Rescue crews
-
‘రాయ్’తుపాను విధ్వంసం.. 75 మంది మృతి
Super Typhoon Rai Hits Philippines: మనీలా: ఫిలిప్పీన్స్‌ను శక్తివంతమైన టైఫూన్ ‘రాయ్’తుపాను కుదిపేసింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాలు, గంటకు 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దినగట్, బొహోల్స్ ప్రావిన్స్‌లలో విధ్వంసం సృష్టించాయి. దినగట్లోని నివాసాల్లో 95% వరకు నేలమట్టమయ్యాయి. స్కూళ్లు, ఆస్పత్రులతోపాటు అత్యవసర షెల్టర్లు దెబ్బతిన్నాయి. (చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!) సియార్గావో నామరూపాల్లేకుండా పోయింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలడం తదితర ఘటనల్లో ఇప్పటివరకూ 75 మంది మరణించారని అధికారులు తెలిపారు. సుమా రు 3 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. లేకుంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని చెప్పారు. కొన్ని ప్రావిన్సుల్లో గురువారం నుంచే మొదలైన తీవ్ర గాలులు, వర్షాలతో దెబ్బతిన్న విద్యుత్, సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం ఇప్పటికీ వీలుకాలేదని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #BREAKING #PHILIPPINES 🔴PHILIPPINES: TYPHOON RAI INTENSIFIED TO CAT 5 STORM! #TyphoonRai / #TyphoonOdette rapidly intensified to a Category 5 storm before making landfall in the Southern Philippines on Thursday, forcing mass evacuations.#BreakingNews #Video #Storm #Tornado pic.twitter.com/yoTof2i6Uk — loveworld (@LoveWorld_Peopl) December 16, 2021 At least 12 people have died in the strongest #typhoon to hit the #Philippines, after the #storm swept across the archipelago uprooting trees, toppling power poles and #flooding villages. Severe flooding in #Mindanao.#TyphoonOdette #Rains #TyphoonRai pic.twitter.com/j7IiLG8WCR — 𝐁𝐡𝐚𝐛𝐚𝐧𝐢 𝐒𝐚𝐧𝐤𝐚𝐫 𝐉𝐞𝐧𝐚 (@Bhabanisankar02) December 18, 2021 (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!) LOOK: Philippine Coast Guard release aerial footage of Siargao Island showing extensive flooding. 📸: PCG #TyphoonRai #TyphoonOdette pic.twitter.com/5G9fYQJvsa — Howard Johnson (@Howardrjohnson) December 17, 2021 #Philippines: 18 dead as #TyphoonRai batters country#Odette #TyphoonOdette #Typhoon pic.twitter.com/4A7h3A3h5j — Ψ ABYSS Chronicles (@AbyssChronicles) December 18, 2021 The after math. At Mandaue City Cebu. 🙏😭#OdettePH #TyphoonRai #TyphoonOdette#TyphoonOdettePH Vid from Tina Fajardo pic.twitter.com/jFP8fRCzL4 — DJ Tors (@toraynosaurus) December 17, 2021 -
నా జీవితంలో మర్చిపోలేని ఘటన..
ముంబై: మహారాష్ట్రలో ఐదంతస్థుల భవనం కుప్పకూలి 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రాయ్‌గఢ్ జిల్లా మహద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ నదీమ్ బతికి బయటపడ్డాడు. తాజాగా మరో మహిళ క్షేమంగా బయటపడింది. వివరాలు.. మెహరున్నీసా అబ్దుల్ హమీద్ కాజీ(60) అనే మహిళ శిధిలాల కింద చిక్కుకుపోయింది. దాదాపు 26 గంటల తర్వాత మంగళవారం రాత్రి ఆమెను సహాయక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. కాంక్రీటు, ఉక్కు శిధిలాల కింద 26 గంటల పాటు బిక్కుబిక్కుమని గడిపింది మెహరున్నీసా. ఒక చిన్న రంధ్రం ద్వారా ఆమె తాను అక్కడ చిక్కుకున్నట్లు సహాయక సిబ్బందికి తెలియజేసింది. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. (చదవండి: నా రెండు చేతులూ పోయాయనుకున్నా..) అయితే అన్ని గంటల పాటు శిధిలాల కింద ఉండటం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బది పడటంతో సహాయక సిబ్బంది వెంటనే మెహరున్నీసాకు పోర్టబుల్ ఆక్సిజన్ మాస్క్ అమర్చారు. ఆమె బట్టలు, ముఖం, జుట్టు దుమ్ముకొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన తన జీవితంలో మర్చిపోలేనిదని.. పునర్జన్మ పొందినట్లు అనిపిస్తుంది అన్నారు మెహరున్నీసా. ప్రస్తుతం అధికారులు భవనం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా భవనంలో నివసించే ముస్తఫావ్ చాపేకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘2013 నుంచి నేను ఇక్కడ నివసిస్తున్నాను. భవన నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి ప్లాస్టర్లు ఊడిపోవడం జరుగుతూనే ఉంది. దీని గురించి బిల్డర్‌ని అడిగితే.. కట్టడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదన్నాడు’ అని తెలిపాడు. చాపేకర్ బిల్డింగ్ కూలడానికి కొద్ది సేపటి ముందే బయకటకు పరుగెత్తాడు. అయితే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఏదో ఓ చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మంగళవారం మధ్యప్రదేశ్‌లో రెండంతస్థుల భవనం కుప్పకూలింది. -
వైరల్ వీడియో: మంటలార్పడానికి వెళ్తే..
