలంగి: ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు రమణారెడ్డి: పోతే... రేలంగి: అనుభవమ్ము వచ్చు రమణారెడ్డి: చివరకు జోలె కట్టవచ్చు అంటూ మళ్ళీ తనదైన క్లోజింగ్ పంచ్‌తో ముగించారు కవిగారు. ఎంతపోయినా అనుభవం వస్తుందిలే అనుకుని సరిపెట్టుకోవడం జూదవ్యామోహానికి పరాకాష్ఠ. అలా సరిపెట్టుకునేవాడికి ఎవడు మాత్రం ఏం చెప్పగలడు?! నలమహారాజు నుంచి నేటి తాజా జూదరుల వరకు ఎటువంటి మార్పూ రాలేదు. నా మిత్రులు కొందరు క్యాసినోలాడుతూ ఉంటారు. వారిది ఇదే వరుస. పోయిందన్న బాధ పూట కూడా ఉండదు. అప్పు చేసైనా, క్రెడిట్ కార్డు గీకి అయినా రెడీ అయిపోతారు. ఎంత పోగొట్టుకుంటే అంత కసి పెరిగిపోతుందన్నమాట. కొందరైతే ‘‘దేవుడా! ‘కష్టపడి...’ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు ఎంతిస్తావో 10 శాతం నీ హుండీలో వేస్తాను’’ అని ఇష్టదైవంతో బేరాలు చేస్తుంటారు కూడా. వాళ్ళ ‘కష్టాన్ని...’ భగవంతుడు గుర్తించుగాక! జూదరుల మనస్తత్వానికి అద్దం పట్టే ఈ పాట ఎవర్గ్రీన్. పిఠాపురం, మాధవపెద్ది, రాఘవుల గళాలు, సాలూరి రాజేశ్వరరావుగారి స్వరాలు ఈ పాటకు వరాలు. - సంభాషణ: నాగేశ్