reservations for muslims
-
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబై : మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును శాసన సభలో ప్రవేశపెడుతామని మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం తెలిపారు. ఉద్యోగాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఆలోచిస్తున్నామని, దానికి సంబంధించి న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల వల్ల గత ప్రభుత్వం ఉద్యోగ రిజర్వేషన్లపై వెనకడుగు వేసిందని ఆయన గుర్తు చేశారు. కాగా, బీజేపీ-శివసేన మధ్య ప్రభుత్వ ఏర్పాటు చెడటంతో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీపీ ఎమ్మెల్యే. -
చంద్రబాబుకు మైనార్టీలపై ఎంత ప్రేమంటే..!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు రాగానే మైనార్టీల జపం చేసే వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్ అన్నారు. మైనార్టీలకు చంద్రబాబు చేస్తున్న మోసాలపై ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముస్లింల ద్రోహి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా అవకాశం ఇవ్వకపోవడం మైనార్టీలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమను బహిర్గతం చేసిందన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలంతా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ముస్లింలకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు మైనార్టీలు గుర్తొస్తారని, ఎన్నికలు ముగిసేవరకు మైనార్టీల జపం చేస్తారని ఎమ్మెల్యే ముస్తఫా ఎద్దేశా చేశారు. -
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి: అసదుద్దీన్
నాగ్‌పూర్: మహారాష్ట్రలో వెనకబడిన ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆదివారం నాగ్‌పూర్‌లో ఒవైసీ తొలిసారిగా బహిరంగసభలో ప్రసంగించారు. వర్షం పడుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో జనం ఈ సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఒవైసీ అన్నారు.