వాషింగ్టన్: మంటలర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిని.. ఓ ఎద్దు వెంబడించి తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. వివరాలు.. శుక్రవారం దక్షిణ కాలిఫోర్నియాలో లేక్ఫైర్ సంభవించింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే వెంచురా కౌంటీ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండగా.. ఉన్నట్లుండి ఓ ఫెర్డినాండ్(ఎద్దు జాతికి చెందిన జంతువు) వారిని వెంబడించింది. భారీగా మొనదేలిన కొమ్ములతో ఉన్న ఫెర్డినాండ్ ఫైర్ సిబ్బంది వెంట పడటంతో వారు కాలికి బుద్ధి చెప్పి పరుగు లంకించుకున్నారు. ఫైరింజన్ పైకి ఎక్కారు. కాసేపటికి ఫెర్డినాండ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని తెలిపిన కౌంటీ ఫైర్ విభాగం ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (అగ్నికీలల్లో ఆర్తనాదాలు) #LakeFire; Ferdinand the Bull wasn’t clowning around when he chased FF’s down the road. Crews were clearing the road so the engines could get to a clearing when they were chased out. Luckily no one was injured and #Ferdinand went about his day. @VCPFA #vcfd pic.twitter.com/vxdOTFoEB7 — Ventura County Fire (@VCFD) August 15, 2020 శుక్రవారం దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఈ అగ్రిప్రమాదంలో 18 వేల ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. హ్యూస్ సరస్సు సమీపంలో లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన వ్యాపించిన ఈ లేక్ ఫైర్‌లో 20 కి పైగా నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. చాలా మంది స్థానికులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. -
అరవింద్ ఇకలేడు..సందీప్ జాడ లేదు!
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన శంషాబాద్ వాసి అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారన్న వార్త విని అతడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అరవింద్‌కు ఈత వచ్చని, ఎలాగైనా బయటపడి ఉంటాడని భావించిన అతడి స్నేహితులకు నిరాశే మిగిలింది. ఇక అదే వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన గౌడవెల్లి వాసి సందీప్ జాడ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా బతికి వస్తాడంటూ ఆశతో ఉన్నారు. శంషాబాద్: ‘ఆయువు తీరిందారా.. పండు.. క్షేమంగా తిరిగి వస్తావనుకున్నం బిడ్డా, మంచిగ సదువుకునేటోడివి.. నీ మీదే గంపెడాశలు పెట్టుకున్నం.. నువ్వేమో తనువు చాలించినవ్..’ అంటూ బియాస్ నదిలో కొట్టుకుపోయి కానరానిలోకాలకు తరలివెళ్లిన విద్యార్థి అరవింద్ తాత, నాయనమ్మలు కన్నీంటి పర్యంతమవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. టీవీల్లో ఈ వార్త చూసిన అరవింద్ తాత, నాయనమ్మ ఈశ్వరప్ప, భద్రమ్మలతోపాటు శంషాబాద్‌లోని అతడి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అరవింద్ శంషాబాద్ పట్టణ వాసులైన వినోద్, శశిలత దంపతుల మొదటి కుమారుడు. ఒకటో తరగతి నుంచి పది వరకు శంషాబాద్‌లోని బాలయేసు (సెయింట్ ఇన్ఫాంట్ జీసస్) పాఠశాలలో చదివాడు. అనంతరం శశిలత పిల్లల చదువు కోసం వనస్థలిపురంలోని పుట్టింటికి వెళ్లింది. వినోద్ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అరవింద్ చురుకైన విద్యార్థిఅని అతడితో చదువులో ఎవరూ పోటీపడలేకపోయారని అతడి స్నేహితులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అరవింద్‌కు ఈత రావడంతో బతుకుతాడని ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. నా మనవడిని నెలరోజుల కిందజూసిన.. నా మనవడు అరవింద్ నెలరోజుల కింద శంషాబాద్‌కు వచ్చిండు. మమ్మల్ని పలకరించి