Typhoons
-
టీవీ, రేడియోల్లోనూ వాతావరణ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ హెచ్చరికలను ఇకపై టీవీలు, రేడియోల్లోనూ ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, తుపాన్లు, వడగాలుల గురించి మొబైల్ ఫోన్లకు మెసేజీలు పంపే ప్రక్రియను ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రారంభించింది. రెండో దశలో టీవీ, రేడియో తదితర మాధ్యమాల ద్వారా కూడా హెచ్చరికల మెసేజీలను పంపే ప్రక్రియ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఎన్డీఎంఏ అధికారి ఒకరు చెప్పారు. -
‘రాయ్’తుపాను విధ్వంసం.. 75 మంది మృతి
Super Typhoon Rai Hits Philippines: మనీలా: ఫిలిప్పీన్స్‌ను శక్తివంతమైన టైఫూన్ ‘రాయ్’తుపాను కుదిపేసింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాలు, గంటకు 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దినగట్, బొహోల్స్ ప్రావిన్స్‌లలో విధ్వంసం సృష్టించాయి. దినగట్లోని నివాసాల్లో 95% వరకు నేలమట్టమయ్యాయి. స్కూళ్లు, ఆస్పత్రులతోపాటు అత్యవసర షెల్టర్లు దెబ్బతిన్నాయి. (చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!) సియార్గావో నామరూపాల్లేకుండా పోయింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలడం తదితర ఘటనల్లో ఇప్పటివరకూ 75 మంది మరణించారని అధికారులు తెలిపారు. సుమా రు 3 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. లేకుంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని చెప్పారు. కొన్ని ప్రావిన్సుల్లో గురువారం నుంచే మొదలైన తీవ్ర గాలులు, వర్షాలతో దెబ్బతిన్న విద్యుత్, సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం ఇప్పటికీ వీలుకాలేదని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #BREAKING #PHILIPPINES 🔴PHILIPPINES: TYPHOON RAI INTENSIFIED TO CAT 5 STORM! #TyphoonRai / #TyphoonOdette rapidly intensified to a Category 5 storm before making landfall in the Southern Philippines on Thursday, forcing mass evacuations.#BreakingNews #Video #Storm #Tornado pic.twitter.com/yoTof2i6Uk — loveworld (@LoveWorld_Peopl) December 16, 2021 At least 12 people have died in the strongest #typhoon to hit the #Philippines, after the #storm swept across the archipelago uprooting trees, toppling power poles and #flooding villages. Severe flooding in #Mindanao.#TyphoonOdette #Rains #TyphoonRai pic.twitter.com/j7IiLG8WCR — 𝐁𝐡𝐚𝐛𝐚𝐧𝐢 𝐒𝐚𝐧𝐤𝐚𝐫 𝐉𝐞𝐧𝐚 (@Bhabanisankar02) December 18, 2021 (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!) LOOK: Philippine Coast Guard release aerial footage of Siargao Island showing extensive flooding. 📸: PCG #TyphoonRai #TyphoonOdette pic.twitter.com/5G9fYQJvsa — Howard Johnson (@Howardrjohnson) December 17, 2021 #Philippines: 18 dead as #TyphoonRai batters country#Odette #TyphoonOdette #Typhoon pic.twitter.com/4A7h3A3h5j — Ψ ABYSS Chronicles (@AbyssChronicles) December 18, 2021 The after math. At Mandaue City Cebu. 🙏😭#OdettePH #TyphoonRai #TyphoonOdette#TyphoonOdettePH Vid from Tina Fajardo pic.twitter.com/jFP8fRCzL4 — DJ Tors (@toraynosaurus) December 17, 2021 -
ఫిలిప్పీన్స్‌ను కుదిపేస్తున్న ‘వామ్కో’
మనీలా: భారీ తుపాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతోంది. పది రోజుల క్రితం తీవ్రమైన గోని తుపానుతో ప్రభావితమైన క్వెజాన్, లుజాన్, రిజల్, మనీలా ప్రాంతంలోనే తాజాగా మరో తుపాను వామ్‌కోతో ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని సీఎన్ఎన్ తెలిపింది. కేవలం మూడు వారాల్లోనే ఫిలిప్పీన్స్‌పై ఐదు తుపాన్లు తీవ్ర ప్రభావం చూపాయి. గోని తుపాను కారణంగా నిరాశ్రయులైన 2.40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ తెలిపాయి. -
ప్రకృతి వికృతి
తాత్కాలికంగానైనా ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్లిపోవడానికి ఈ మధ్య కాలంలో మరో కారణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే ప్రకృతి. భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలతో ప్రపంచదేశాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వివిధ దేశాల్లో తుపాన్లు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా 70 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మోనటరింగ్ సెంటర్ వెల్లడించింది. వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి మానవీయ వ్యవహారాలు చూసే సంస్థ, మీడియా నివేదికలు ఆధారంగా ఆ సంస్థ గణాంకాలను రూపొందించి ఒక నివేదికను విడుదల చేసింది. 2003 సంవత్సరం నుంచి ప్రకృతి వైపరీత్యాలపై జరిగిన నష్టాన్ని విశ్లేషించిన ఆ నివేదిక 2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు ప్రజలపై తీవ్ర స్థాయిలో పడ్డాయని వెల్లడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ముందస్తుగానే తుపాన్లను గుర్తించి ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడం, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత శిబిరాలకు తరలించడంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. మనిషి ప్రకృతి ముందు మరుగుజ్జే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తుపాన్లు ఎప్పుడొస్తాయో పసిగడుతున్నాం. పిడుగులు ఎక్కడ పడతాయో అంచనా వేస్తున్నాము. వాన రాకడని తెలుసుకుంటున్నాం. ప్రాణం పోకడని నివారిస్తున్నాం. కానీ ప్రజలు నిరాశ్రయులు కాకుండా ఏమీ చెయ్యలేకపోతున్నాం. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా మనిషి ఎప్పుడూ ప్రకృతి ముందు మరుగుజ్జే. అందులోనూ ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రకృతి ప్రకో పం తారస్థాయికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2.2 కోట్ల మంది నిరాశ్రయులు కావచ్చునని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అంచనా వేస్తోంది. ‘‘వాతావరణ మార్పులు భవిష్యత్‌లో మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. బహమాస్ వంటి దేశాల్లో తరచూ వానలు ముంచెత్తుతాయి. దీనికి ముందు జాగ్రత్తలు మరింత అవసరం’’ అని మానిటరింగ్ సెంటర్ డైరెక్టర్ అలగ్జాండర్ బిలక్ హెచ్చరించారు. ఏయే దేశాల్లో ఎంతమంది నిరాశ్రయులు ? ► ఫణి తుపాన్ పడగ విప్పడంతో భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో నిలువనీడ కోల్పోయినవారు 34 లక్షలు. ఈ తుపాను కారణంగా 100 మంది లోపే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ► ఇదాయ్ తుపాన్ దక్షిణాఫ్రికాను ముంచెత్తడంతో 6,17,000 మంది నిరాశ్రయులయ్యారు. వెయ్యి మందికిపైగా మరణించారు. మొజాంబిక్, మాలావీ, జింబాబ్వే, మడగాస్కర్‌లో ప్రజలు ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ► గత కొన్ని దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని వరదలు ఇరాన్లో సంభవించడంతో 5 లక్షల మంది వరకు చెల్లాచెదురయ్యారు. ► బొలీవియాలో వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 70 వేల మంది సొంత ఇళ్లను వీడి వెళ్లిపోయారు. -
ఒక పడవ ఏడు తుపానులు
తుఫాన్లు తీరం దాటుతాయి. కాని 2004లో వచ్చిన ఆ తుఫాను ఆ ఏడు కుటుంబాలను వదల్లేదు. తీరం దాట లేదు. తెరిపెన ఇవ్వలేదు. గుండెల్లో దుఃఖం. కక్కడానికి లేదు. మింగడానికి లేదు. మునిగిన కుటుంబాలను అధికారులు పైకి తేల్చరు. మన మధ్య ఉండే జీవితాలే ఇవి. మనం చూడని తుఫాన్లు. వస్తారని చూసే ఎదురుచూపులకు ఒక అర్థముంది. కాని వస్తారో రారో తెలియని ఎదురుచూపులలో ఉండేది నరకమే. ఆ శిక్ష పగవారికి కూడా వద్దు. పదకొండేళ్లుగా వాళ్ల దినచర్య ఇదే. భార్యలు తమ భర్తల కోసం వస్తారు. తల్లులు తమ కొడుకుల కోసం వస్తారు. పిల్లలు తమ తండ్రుల కోసం వస్తారు. వచ్చి సముద్రం ఒడ్డున నిలబడతారు. ప్రతి ఉదయం నిలబడతారు. దూరాన పడవలు కనిపిస్తుంటాయి. ప్రతి పడవ తమవారిలాగే అనిపిస్తుంటుంది. ప్రతి పడవలోని మనిషి తమ మనిషిలానే అనిపిస్తూ ఉంటుంది. ఆశ... మినుకుమినుకుమంటున్న ఆశ.... కాని సమయం గడిచే కొద్దీ అది నీరుగారిపోతుంది. ఆ పడవలు వాళ్లవి కాదు. ఆ మనుషులు వాళ్ల మనుషులు కారు. అలల మీద అలలను విసిరే సముద్రం నంగనాచిలా మొహం పెడుతుంది. వీరు వెతుకుతున్న మనుషుల ఆచూకీ తనకు తెలియదన్నట్టుగా ఉంటుంది. దేవుడా... ఈ శిక్ష ఇంకా ఎంత కాలం. తూర్పుగోదావరి జిల్లా.. ఉప్పాడ సమీపంలోని సుబ్బంపేట తీరంలో కొనసాగుతున్న విషాదం ఇది. అసలు ఏం జరిగింది? 2004 జూన్ 2. తెల్లవారుజాము. ఆకాశం కబళించడానికి సిద్ధంగా ఉన్న సొరచేపలా ఉంది. సముద్రం ఆకలి దాచుకుని ఉన్న క్రూరమృగంలా ఉంది. కొన్ని శకునాలు వెంటనే అందవు. వేట ఉత్సాహంలో ఉన్నవారికి దృష్టి లక్ష్యం మీదే ఉంటుంది. ఆ రోజు ఎప్పటిలానే సుబ్బంపేటకు చెందిన తిర్రి మరిడియ్య, మేరుగు మసేను, మారిపల్లి ప్రకాష్, కోడ తాతబాబు, తిర్రి నూకరాజు, తిర్రి కొండయ్య, మేరుగు కొండయ్య ఇంట్లోవాళ్లకు వీడ్కోలు చెప్పి వేటకు బయలు దేరారు. వీళ్ల ప్రత్యేకత సొరచేపల వేట. అందుకే మరబోటులో చాలాదూరం వెళతారు. ఐదురోజుల వరకు తిరిగి రారు. ఇలా చాలాసార్లు చేశారు. కాని ఈసారి అలా జరగలేదు. వీళ్లు బయలుదేరిన మర్నాడే అర్ధరాత్రి నుంచి అకస్మాత్తుగా సముద్రంలో వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ వెంటనే అది వాయుగుండంగా మారింది. సముద్రమంతా అల్లకల్లోలం. తీరప్రాంతాలలో అలజడి. వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. వేటకు వెళ్లిన పడవలన్నీ అది విని సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. కానీ వీళ్ల బోటు మాత్రం తిరిగి రాలేదు. మరో రెండు రోజులు గడిచాయి. అయినా వాళ్ల జాడ లేదు. ఇంట్లో వాళ్లకు కలవరం మొదలైంది. మరునాటికి వాతావరణం కుదురుకుంది. సముద్రమూ శాంతించింది. ఆ ఏడుగురు మాత్రం తీరం చేరలేదు. నెల రోజులైంది. ఇంట్లోవాళ్ల కలవరం బెంగగా దిగులుగా భయంగా ఆందోళనగా మారింది. గల్లంతైన వాళ్ల జాడ కనుక్కోవాల్సిందిగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా