Resettlement
-
పునరావాసమంతా ఉత్తిదే
పటమట(విజయవాడతూర్పు): వరద కారణంగా బుడమేరు ప్రభావితం చేసే ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాసం కేంద్రాలకు తరలించామని, నగరమంతా 97 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో 14,252 వేల మందికి పైగా పునరావాసం ఉంటున్నారని, వరద తగ్గుముఖం పట్టడంతో 61 కేంద్రాలను మూసేశామని, ఇంకా 36 కేంద్రాల్లో బాధితులు పునరావాసం ఉంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే నగరవ్యాప్తంగా కేవలం 13 పునరావాస కేంద్రాలే ఉన్నాయి.వాటిలో 1,031 మంది మాత్రమే తలదాచుకున్నారు. 4 కేంద్రాల్లో బా«ధితులే లేరు. సింగ్‌నగర్, రాజీవ్‌నగర్, కండ్రిక, ఉడాకాలనీ, సుందరయ్యనగర్, పాయకాపురం, శాంతి, ప్రశాంతినగర్ ప్రాంతాల ప్రజలు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలకు తాళాలు వేసి ఉన్నా వాటిని పగలకొట్టి తలదాచుకున్నారు. రాజీవ్‌నగర్‌లోని వడ్డెర కాలనీలో ఉన్న హైసూ్కల్లో సుమారు 250 మంది వరకు పునరావాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ అక్కడ ఇంత వరకు ఏ ప్రభుత్వ అధికారి, సిబ్బంది రాలేదని వాపోతున్నారు. పునరావాస కేంద్రాలు ఇవీ.. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 3 సర్కిళ్ల పరిధిలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 8 కేంద్రాలు వరద ముంపులో ఉన్నాయి. సర్కిల్–1 ఏరియాలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో ఒకటి ఖాళీగా ఉంది. లేబర్‌కాలనీ కళ్యాణ మండపంలో 20 మంది, ఉర్దూ మున్సిపల్ హైసూ్కల్ (ఎవరూ లేరు), విద్యాధరపురంలో 20 మంది, కేఎల్‌రావు నగర్‌లోని రాకేష్ పబ్లిక్స్కూల్లో 20 మంది ఉన్నారు. సర్కిల్–2 పరిధిలోని సత్యనారాయణపురం ప్రశాంతి ఎలిమెంటరీ స్కూల్లో 430 మంది, దేవీనగర్‌లోని తమ్మిన దుర్గారావు స్కూల్లో 20 మంది, మధురానగర్ కమ్యూనిటీ హాల్లో 20 మందే పునరావాసానికి వచ్చారు. సర్కిల్–3 పరిధిలో 6 కేంద్రాలు ఉండగా పటమటలంక వల్లూరు సరోజని దేవి స్కూల్లో 350 మంది, కృష్ణలంక ఓడీఏ హాలులో (ఎవరూలేరు), రాణిగారితోట న్యూ కమ్యునిటీ హాల్లో (ఎవరూలేరు), గుణదల నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో 102 మంది, కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో (ఎవరూ లేరు). సీపీఎం భవనంలో 49 మంది మాత్రమే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారమే.. నగరంలోని వీఎంసీ, రెవెన్యూ విభాగాలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల సమాచారం లేకపోవడం, వరదలో చిక్కుకున్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేయకపోవడంతో లక్షల మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. స్వచ్ఛంద సంస్థలు వినీల్ (వీకే), ఎయిమ్, దళిత బహుజన్ ఫ్రంట్, రెడ్‌క్రాస్ లాంటి సంస్థలు వాంబేకాలనీ, రాజీవ్‌నగర్, ఓల్డ్ ఆర్ఆర్ పేటలు, కండ్రిక ప్రాంతాలకు ట్రాక్టర్లలో వెళ్లి ఆహారాన్ని, నిత్యావసరాలను పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు లేకపోతే తాము చనిపోయేవారమని వరద బాధితులు వాపోతున్నారు. -
జ్ఞాపకాల్లో మునిగి తేలారు!
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు. మునిగితేలిన ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి పాతూరు చూసేందుకు వచ్చిన.. పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక 60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం సాక్షి, నాగర్‌కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్‌లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం. కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు. -
పునరావాసం.. ప్రజల సమ్మతం
సాక్షి, నిర్మల్: కవ్వాల్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు గ్రామాలను మరోచోటుకు తరలించడానికిగాను జిల్లా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామా లను అదే మండలంలోని ధర్మాజిపేట్ గ్రామ సమీపంలో గుర్తించిన అటవీ భూమిలో ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించడానికిగాను చర్యలను వేగవంతం చేశారు. ఈ మేరకు ఆ రెండు గ్రామాలను మరోచోటకు తరలించడానికి ఇప్పటికే గ్రామస్తులు సమ్మతించడంతో ధర్మాజిపేట్ సమీపంలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ గ్రామ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులు శుక్రవారం ప్రత్యామ్నాయ గ్రామ పున:స్థాపన చేసే ప్రాంతంలో పర్యటించనున్నారు. గ్రామం ఏర్పాటుకు ప్రణాళికలు ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ధర్మాజిపేట్ గ్రామ శివారు ప్రాంతంలోని 112 హెక్టార్ల అటవీ ప్రాంతంలో పున:స్థాపన చేయనున్నారు. ఈ మేర కు గ్రామం ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌక ర్యం సామాజిక భవనాలు, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రా ర్థన మందిరాలు, సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రెయినేజీ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికిగాను ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. 142 కుటుంబాల తరలింపు రెండు గ్రామాల నుంచి మొత్తం 142 కుటుంబాలను ధర్మాజిపేట్ సమీపంలో ఏర్పాటు చేయను న్న పునరావాస గ్రామానికి తరలించనున్నారు. అయితే ఈ గ్రామంలో పూర్తిగా నివాసం, వ్యవసాయ భూమి, మౌలిక వసతుల కల్పన కోరుతూ 94 కుటుంబాలు అంగీకరించాయి. మరో 48 కుటుంబాలు మాత్రం తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాయి. ఇందుకుగాను నష్ట పరిహారం కోరిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. 94 కుటుంబాలకు మాత్రం 250 చదరపు గజాల డబుల్ బెడ్ రూం, వ్యవసాయ భూమితో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ అంగీకరించారు. వీరికి కడెం మండలంలోని ధర్మాజిపేట్ గ్రామ సమీపంలో 112 హెక్టార్ల భూమిని గుర్తించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ. 8 కోట్ల 52 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 5కోట్ల 64 లక్షలు మంజూరయ్యాయి. అధికారులు ప్రణాళికలు రూపొందించి పునరావాస గ్రామం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. పునరావాస గ్రామ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు అవసమైన చర్యలను తీసుకోనున్నారు. -
'రకరకాల జీవోలతో ప్రభుత్వం మోసం చేస్తోంది'
హైదరాబాద్: మల్లన్న సాగర్‌తో పాటూ అన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జీవో 123తో ఎక్కువ పరిహారం వస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రకరకాల జీవోలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు.