వాషింగ్టన్: మంటలర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిని.. ఓ ఎద్దు వెంబడించి తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. వివరాలు.. శుక్రవారం దక్షిణ కాలిఫోర్నియాలో లేక్‌ఫైర్ సంభవించింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే వెంచురా కౌంటీ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండగా.. ఉన్నట్లుండి ఓ ఫెర్డినాండ్(ఎద్దు జాతికి చెందిన జంతువు) వారిని వెంబడించింది. భారీగా మొనదేలిన కొమ్ములతో ఉన్న ఫెర్డినాండ్ ఫైర్ సిబ్బంది వెంట పడటంతో వారు కాలికి బుద్ధి చెప్పి పరుగు లంకించుకున్నారు. ఫైరింజన్ పైకి ఎక్కారు. కాసేపటికి ఫెర్డినాండ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని తెలిపిన కౌంటీ ఫైర్ విభాగం ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (అగ్నికీలల్లో ఆర్తనాదాలు)
#LakeFire; Ferdinand the Bull wasn’t clowning around when he chased FF’s down the road. Crews were clearing the road so the engines could get to a clearing when they were chased out. Luckily no one was injured and #Ferdinand went about his day. @VCPFA #vcfd pic.twitter.com/vxdOTFoEB7
— Ventura County Fire (@VCFD) August 15, 2020
శుక్రవారం దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఈ అగ్రిప్రమాదంలో 18 వేల ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. హ్యూస్ సరస్సు సమీపంలో లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన వ్యాపించిన ఈ లేక్ ఫైర్‌లో 20 కి పైగా నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. చాలా మంది స్థానికులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment