revenue devision
-
కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, కుప్పం, శాంతిపురం, గూడుపల్లె, రామకుప్పం మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండలాలు ప్రస్తుతం మదనపల్లె రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, కుప్పం మారుమూల ప్రాంతంగానే మిగిలిపోయింది. ఆయన ఎప్పుడూ కుప్పంకు పరిపాలనా ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని పట్టించుకోలేదు. తాజాగా కొత్త జిల్లాల విభజన సమయంలో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తోంది. కుప్పంతోపాటు మరో 21 కొత్త రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో ఏర్పడనున్నాయి. సగటున 6 నుంచి 12 మండలాలతో ఒక్కో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. 13 జిల్లాల్లో 3 రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతుండగా, 9 జిల్లాల్లో 2, నాలుగు జిల్లాల్లో నాలుగేసి చొప్పున రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే 51 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా ఏర్పడే 22తో కలిపి 73 రెవెన్యూ డివిజన్లు అవుతాయి. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నేడో, రేపో వెలువరించనుంది. -
రాజుకున్న డివిజన్ సెగ
పలమనేరు: పలమనేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. త్వరలో కుప్పం రెవెన్యూ డివిజన్ అవుతుందని ప్రకటించింది. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. తమ సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ ప్రకటించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే ఇందుకు సంబంధించిన ఫైల్ సీసీఎల్ఏ, ఆర్థిక శాఖ వద్దకెళ్లింది. ఎన్నికలు, ఆపై ఉద్యమాలు, రాష్ట్ర విభజనతో ఈ అంశం పూర్తిగా తెరమరుగైంది. పలమనేరు డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన నైసర్గిక స్వరూపంతో పాటు భౌగోళిక అంశాలపై నివేదికలో సైతం అన్నీ సబబేననే అప్పట్లో అధికారులు నివేదికలిచ్చారు. అయితే కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చి అక్కడ ఎలాగైనా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థలం కూడా రిజర్వు చేశారు.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలమనేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పలమనేరు డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన నైసర్గిక స్వరూపంతో పాటు భౌగోళిక అంశాలపై నివేదిక పంపాలని అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలొచ్చాయి. ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం కోసం పలమనేరులో ఇప్పటికే ప్రభుత్వం స్థలాన్ని రిజర్వు చేసిపెట్టింది. చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి పక్కనున్న కోర్టు, సీఎల్ఆర్సీ భవనాల మధ్యనున్న మూడెకరాల ప్రభుత్వ స్థలంలో దీన్ని నిర్మించేందుకే రిజర్వు చేశారు. పలమనేరుకో న్యాయమా? రాష్ట్రానికి పాలనా పరంగా.. భౌగోళిక పరంగా ఇబ్బందులుండరాదనే ఉద్దేశంతో రాజధానిని అమరావతిలో పెట్టిన ముఖ్యమంత్రి పలమనేరులోనూ అవే నిబంధనలు పాటించాలికదా. కానీ ఇక్కడ మాత్రం కుప్పంలో పెట్టాలని వారి ప్రభుత్వం ఎలా చెబుతుంది. ఇది చాలా అన్యాయం. దీనిపై అభ్యంతరం తెలుపుతాం.– సునీల్‌కుమార్, ఎమ్మెల్యే, పూతలపట్టు నేటి నుంచే పోరాటం పలమనేరుకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయంపై నేటి నుంచే అన్ని ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ఆందోళనలు చేపడతాం. నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదు. – మిలటరీ సిద్ధయ్య,పలమనేరు పరిరక్షణ సమితి అధ్యక్షులు -
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే
కల్వకుర్తి : రెవెన్యూ డివిజన్ కోసం ఆచారి చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో శుక్రవారం రెండు జాతీయ రహదారుల జంక్షన్లో మూడుగంటల పాటు రాస్తారోకో చేశారు. జేపీనగర్ వద్ద చౌరస్తాలో డప్పులు, వాయిద్యాలు, నృత్యాలు, పాటలతో రెవెన్యూ డివిజన్ అవశ్యకత చాటిచెప్పారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌కుమార్, బీజేపీ తాలూకా బాధ్యులు శేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బాలస్వామి గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ శ్రీశైలం, ఎడ్మసత్యం, సీపీఎం, సీపీఐ, జేఏసీ, బార్అసోసియేషన్, ప్రజాసంఘాలు కలిసి ఉద్యమించారు. ఉద యం 10 నుంచి 1గంట వరకు జాతీయ రహదారిపై బస్సు లు, లారీలు, తదితర వాహనాలు నిలిచిపోయాయి. సీఐ వెంకట్, ఎస్ఐలు, తహసీల్దార్ మంజుల తదితరులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రెవెన్యూ డివిజన్‌పై ప్రకటన, చారకొండ, కడ్తాల్ మండలాలుగా చేయాలని నిన దించారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రసంగించిన తర్వాత స్వచ్ఛందంగా రాస్తారోకో విరమిం చారు. హైదరాబాద్–శ్రీశైలం, దేవరకొండ–జడ్చర్ల జాతీ య రహదారులపై రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, విజయ్‌గౌడ్, పవన్‌కుమార్‌రెడ్డి, వైస్ చైర్మన్ షాహిద్, పీఏసీఎస్ ౖవైస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.