వేటకు వెళ్లిన వాళ్ల ఊసు లేదు. కాలం గడుస్తూనే ఉంది. నేటికి పదకొండేళ్లు. వాళ్లేమయ్యారన్నది నేటికీ ప్రశ్నార్థకమే. వాళ్లలోని కోడ తాతబాబుకు పెళ్లయి ఐదునెలలే. వేటకు వెళ్లేముందు ‘ఈసారి చేపలు బాగా పడితే నీకు బంగారు తాడు చేయిస్తాను’ అంటూ భార్యకు బాస చేశాడు. బంగారుతాడు సంగతి దేవుడెరుగు ఈ పసుపుతాడు గట్టిదో కాదో తెలియని పరిస్థితి అంటూ కన్నీరు మున్నీరవుతోంది అతని భార్య. ఇక తిర్రి మరిడియ్య, తిర్రి నూకరాజు తండ్రీ కొడుకులు. భర్తను, కొడుకును ఒకేసారి ఆచూకి కోల్పోయిన తిర్రి కాశమ్మ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి చూసి బెంగతో రెండేళ్ల కిందట ప్రాణం విడిచింది. తిర్రి కొండయ్య భార్య కొయ్యమ్మకు భవిష్యత్తు తెలియడం లేదు. మేరుగు కొండయ్య భార్య కొండమ్మ, ముగ్గురు పిల్లలు నవ్వు మర్చిపోయారు. మేరుగు మసేను భార్య నాగమణి, పిల్లలకు తమ ఇంటి పెద్ద వస్తాడన్న ఆశ తప్ప వేరే ఆధారం లేదు. మారిపల్లి ప్రకాష్‌కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, వారి పరిస్థితీ అదే. ఈ ఏడుగురూ కనిపించకుండా పోయినప్పుడు సంబంధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వాధికారుల హామీలు నీటిమూటలే అయ్యాయి. సామాన్యంగా ఎవరైనా సముద్రంలో గల్లంతై ఏడేళ్ల తర్వాత కూడా తిరిగి రాకపోతే వాళ్లు మరణించినట్లుగా భావించి ప్రభుత్వం మరణ ధ్రువీకరణపత్రం జారీచేస్తుంది. తద్వారా ఆయా కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక సహాయం అందుతుంది. పింఛను వస్తుంది. కానీ ఈ మత్స్యకారులు గల్లంతయి పదకొండేళ్లయినా ఇంతవరకు మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయలేదు. గల్లంతయిన ఐదోరోజు అందిన అరకొర సాయం తప్ప ఎలాంటి ఆర్థిక ప్రయోజనమూ ఇంతవరకు ఈ కుటుంబాలకు అందలేదు. సంపాదించే కుటుంబ పెద్దను కోల్పోయి ఆదుకునే ఆసరాలేక ఇటు మానసికంగా అటు ఆర్థికంగా ఈ ఏడు కుటుంబాలు చితికిపోయాయి. ఎదిగిన ఆడపిల్లల పెళ్లిళ్లు, చదువుకోవాల్సిన పిల్లల చదువులు అన్నీ అలాగే ఆగిపోయాయి. ఈ ఆడబిడ్డల సంపాదన ఇల్లు గడవడానికే సరిపోవడం లేదు. ఇక ఈ బాధ్యతలన్నీ తీరేదెప్పుడు? ఒక మనిషి వస్తాడో రాడో తెలియకపోవడం నరకమే. కాని అందాల్సిన సాయం అందకపోవడం ఇంకా నరకం. మొదటిదాని విషయంలో ఆ స్త్రీలకు విధి సాయం చేయాలి. రెండవదాని విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలి. - వెలుగుల సూర్య వెంకట సత్య వరప్రసాద్, సాక్షి, పిఠాపురం మాగోడు వినే నాథుడు లేడు కనిపించకుండా పోయిన మావారిని చనిపోయినట్లుగా గుర్తించండి లేదా వారి ఆచూకీ అయినా కనుగొనండి అంటు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ఇప్పటికి కొన్ని వందలసార్లు ప్రదక్షిణలు చేశాం. అయినా పట్టించుకోవడం లేదు. అన్నీ కోల్పోయి.. ఏదిక్కు లేక వీధినపడ్డాం. మాగోడు వినే నాథుడే లేడు. - తిర్రి కొయ్యమ్మ -
తీరంలో అన్నింటా ముప్పే
* ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల తాకిడి అధికమే * నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖ , శ్రీకాకుళం, విజయనగరాల్లో తుఫాను గాలుల ప్రభావం ఎక్కువ * కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలపై తరచుగా వరదల ప్రభావం * సముద్ర మట్టం పెరుగుదలవల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఉప్పునీరు చొరబాటు * గణాంకాలు, గ్రాఫులు, మ్యాపులతో విశ్లేషించిన శివరామకృష్ణన్ కమిటీ * అన్ని అంశాలను పరిగణించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: తూర్పు తీర ప్రాంతంలో తరచూ సంభవించే తుఫాన్లు, భూకంపాలు తదితర విపత్తులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఇందుకోసం కమిటీ ప్రతి అంశాన్ని గణాంకాలు, అధ్యయనాలు, గ్రాఫ్‌లు, మ్యాపులతో సహా నివేదించింది. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలిలా ఉన్నాయి. ఏతూర్పు తీర ప్రాంతంలో ప్రమాదాలు, విపత్తులు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల ధాటి అధికం. గడిచిన దశాబ్దంలో రాష్ట్రంలో తుఫాన్లు సంఖ్య అధికంగానే నమోదయ్యాయి. ప్రతి రెండేళ్ళకోసారి రాష్ట్రం తుఫాను ధాటికి గురవుతూనే ఉంది. నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాల్లో తుఫాను గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సముద్రం మట్టం పెరుగుదలతో ఉప్పునీరు ఆంధ్ర తీరంలోని గోదావరి, కృష్ణా డెల్టాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఏ ఏపీలో డెల్టా, తీర ప్రాంతాల్లో వరదలు తరచు సంభవిస్తున్నాయి. కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు కృష్ణా, గోదావరి నదుల తీరాన కేంద్రీకృతమై ఉన్నాయి. 2009 అక్టోబరు-నవంబరులో వచ్చిన వరదలు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరదల బారిన పడే నగరాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరులు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ క్యాపిటల్ జోన్ చుట్టూ ఉన్న అంశాన్ని గమనించాలి. ఏ మిగిలిన తీర ప్రాంత నగరాలతో పోలిస్తే విశాఖపట్టణానికి రక్షణ ఉంది. ఇక్కడ టోపోగ్రఫీ, కోస్టల్ లైన్ ఇందుకు కారణం. ఈ పట్టణ, నగరాలతో పోలిస్తే క్యాపిటల్ జోన్లో భవిష్యత్తులో పలు తుఫాన్లకు, సూపర్ సైక్లోన్స్కు ప్రాణ నష్టం, భవనాల డ్యామేజీ, వ్యాపార ఆటంకాలు అనేకమున్నాయి. ఏ రాష్ర్టంలో సగటున వార్షిక వర్షపాతం 1000 మిల్లీమీటర్లుగా నమోదవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కరువు ఛాయలు అధికం. ఇక్కడ 30 మండలాల్లో 40 శాతం కంటే అధికంగా తరచూ కరువు ఉంటుంది. 20-40 శాతం కరువు బారిన పడే 115 మండలాల్లో అధికంగా ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలున్నాయి. వీజీటీఎంకు భూకంప ప్రమాదం ఆంధ్రప్రదేశ్ భూకంపాలకు సంబంధించి జోన్-2, 3 లలో ఉంది. ఇది తక్కువ ప్రభావమే చూపుతుంది. కానీ విజయవాడ పరిసరాల్లోని 150 కిలోమీటర్ల రేంజ్లో భూకంప ప్రమాదాలకు ఆస్కారం ఉందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) జరిపిన సీస్మిక్ మైక్రో-జోనేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదంతా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) రీజన్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నందున దాన్ని గమనంలోకి తీసుకుని నిర్ణయాలు జరగాలి. 1917లో విజయనగరంలో 5.5 ఎం, 1967లో ఒంగోలు ప్రాంతంలో 5.4 ఎం.గా రెండు పెద్ద భూకంపాలు నమోదయ్యాయి. కాకినాడ, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రిలలో తక్కువ రిస్క్‌గా ఉన్నాయి. తక్కువ నాణ్యతతో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడితే మాత్రం ప్రమాదం అధికంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లో 2001లో భుజ్ భూకంపమే దీనికి ఉదాహరణ.