Reorganization bill
-
కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది! పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), రిజర్వేషన్ (సవరణ) బిల్లులను బుధవారం ఆయన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. అసెంబ్లీలో సీట్లను పెంచడంతో పాటు పలు కీలక అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 83 స్థానాలుండగా వాటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. కశ్మీర్ డివిజన్లో స్థానాలను 46 నుంచి 47కు, జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కు పెంచారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మర్ కూడా భారత్‌లో అంతర్భాగమే. కనుక అక్కడ కూడా 24 స్థానాలను అసెంబ్లీలో రిజర్వు చేశాం’’ అని అమిత్ షా సభకు వెల్లడించారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకే బిల్లులు 70 ఏళ్లుగా తమ హక్కులన్నింటినీ కోల్పోయి అన్నివిధాలా అన్యాయానికి గురైన కశ్మీరీలకు పూర్తిగా న్యాయం చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఇప్పటిదాకా 45 వేల మంది బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమివ్వకుండా మొదట్లోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఉంటే పండిట్లు లోయను వీడాల్సిన అవసరమే వచ్చేది కాదన్నారు. ‘‘కశ్మీర్లో 1947లో 31,789 కుటుంబాలు 1965–71 మధ్య 10,065 కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. ఇక 1980ల్లో ఉగ్రవాదం వల్ల మరెన్నో వేల మంది స్వదేశంలోనే శరణార్థులయ్యారు. వారందరికీ తిరిగి గుర్తింపుతో పాటు హక్కులు, అన్నిరకాల ప్రాతినిధ్యం కలి్పంచడమే తాజా బిల్లుల లక్ష్యం’’ అని వివరించారు. 2024లోనూ కేంద్రంలో మోదీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. అనంతరం రెండేళ్లలో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా ఉగ్రవాద విముక్తం చేసి తీరతాం’’ అని చెప్పారు. ‘‘కశ్మీరీల్లో ఎంతోమంది శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. బిల్లుతో వారికి హక్కులు సమకూరుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎన్నికల్లో నిలబడి గెలిచే ఆస్కారముంటుంది’’ అని తెలిపారు. బిల్లుల విశేషాలు.. ► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరుగుతుంది. ►ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు అసెంబ్లీలో తొలిసారిగా 9 స్థానాలు రిజర్వు చేశారు. ►కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారి కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించారు. వీటిలో ఒక మహిళకు అవకాశమిస్తారు. ►పీఓకే నుంచి నిర్వాసితులై వచ్చి స్థిరపడిన వారికి ఒక స్థానం కేటాయించారు. ►రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, వృత్తి విద్యా సంస్థల్లో పలు కేటగిరీల వారికి జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కలి్పస్తారు. ►ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు అందుతాయి. ►ప్రస్తుత రిజర్వేషన్ చట్టంలోని ‘బలహీన, గుర్తింపునకు నోచని వర్గాలు (సామాజిక కులాలు)’ అనే పదబంధాన్ని ‘ఇతర వెనకబడ్డ’గా మారుస్తారు. ►జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని లద్దాఖ్, కశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. -
సరైన సమయంలో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు తగిన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను దశాబ్దాల తరబడి పరిపాలించిన వారికంటే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రం ఆ ప్రాంతానికి ఎంతో చేసిందని చెప్పారు. జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) 2021 బిల్లుపై జరిగిన చర్చకు అమిత్ షా శనివారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ ఎప్పటికైనా రాష్ట్ర హోదా దక్కుతుందని పెట్టుకున్న ఆశలు ఈ బిల్లుతో అడియాసలుగా మారుతున్నాయని కొందరు సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. అఖిల భారత సర్వీసు ఆఫీసర్స్ జమ్మూకశ్మీర్ కేడర్ని అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్ టెర్రిటరీలతో కలపడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. కశ్మీర్ రాష్ట్ర హోదాకి ఈ బిల్లుకి ఎలాంటి సంబంధం లేదన్న అమిత్ షా సరైన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత మూజువాణి ఓటుతో బిల్లుని సభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. కశ్మీర్‌కే మొదట్నుంచి ప్రాధాన్యం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370కి మద్దతు పలికి 70 ఏళ్లకు పైగా ఆ ప్రాంతాన్ని అలాగే ఉంచిన కాంగ్రెస్ ఇతర పార్టీలు, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఈ బిల్లుపై ఎందుకు ఇన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని అమిత్ షా అన్నారు. 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జమ్మూకశ్మీర్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా కశ్మీర్‌కి స్వేచ్ఛగా వెళ్లి రావచ్చునని చెప్పారు. కశ్మీర్ పౌరులెవరూ తమ భూములు కోల్పోరని హామీ ఇచ్చిన అమిత్ షా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తగినన్ని భూములున్నాయని తెలిపారు. స్థానిక అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాజులు, రాణుల పాలనకు ఎవరూ అంగీకరించరని ప్రజలే ప్రభువులుగా ఉండాలన్నదే ప్రజాభీష్టంగా ఉందని వివరించారు. 2022 నాటికి కశ్మీర్‌కు రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముగిసిన మొదటి విడత సమావేశాలు లోక్‌సభ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు సాధారణంగా రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడతలో పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, బడ్జెట్ ప్రవేశం పెట్టడం ఉంటాయి. రెండో విడతలో వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై సంబంధిత స్టాండింగ్ కమిటీల పరిశీలన ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు, సంబంధిత గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం వంటివి ఉంటాయి. కాగా, మొదటి విడత బడ్జెట్ సమావేశాలు 100% ఫలప్రదంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. జనవరి 29వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్ణీత 50 గంటల్లో 49 గంటలపాటు సభ్యుల కార్యకలాపాలు కొనసాగాయన్నారు. 43 నిమిషాలపాటు మాత్రం అంతరాయం కలిగిందని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులు 13 ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారన్నారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్య అంశాలపై చర్చ కోసం అర్ధరాత్రి వరకు కొనసాగిన సందర్భాలున్నాయన్నారు. 5 ట్రిబ్యునళ్ల రద్దుకు లోక్‌సభలో బిల్లు ప్రజలకు పెద్దగా అవసరం లేని ఐదు ట్రిబ్యునళ్లను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రద్దు ప్రతిపాదిత ట్రిబ్యునళ్లలో ఎయిర్పోర్ట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డు ఉన్నాయి. వీటి కోసం సినిమాటోగ్రాఫ్ చట్టం–1952, కస్టమ్స్ యాక్ట్–1962, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ యాక్టు–1994 తదితరాలను సవరించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆర్థిక మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ట్రిబ్యునళ్లతో ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదని మంత్రి అన్నారు. వీటితో ఆర్థిక భారంతోపాటు పరిష్కారంలో కాలయాపన కూడా అవుతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రిబ్యునళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను కమర్షియల్ కోర్టులు/హైకోర్టులకు బదిలీ చేస్తామని తెలిపారు. -
సభలో చర్చ జరిగేనా.. బిల్లు సజావుగా వెళ్లేనా?
-
ఓటింగ్ డౌటే
-
ప్రతిపాదనల పరిస్థితేమిటో?
-
ప్రతిపాదనల పరిస్థితేమిటో?
విభజన బిల్లు సవరణలపై నేతల్లో చర్చ కిరణ్, బాబు సవరణలివ్వకపోవడం ఇబ్బందే! ఓటింగ్ జరిపినా కేంద్రం, రాష్ట్రపతి పట్టించుకునేనా? సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతల్లో తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం ఏ మేరకు స్పందిస్తుంది? మెజారిటీ సభ్యులు వ్యతిరేకించినంత వూత్రాన బిల్లును వెనక్కు తీసుకుంటుందా? బిల్లులోని కొన్ని అంశాలకే పరిమితవువుతూ సవరణలిస్తే, అది మొత్తం బిల్లును వ్యతిరేకించినట్టు అవుతుందా? మెజారిటీ సభ్యులు సవరణలు ప్రతిపాదిస్తే పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి, పార్లమెంటు నిలిపివేసే అవకాశవుుందా? ఇలాంటి పలు అంశాలపై ప్రజాప్రతినిధుల మధ్య చర్చలు సాగుతున్నాయి. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మెజారిటీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తే రాష్ట్రపతి దానిపై పునరాలోచన చేస్తారని కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలుసార్లు చెప్పడం, చర్చలో అందరూ పాల్గొనాలని సూచించడం తెలిసిందే. అయితే ఏకమొత్తంగా బిల్లునే వ్యతిరేకించేలా సవరణలు ప్రతిపాదించే బదులు, కీలకమైనవంటూ 12 క్లాజులపైనే కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. ఆ క్లాజుల్లోని లోపాలను ఎత్తి చూపుతూ, వాటిని తొలగించాలంటూ సవరణలు ప్రతిపాదించారు. బిల్లులోని ప్రతి క్లాజునూ తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. టీడీపీ సీమాంధ్ర నేతలు పలు క్లాజులను తొలగించాలని, మరికొన్నింటిని సవరించాలని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా అభిప్రాయాలతో సరిపుచ్చారు. టీఆర్ఎస్తో సహా అందరూ సలహాలు మాత్రమే ఇచ్చారు. కాకపోతే అతి కీలకమైన ఈ అంశంలో కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎలాంటి సవరణలూ ప్రతిపాదించకపోవడం తెలిసిందే. ఈ సవరణలపై ఓటింగ్‌కు ఆస్కారం లేదని, ఒకవేళ నిర్వహించినా సభా నాయకుడైన ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సవరణలు ప్రతిపాదించని కారణంగా ఓటింగ్ ఫలితాన్ని రాష్ట్రపతి గానీ, కేంద్రం గానీ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో పలు రాష్ట్రాల విభజన సవుయుంలో ప్రతిపాదించిన సవరణలను కేంద్రం పట్టించుకోలేదని వారు గుర్తు చేస్తున్నారు. బీహార్, యూపీల్లో పట్టించుకోలేదు: ఉత్తరాఖండ్ ఏర్పాటు బిల్లుపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 33 సవరణలు ప్రతిపాదించారు. వాటిలో 29 ప్రభుత్వానివి కాగా, 4 విపక్షాలవి. అయితే అసెంబ్లీ ఆమోదించిన ఆ సవరణల్లో ఒక్కదాన్ని కూడా కేంద్రం ఆమోదించలేదు. జార్ఖండ్ ఏర్పాటు బిల్లుపై బీహార్ అసెంబ్లీలో ఏకంగా 371 సవరణలను ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. వాటిలో కొన్నింటిని అసెంబ్లీయే వుూజువాణి ఓటుతో ఆమోదించి, మరికొన్నింటిని తిరస్కరించింది. అయితే సభ ఆమోదించిన వాటిని కూడా కేంద్రం పట్టించుకోలేదు. పైగా బీహార్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా తిరస్కరించింది. అత్యంత విలువైన భూగర్భ వనరులు, అడవులున్న ప్రాంతం జార్ఖండ్‌కు వెళ్లడం వల్ల బీహార్ భారీ ఆదాయూన్ని కోల్పోనుందని, అందుకు పరిహారంగా కేంద్రం రూ.1.79 లక్షల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించినా ఇప్పటికీ రాష్ట్రానికి నయూ పైసా కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని మొత్తం 108 క్లాజులపైనా ఆయా పార్టీల నుంచి స్పీకర్‌కు సవరణ విజ్ఞప్తులు అందాయి. మొత్తంమీద వందల కొద్దీ సవరణలు ప్రతిపాదించినా యూపీ, బీహార్ ఉదంతాల తరహాలోనే వాటన్నింటినీ కేంద్రం తిరస్కరించే ఆస్కారమే ఎక్కువని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయుపడుతున్నారు. ‘‘సీఎం ఉదాహరించిన యూపీ, బీహార్ విభజన బిల్లుల పై కేంద్రం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. అయినా మన బిల్లును రాష్ట్రపతి అడ్డుకుంటారనో, పార్లమెంటు ఆమోదించదనో కిరణ్ ఎందుకు చెబుతున్నారో తెలియడం లేదు. నిజంగా సవరణలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందన్న నమ్మకమే గనక కిరణ్, బాబులకు ఉంటే సవరణలు ఎందుకు కోరలేదన్న ప్రశ్న తలెత్తుతోంది’’ అని వారంటున్నారు.