Super Typhoon Rai: Hits Philippines 21 People Died - Sakshi
Sakshi News home page

Rai Typhoon: ‘రాయ్‌’తుపాను విధ్వంసం.. 75 మంది మృతి

Published Sat, Dec 18 2021 12:53 PM | Last Updated on Sun, Dec 19 2021 6:01 PM

Super Typhoon Rai Hits Philippines 21 People Died - Sakshi

Super Typhoon Rai Hits Philippines: మనీలా: ఫిలిప్పీన్స్‌ను శక్తివంతమైన టైఫూన్‌ ‘రాయ్‌’తుపాను కుదిపేసింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాలు, గంటకు 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దినగట్, బొహోల్స్‌ ప్రావిన్స్‌లలో విధ్వంసం సృష్టించాయి. దినగట్‌లోని నివాసాల్లో 95% వరకు నేలమట్టమయ్యాయి. స్కూళ్లు, ఆస్పత్రులతోపాటు అత్యవసర షెల్టర్లు దెబ్బతిన్నాయి.  

(చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!)

సియార్గావో నామరూపాల్లేకుండా పోయింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలడం తదితర  ఘటనల్లో ఇప్పటివరకూ 75 మంది మరణించారని అధికారులు తెలిపారు. సుమా రు 3 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. లేకుంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని చెప్పారు. కొన్ని ప్రావిన్సుల్లో గురువారం నుంచే మొదలైన తీవ్ర గాలులు, వర్షాలతో దెబ్బతిన్న విద్యుత్, సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం ఇప్పటికీ వీలుకాలేదని తెలిపారు. 
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(చదవండి:  ప్లీజ్‌.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement