to release
-
జైలు నుంచి జనంలోకి..
• క్షమాభిక్ష ఫలం.. 39 మంది ఖైదీలకు విముక్తి • విశాఖ జైలు నుంచి 41 మంది విడుదలకు అనుమతి • పూచికత్తు కట్టలేక ఒకరు.. వేరే కేసులో శిక్షతో మరొకరు జైలులోనే • బంధువుల పరామర్శలు.. ఆత్మీయ పలకరింపులు • జైలు బయట ఉద్విగ్న వాతావరణం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది.. సర్కారు కరుణించింది.. గణతంత్ర దినోత్సవం రోజు వారికి స్వేచ్ఛ లభించింది. వివిధ నేరాల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ.. సత్ప్రవర్తనతో మెలిగిన వారిని విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో.. వారందరూ శిక్షాకాలం ముగియకముందే బాహ్య ప్రపంచాన్ని చూడగలిగారు. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారు. బంధువులను చెంతకు చేరగలిగారు. క్షణికావేశంలో తప్పు చేసి జైలులో మగ్గిపోయామని.. విలువైన జీవితాన్ని కోల్పోయామని.. జీవితంలో మరోసారి తప్పు చేయబోమని వారు స్పష్టం చేశారు. విడుదలైనా.. తప్పని నిరీక్షణ.. జైలు నుంచి విముక్తి లభించినా.. ఆ ఆవరణ నుంచి బయటపడేందుకు ఇద్దరికి సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. తమతోపాటు విడుదలైనవారంతా బంధువులతో కలిసి ఆనందంగా వెళ్లిపోగా.. ఆ ఇద్దరు వృద్ధులు మాత్రం సాయంత్రం వరకు జైలు బయటే ఉసూరుమంటూ ఉండిపోయారు. కారణం.. వారి బంధువులెవరూ రాకపోవడమే. మాచెర్ల సూరిబాబు(54), నిమ్మల బెన్ను(53) వృద్ధులు. వారిని తీసుకెళ్లడానికి బంధువులెవరూ జైలు వద్దకు రాలేదు. దీంతో ఊరెలా వెళ్లాలో తెలియక వారిద్దరూ జైలు ఆవరణలోనే నిరాశతో కూర్చుండిపోయారు. బెన్ను బంధువులు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుని అతన్ని తమతో తీసుకెళ్లారు. సూరిబాబు బంధువులు మాత్రం సాయంత్రానికి కూడా రాలేదు. దాంతో జైలు అధికారులే సిబ్బంది సహాయంతో అతన్ని స్వగ్రామమైన చోడవరం మండలం దోడపూడికి పంపించారు. ఆరిలోవ: మంగళవారం ఉదయం.. పిల్లలు, పెద్దలు అందరూ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో ఉన్నారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద ఆ సంబరాలతోపాటు ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జైలు బయట అనేక మంది ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి వారి నిరీక్షణ ఫలించింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. ఒక్కొక్కరు బయటకు రావడం ప్రారంభించారు. వారంతా జీవితఖైదు శిక్ష పడిన వారే. బయటకొస్తూనే ఒకవైపు అధికారులకు వీడ్కోలు.. మరోవైపు తమ బంధువులను చూసిన ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. పలకరింతలు.. పరామర్శలతో ఆ ప్రాంగణంలో ఆనందం వెల్లివిరిసింది. సత్ప్రవర్తనతో మెలిగిన జీవిత ఖైదీలను శిక్షాకాలానికి ముందే విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు గణతంత్ర దినోత్సవమైన మంగళవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి 39 మంది ఖైదీలను విడుదల చేశారు. 41మందికి అవకాశమున్నా.. గత ఏడాది నవంబరు 18న ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం.. విశాఖ జైలు నుంచి విడుదలకు అర్హులైన 41 మంది ఖైదీల పేర్లతో అధికారులు జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఆ మేరకు 41 మంది విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఆదినారాయణ అనే ఖైదీ రూ 50 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వలేక విడుదల నోచుకోలేదు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బంధువులు వచ్చి పూచీకత్తు ఇచ్చిన వెంటనే ఆయన్ను విడుదల చేస్తారు. మరో ఖైదీ జామి కుమార్ మరో కేసులో రెండేళ్ల శిక్ష అనుభవించాల్సి ఉన్నందున ఆయన్ను విడుదల చేయలేదు. మిగిలిన 39 మంది విముక్తి పొందారు. మరోసారి ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో మెలుగుతామంటూ జైలు అధికారులకు హామీ ఇచ్చి.. వీడ్కోలు తీసుకున్నారు. తప్పు చేస్తే క్షమాభిక్ష రద్దే విడుదలైనవారు మళ్లీ తప్పు చేసి జైలుకు వస్తే క్షమాభిక్ష రద్దయ్యే అవకాశం ఉందని, అందువల్ల సత్ప్రవర్తనతో మెలగాలని విడుదలైన ఖైదీలకు జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాసరావు సూచించారు. జైలు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పొందిన ఖైదీల నుంచి రూ 50 వేల వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని విడిచిపెట్టామన్నారు. విడదులైనవారందరిలో మంచి మార్పు వచ్చిందన్నారు. వారు మరోసారి తప్పు చేయరనే నమ్మకం ఉందన్నారు. 