పోయిండు. నదిలో కొట్టుకుపోయిండని తెలిసినప్పటి నుంచి వాడు బతికే వస్తడని అనుకున్నం. వాడు మంచిగ తిరిగిరావాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్న. నా పండుకు అప్పుడే ఆయువు తీరిందా.. అయ్యో.. దేవుడా ఎంతపని చేస్తివి! - భద్రమ్మ, అరవింద్ నాయనమ్మ టూర్‌కు పోతనని చెప్పిండు.. ఈ నెల ఒకటో తేదీన నాకు ఫోన్‌చేసి టూర్‌కు పోతున్ననని చెప్పిండు. అరవింద్ నేను బాల్య స్నేహితులం. వాడు చదువులో ఎప్పుడు ఫస్టే, వాడికి ఈత కూడా వచ్చు. క్షేమంగా తిరిగి వస్తాడని అనుకున్నం. అరవింద్, నేను, హరిబాబు, అక్షయ్‌యాదవ్, రాజేష్, మణిసాయి, సందీప్, అజయ్ మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్. అరవింద్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నం. - నవీన్, అరవింద్ స్నేహితుడు ఐదు రోజులైనా జాడలేని సందీప్ ఆందోళనలో కుటుంబసభ్యులు మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం నీటి ప్రవాహానికి గల్లంతైన సందీప్ జాడ గురువారం వరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం స్వగ్రామం గౌడవెల్లిలో కుటుంబీకులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా సందీప్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం సందీప్ గల్లంతైన నాటి నుంచి తల్లిదండ్రులు వీరేష్, విజయలు నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నారు. కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నా కొడుకు జాడ కనిపెట్టండి.. ప్రభుత్వం ఎలాగైనా తన కొడుకు సందీప్ జాడ కనిపెట్టాలని తండ్రి వీరేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలాంటి బాధ పగవారికి కూడా రాకూడదన్నారు. సందీప్ ఆచూకీ కోసం కుటుంబం మొత్తం నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ బాధను అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. గర్భశోకం సాక్షి, హైదరాబాద్: అదే వేదన.. తీరని రోదనతో కన్నపేగులు తల్లడిల్లుతున్నాయి. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం నగరంలోని వారి తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. తమ వారి కోసం ఐదు రోజులుగా రోదిస్తూ.. కళ్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. నగరవాసులకు కన్నీళ్లు మిగిల్చిన లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గురువారం మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు బండరాళ్ల కింద లభ్యమయ్యాయి. నగరంలో వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటాయని పోలీసులు తెలిపారు. మరోపక్క సాబేర్ మృతదేహం గురువారం శేరిలింగంపల్లి గుల్మొహర్ కాలనీలోని నివాసానికి చేరగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. పుట్టినరోజుకూ కానరాని ఆచూకీ గల్లంతయిన విద్యార్థుల్లో దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన అఖిల్ కూడా ఉన్నాడు. గురువారం అఖిల్ పుట్టినరోజు కావడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం బంధువులు, స్థానికుల తరం కాలేదు. పుట్టినరోజుకు తమ బాబు క్షేమంగా తిరిగొస్తాడనుకున్న ఆశలు అడియాసలు కావడంతో కన్నవారు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. 8 మంది మృతదేహాలు లభ్యం గల్లంతయిన 24 మందిలో ఇప్పటివరకు 8 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీలకు చెందిన సుమారు 600 మంది సుశిక్షితులైన సిబ్బంది లార్జీ నుంచి మండో డ్యామ్ పరిసరాల్లో సుమారు 15 కిలోమీటర్ల మేర జల్లెడ పడుతున్నారు. భారీ వర్షాలు, మంచు ప్రభావంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని అక్కడే మకాం వేసిన నగర పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు.