residencial places
-
గృహ కొనుగోలుదారులకు ఖతార్ రెడ్ కార్పెట్
దోహా: ప్రధానంగా ఇంధన అమ్మకాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు ఇతర మార్గాలలోనూ మద్దతివ్వాలని భావిస్తున్న ఖతార్ ప్రభుత్వం తాజాగా విదేశీయులకు ప్రాపర్టీ మార్కెట్ ద్వారా ఆహ్వానం పలుకుతోంది. నిజానికి సెప్టెంబర్‌లోనే ఈ పథకానికి తెర తీసినప్పటికీ.. తాజాగా మరిన్ని సంస్కరణలు చేపట్టింది. 2022లో నిర్వహించనున్న వరల్డ్ కప్ కంటే ముందుగానే భారీగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే ప్రణాళికల్లో భాగంగా రియల్టీ ఆస్తుల విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. అర్హతగల కొనుగోలుదారులకు సముద్రపు ఒడ్డునగల ఆకర్షణీయ పెరల్ ఐలాండ్ లేదా కొత్తగా ఏర్పాటు చేసిన లుజైల్ సిటీ ప్రాజెక్టును ఇందుకు కేటాయించింది. ఇక్కడ వరల్డ్ కప్ స్టేడియాన్ని నిర్మించింది. సీసైడ్ టవర్లలో బ్లాకులతోపాటు.. రిటైల్ యూనిట్లను సైతం కొనుగోలుదారులకు ఆఫర్ చేయనుంది. తద్వారా పెట్రో డాలర్లకు ప్రాపర్టీ విక్రయాల ఆదాయాన్ని జత చేయడం ద్వారా ఆర్థికంగా మరింత బలపడాలని చూస్తోంది. ధరలకు దన్నుగా సరఫరాకు తగిన డిమాండ్ లేకపోవడంతో టవర్లలో సగంవరకూ ఖాళీగానే ఉన్నట్లు రెసిడెన్షియల్ ఆస్తులకు సంబంధించిన వలుస్ట్రాట్స్ ధరల ఇండెక్స్ పేర్కొంది. దీంతో 2016 నుంచి ప్రాపర్టీ ధరలు మూడోవంతు క్షీణించినట్లు తెలియజేసింది. తాజా సంస్కరణల కారణంగా విదేశీయులు ఖతార్‌లోని 25 ప్రాంతాలలో కొత్తగా గృహాలను సొంతం చేసుకునేందుకు వీలుంటుంది. ప్రధానంగా రాజధాని దోహాలో ఇందుకు అధిక అవకాశాలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 9 ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాలలో 99 ఏళ్ల కాలానికి లీజ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 10 లక్షల డాలర్లు.. గతంలో రెసిడెన్సీ కోసం ఖతార్ బిజినెస్ లేదా వ్యక్తుల నుంచి భాగస్వామ్యం(స్పాన్సర్షిప్) తీసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం 2 లక్షల డాలర్ల విలువైన ప్రాపర్టీ కొనుగోలు ద్వారా తాత్కాలికంగా యాజమాన్య హక్కులు పొందేందుకు వీలుంటుంది. 10 లక్షల డాలర్లు వెచ్చించగలిగితే.. శాశ్వత నివాసానికి వీలు కల్పించనుంది. దీనిలో భాగంగా విద్య(స్కూళ్లు), ఆరోగ్యం(హెల్త్‌కేర్) ఉచితంగా అందించనుంది. గత 15ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నప్పటికీ అనధికార మార్కెట్ వల్ల సొంత ఇల్లు సమకూర్చుకోలేకపోయినట్లు కెన్యన్ మహిళ టీనా చడ్డా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం శాశ్వత నివాసానికి వీలు కల్పించడంతో ఖతార్‌లో సొంత ఇంటి కలను నెరవేర్చుకోనున్నట్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చడ్డాకుగల వీసా ద్వారా కుటుంబ సభ్యులతోపాటు తల్లిదండ్రులనూ నైరోబీ నుంచి ఖతార్‌కు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దుబాయ్ 2.7 మిలియన్ డాలర్ల పెట్టుబడికి 10ఏళ్ల రెసిడెన్సీ వీసాను ఆఫర్ చేస్తోంది. ఈ నిధుల్లో 40 శాతంవరకూ ప్రాపర్టీకే వినియోగించవలసి ఉంటుంది. కాగా.. గోల్డెన్ వీసాలుగా పేర్కొనే ఇలాంటి పథకాల ద్వారా అవినీతిపరులకు అవకాశం కలుగుతున్నదని, అంతేకాకుండా మనీలాండరింగ్‌కూ వీలు చిక్కుతున్నదని ఆరోపణలు వెలువడుతున్న విషయం విదితమే. -
డీఆర్ కాంగోలో కూలిన విమానం
గోమా: ఆఫ్రికా దేశం డీఆర్ కాంగోలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటల సమయంలో విమానం టేకాఫ్ అవుతుండగా ఇళ్ల మధ్యలో కూలింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్‌కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కిలోమీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. -
ఇళ్లల్లోకి చిరుత..పరుగులు తీసిన జనాలు
-
ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం
సాక్షి, డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఓ చిరుత చుక్కలు చూపించింది. పట్టపగలే ఇళ్లల్లోకి చొరబడి ముచ్చెమటలు పట్టించింది. మెరుపు వేగంతా జనాలపైకి దూసుకెళ్లి హడలెత్తించింది. చివరకు ఎవరి చేతికి చిక్కకుండా పరారైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని కేవల్ విహార్ ప్రాంతంలోని ఓ నివాస ప్రాంతంలోకి చిరుత ప్రవేశించింది. శాస్త్రబుద్ధి అనే రోడ్డులోని ఓ నివాసంలో గార్డెన్‌లోకి వెళ్లింది. అక్కడే కొద్ది సేపు కూర్చున్న చిరుత ఆ వెంటనే సెకన్లలో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి క్షణాల్లో దూకడం మొదలుపెట్టింది. దీంతో ఇళ్లల్లోని మహిళలు, ముసలివారు సైతం తమ శక్తిమేరకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉన్నవారిపైకి దూసుకెళ్లిన చిరుత నలుగురైదుగురిని చూసి మాత్రం భయపడింది. దీంతో జనాలంతా కూడా ఒకే చోట పోగయ్యారు. ఈ తంతు దాదాపు ఆరు గంటలపాటు జరిగింది. అయితే, కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు చిరుతకు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అక్కడికి వచ్చి గన్ సిద్ధం చేస్తుండగానే చిరుత కనిపించకుండా మాయమైంది. ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం -
వంద గజాల నివాస స్థలాలు క్రమబద్ధీకరణ
కర్నూలు(అగ్రికల్చర్): ఎలాంటి ఆక్షేపణలు లేని ప్రభుత్వ భూముల్లో అక్రమణలో ఉన్న నివాస సముదాయాలను 100 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు లోబడి అర్హులైన వారు మీసేవ కేంద్రాల ద్వారా తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014 జనవరి1కి ముందు జరిగిన ఆక్షేపణలు లేని నివాస గృహ సముదాయాలను మాత్రమే క్రమబద్ధీకరించబడుతుందన్నారు. దరఖాస్తులను ఆర్డీఓ ఆధ్వర్యంలోని కమిటీ విచారణ జరిపి నిర్ధారిస్తుందని డీఆర్ఓ తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.