Renuka chaudary
-
‘కాంగ్రెస్‌కు భట్టి, రేణుక రెండు కళ్లు అయితే పొంగులేటి మూడో కన్ను’
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి రెండు కళ్ళు అని, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తమ మూడో కన్నుఅని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసని, అలానే పొంగులేటి తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో 10కి 10 సీట్లుగెలిపించాలని, రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత తమదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఎందుకు రాదో తాను చూసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇద్దామని అన్నారు. జూలై 2న రాహుల్ గాంధీ హాజరుకానున్న ఖమ్మం జనగర్జన సభా ప్రాంగణం, ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పొంగులేటితో కలిసి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగైదు నెలలుగా పొంగులేటితో చర్చలు జరిపామని, కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తరువాతే ఆయన నిర్ణయం తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు. తనకు కష్టమైనా, నష్టమైనా వారి అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు పకడ్బందీ ఏర్పాట్లు జూలై 2న ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అందుకే మేంమంతా ఇక్కడకు వచ్చాం. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై కాంగ్రెస్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తన వంతు సాయంగా ఉండేందుకు 1,500 బస్సులు సభ కోసం తీసుకోవలనుకున్నారు. కానీ ఒంటికన్ను శివరాసనుడు బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారు. మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారు. మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారు. సభను విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు సీఎం కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నా. ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. బీఆర్ఎస్ సభ కంటే ఎక్కువ మంది సభలో కదం తొక్కుతారు. కావాలంటే లెక్క కట్టుకో కేసీఆర్. ఖమ్మం సభతో బీఆరెస్ పాలనకు సమాధి కడుతాం. పార్టీలో పాత, కొత్త లేకుండా కలిసి ముందుకు సాగుతాం. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు. బంగాళాఖాతంలో కలిపేస్తాం. గిరిజనులపై కేసులను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ పోడు పట్టాలు ఇస్తుండు. కాంగ్రెస్ పోరాట ఫలితమే పోడు భూములకు పట్టాలు టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళుతున్నాడని కేటీఆర్ అంటున్నాడు. ఆనాడు చంద్రబాబు పదవి ఇవ్వకపోతేనే కదా మీ అయ్య టీడీపీని వీడింది. తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆర్ఎస్ను బొంద పెట్టడం ఖాయం’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సమాజం భట్టి పాదయాత్ర ఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ కోసం కాదని.. తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రేవంత్ రెడ్డి, మధుయాష్కీ కలిశారు. జూలై 2న ఖమ్మంలో జరగనున్న తెలంగాణ జనగర్జన బహిరంగ సభ ఏర్పాట్లపై భట్టితో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 107 రోజులుగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారన్నారు. పార్టీలో చేరుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నాయకులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నమన్నారు. ఖమ్మం సభకు రాహుల్ గాంధీ హాజరై తెలంగాణలో జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కార్యాచరణ పై సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర లో తెలుసుకున్న ప్రజల సమస్యలు వాటికి చూపించబోయే పరిష్కారం ఆ వేదిక మీద చర్చిస్తామని ఆయన చెప్పారు. సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది కాంగ్రెస్ సభకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సభ జరిగే రోజున ఖమ్మంలో మంచినీరు వదలొద్దని అధికారులను ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో సభ విజయవంతం కావొద్దని జిల్లా మంత్రి యత్నిస్తున్నారని అయినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ ఉంటుందని పొంగులేటి తెలిపారు. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విమర్శించారు. నగరంలోని 27వ డివిజన్లో కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన వారు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేణుకాచౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుంటాయని, ఉద్యోగాలు వస్తాయ ని పలువురు ఆశించారని, కానీ రాష్ట్రంలో ఒక కుటుంబంలోనే వెలుగులు నిండాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురికే పండగలా ఉందన్నారు. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, డబుల్‌బెడ్ రూం, ఇంటికో ఉద్యో గం, దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మనెంట్ వంటి హామీలన్నింటిని గాలికొదిలేశారని ఆరోపించారు. గతంలో కాం గ్రెస్ చేసిన అభివృద్ధినే తమదిగా టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లకు అదనంగా ఎక్కడైనా రోడ్లు వేశారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాగండ్ల దీపక్‌చౌదరిని అభినందించారు. అనంతరం దీపక్‌చౌదరి మాట్లాడుతూ నగరంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అంతకముందు పార్టీ జెండా ను రేణుకాచౌదరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు దిరిశాల భద్రయ్య, ఎస్కె.పాషా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, కొత్తగూడెం జిల్లా నాయకుడు యడవల్లి కృష్ణ, సైదులు నాయక్, ఎస్కె.ఖాజా, మొహినుద్దీన్, పిడతల రామ్మూర్తి పాల్గొన్నారు. -
రేణుకా చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
ఖమ్మం, మామిళ్లగూడెం : డాక్టర్ రాంజీనాయక్ మరణానికి కారకురాలైన మాజీ మంత్రి రేణుకచౌదరిని కాంగ్రేస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేలోతు రవిచంద్రచౌహాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైరా, ఇల్లందు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని, ఒక్కొక్క సీటుకు ఐదుగురు పోటీ పడేవిధంగా చేసి, మాయమాటలతో రూ.కోటి పై చిలుకు తీసుకొని సీటు ఇవ్వకుండా మోసంచే చేశారని ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన రాంజీనాయక్ చనిపోయారని అన్నారు. అతని భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తీసుకున్న డబ్బు అతని భార్యా పిల్లలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ పెద్దలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కుంతియా, భట్టి విక్రమార్క, దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి వినతులు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాంజీ కుటుంబానికి న్యాయం చేయని పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఇంటింటి ప్రచారం చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు భీమానాయక్,మైనార్టీ నాయకురాలు నజీమా తదితరులు పాల్గొన్నారు. -
మహిళా మంత్రిని ‘చెత్త’ అన్న రేణుకాచౌదరి!
పార్లమెంటులో నేతల మధ్య దూషణల పర్వం శ్రుతి మించుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తన పట్ల అసభ్య పదజాలం ఉపయోగించారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. రేణుకా చౌదరి, జైరాం రమేష్ ఇద్దరూ తనను చెత్త అన్నారని.. శుక్రవారం నాడు సభ వాయిదా పడిన తర్వాత ఇదంతా జరిగిందని ఆమె చెప్పారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వీళ్లిద్దరిపైనా రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వల్ల పార్లమెంటు భద్రతకు ముప్పు ఉంటుందన్న అంశంపై తాను మాట్లాడబోతుండగా జైరాం రమేష్, రేణుకా చౌదరి ఇద్దరూ అడ్డుపడ్డారని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ చాలా మొరటుగా ప్రవర్తించారని.. అసలు రాజ్యసభలో సభ్యత్వం లేకుండా ఆ సభలోకి ఎలా వస్తారని అడిగారని అన్నారు. నిజానికి బాదల్ లోక్‌సభ ఎంపీయే అయినా.. మంత్రి కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడేందుకు ఆమెకు అర్హత ఉంటుంది. అయితే.. రేణుకా చౌదరి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాదల్ చేసేదంతా రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు కచరా అనే పదం ఆమెకు ఎక్కడి నుంచి వినిపించిందని ప్రశ్నించారు. తాను ఇంగ్లీషులో మాట్లాడాను తప్ప హిందీలో కాదని అన్నారు. ఆమెకు వినికిడి లోపం అయినా ఉండాలి లేదా ఇంగ్లీషు అయినా రాకపోవాలని వ్యాఖ్యానించారు. వాళ్లు పంజాబ్‌లో ఓడిపోతున్నారని.. అందుకే ఓట్ల కోసం ఈ రాజకీయ డ్రామా చేస్తున్నారని అన్నారు. -
కాంగ్రెస్‌లో ‘ఖమ్మం’ లొల్లి!
ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం అసెంబ్లీ టి కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి తారస్థాయికి చేరింది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ ఆశిస్తున్నవారితోపాటు వారి మద్దతుదారులు కూడా హస్తినలో చేరి ఎవరికి వారు ఎత్తులుపైఎత్తులు వేస్తున్నారు. ఏవర్గానికి ఆవర్గమే తమతమ అభ్యర్థులకు ఉన్న అర్హతలు, ఎదుటివారి బలహీనతలు ఢిల్లీ పెద్దలముందు ఏకరువు పెడుతున్నారు. బయటకు మాకే సీటు ఖాయం అంటూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. కాగా, ఇంత రభస నడుమ తెరమీదకు వచ్చిన మరో అంశంపై కూడా ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చజరుగుతోంది. విభేదాలతో తలనొప్పి తెస్తున్న జిల్లాకాంగ్రెస్‌లో ఇరువర్గాలు సూచిస్తున్న ఎవరికీ ఇవ్వకుండా ఖమ్మం అసెంబ్లీనుంచి కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని తెలంగాణ పీసీసీ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలు మారేవారికి టికెట్ ఇస్తే పలుచన అవుతాం.. సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని వదిలిపెట్టి నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తే ప్రజల మధ్య పలుచన అవుతామని రాంరెడ్డి వర్గీయులు అధిష్టానం ముందు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేణుకాచౌదరి మద్దతు తెలుపుతున్న పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీలు మారి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారని, ఇప్పుడు టికెట్ ఆశించడం ఎంత వరకు సబబని మంత్రి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సీపీఐకి ఇస్తే ఆ పార్టీ నుంచి పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఎమ్మెల్యేగా కుమారుడు, ఎంపీగా తండ్రి బరిలో దిగితే పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని అంటున్నారు. పార్టీని వెన్నంటి ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్‌కు అవకాశం ఇవ్వాలని రాంరెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. ఇలా ఉండగా... ఏది ఏమైనా నా అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాల్సిందే అని రేణుకాచౌదరి అధిష్టానం వద్ద పట్టుపడుతున్నట్లు సమాచారం. అయితే.. తెలంగాణ ఉద్యమాన్ని ఇన్స్టంట్ కాఫీతో పోల్చిన రేణుకాచౌదరిపై ఆగ్రహంతో ఉన్న టీపీసీసీ నాయకులు తెలంగాణలో టికెట్ల కేటాయింపుపై ఆమె పెత్తనం ఏమిటని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, ఖమ్మంలో మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అనుభం తనకుందని మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్ కూడా టికెట్‌కోసం తన అనుచరులతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మధ్యే మార్గం వైపు టీపీసీసీ చూపు తమ అనుచరుడికే టికెట్ ఇవ్వాలని రేణుకాచౌదరి, కాదు తమ సన్నిహితుడు మానుకొండకే టిక్కెట్ ఇవ్వాలని రాంరెడ్డి... ఇరువురూ పట్టుపట్టడంతో వీరెవరూ కాకుండా మధ్యే మార్గంగా మరొకరికి టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ అధిష్టానం ముందు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఒక వర్గం వారికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని, అలా కాకుండా మరొకరి పేరును పరిశీలిస్తే బాగుం టుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కోసం పోటీ పడిన గ్రానైట్ పరిశ్రమల యజమాని వద్దిరాజు రవి చంద్రకు అసెంబ్లీ టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. లేదంటే పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి ఇవ్వాల్సి వస్తే, ఖమ్మంలో బీసీ వర్గానికే చెందిన సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు పేరును ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల వారికి కాకుండా బీసీ వర్గానికి చెందిన రవిచంద్ర లేదా వనమా వెంకటేశ్వరరావుకు ఇస్తే బాగుంటుందని, బీసీలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందనే అభిప్రాయంలో ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈపరిస్థితులలో టికెట్ ఎవరికి వస్తుందో....తర్వాత ఆ ప్రభావం పార్టీలో ఎలా ఉంటుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది.