పోలీసుల కాల్పుల్లో.. ముగ్గురు ఖైదీల మృతి
మనీల(ఫిలిప్పైన్స్):
ఫిలిప్పైన్స్‌లోని రెస్టివ్ జోలో ఐలాండ్‌లో ఓ జైలు నుంచి 14 మంది ఖైదీలు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఖైదీలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా..ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఐలాండ్‌ను సందర్శించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. గత జనవరిలో బంగసామోరో ఇస్లామిక్ ఫ్రీడం ఫైటర్స్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 160 మంది మిందానౌ ఐలాండ్‌లోని జైలు నుంచి పరారైన సంగతి తెల్సిందే.