498(ఎ) ఖైదీలకూ విముక్తి విడుదలైన వారిలో 498(ఎ) కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఉన్నారు. భార్యను హత్యచేసిన కేసులో 498(ఎ) సెక్షన్ కింద శిక్ష పడితే 14 ఏళ్ల సాధారణ జీవిత ఖైదుతోపాటు మరో ఆరేళ్లు రెమిషన్ పీరియడ్.. మొత్తం 20 ఏళ్ల శిక్ష అనుభవించాలి. ఇటువంటి శిక్షలు పడిన వివాఖ నగరానికి చెందిన జి.ఎల్లయ్యరెడ్డి, డి.నాగేశ్వరరావులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేశారు. జీవో ప్రకారం విడుదలకు అర్హులైన మహిళలు, 65 ఏళ్ల దాటిన వృద్ధులు మాత్రం లేరు. -
ఆ హీరోయిన్ను విడుదల చేయండి
ప్రజ్వల హోమ్‌కు నాంపల్లి కోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం కేసులో అరెస్టయి, ప్రజ్వల రెస్క్యూ హోమ్‌లో ఉంటున్న సినీ నటిని విడుదల చేయాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు బుధవారం ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన నటి ఎర్రమంజిల్ కోర్టు ఆదేశంతో రెస్క్యూ హోమ్‌లో ఉంటున్న విష యం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆమె తల్లి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బుధవారం న్యాయమూర్తి టి.రజని విచారించారు. సదరు నటి మేజర్ అని రెస్క్యూ హోమ్‌లో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. పోలీసులు చెబుతున్నదానిలో వాస్తవం లేదని.. ఆమెను విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. సదరు నటిని హోం నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. -
నేడు మార్గదర్శకాల విడుదల
ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు గురువారం వెలువడనున్నాయి. ప్రధానమంత్రి ఆమోదించిన మార్గదర్శకాలను కేంద్ర వ్యక్తిగత శిక్షణ మంత్రిత్వ శాఖ గరువారం విడుదల చేయనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్యోగుల తుది కేటాయిం పుల వరకు ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా ‘ఆర్డర్ టు సర్వ్’ ఉత్తర్వులను కమలనాథన్ కమిటీ సవరించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞాపనలపై కమలనాథన్ కమిటీ గురువారం చర్చించనుంది. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు నాగిరెడ్డి, పీవీ రమేశ్, కేంద్ర వ్యక్తిగత శిక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ పాల్గొంటారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనునున్నారు. ఇరు రాష్ట్రాలకు ఏ శాఖలో ఏ విభాగంలో ఏ కేడర్‌లో ఎన్ని పోస్టులుండాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అన్ని శాఖాధిపతుల్లో పోస్టుల సంఖ్య, ఎంత మంది ఉద్యోగులున్నారు, ఎన్ని పోస్టులు ఖాళీలుగా ఉన్నాయనే వివరాలను ఆన్లైన్లో పంపేందుకు వీలుగా రాష్ట్ర పునర్విభజన విభాగం నాలుగు నమూనా పత్రాలను రూపొందించింది. కాగా, తొలి నమూనాపత్రం నింపేందుకు బుధవారంతో గడువు ముగి సింది. గురువారం నాటి సమావేశంలో ఆ నమూనా పత్రంలో వచ్చిన వివరాలపై కమలనాథన్ కమిటీ చర్చించనుంది. మిగతా రెండు, నాలుగు నమూనా పత్రాలు నింపేందుకు వచ్చే నెల 5 వరకూ గడువు ఇవ్వనున్నారు. ఇదిలాఉండగా ప్రధాని ఆమోదం పొందిన ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు గురువారం వెలువడిన తర్వాత నాలుగైదు రోజుల్లో ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాలన్నింటిపైనా కమలనాథన్ కమిటీ చర్చించనుంది. ప్రతీ నెల తొలి వారంలో అపెక్స్ కమిటీ భేటీ విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్యా గల సమస్యల పరిష్కారంపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతీ నెల తొలి వారంలో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 3న అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. చిన్న చిన్న సమస్యలపై రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ కార్యదర్శులు ప్రేమచంద్రారెడ్డి, రామకృష్ణారావు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలకు అపెక్స్ కమిటీతో ఆమోద ముద్ర వేయించనున్నారు.