Revolving Fund
-
రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌తో రహదారి భద్రతా నిధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రతకు సంబంధించి రూ.50 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ నిధులతో ప్రత్యేకంగా రహదారి భద్రతా నిధిని ఏ ర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రత, రహదారి భద్రత డ్రాప్ట్ ఆ డిట్ నివేదిక అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహ దారి ప్రమాదాల వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోడం లేదా తీవ్రంగా గాయపడడం వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నా రు. రహదారి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుందని తెలిపారు. కొత్తగా చేపట్టే వివిధ రహదారుల ప్రాజెక్టు అంచనాల్లో 2 శాతం నిధులు రహదారి భద్రతా నిధికి జమ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. వివిధ జాతీయ, రాష్ట్ర, ఇతర ముఖ్యమైన రహదారులపై గల జంక్షన్లను మెరుగుపర్చడంతో పాటు బ్లాక్ స్పాట్లను తక్షణం సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు వినియోగంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన క ల్పించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై నూతన మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాల్లో ప్రమాదాల నివారణకు సిగ్నల్ వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వివిధ పాఠశాలలు, కళాశా లలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లోని రహదారులపై ప్రత్యేకంగా సైనేజి బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర రహదారులు–భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సమావేశపు అజెండా, రోడ్డు సేఫ్టీ ఆడిట్‌కు సంబంధించిన సిఫార్సులను వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేయాలి
కర్నూలు(రాజ్‌విహార్): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలన్నింటినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాఫీ చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బీఏస్ కల్యాణ మండపంలో ఆ సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రుణమాఫీపై చంద్రబాబు మాటమార్చడం తగదన్నారు. రివాల్వింగ్ ఫండ్ పేరిట మహిళలను మోసగించే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. గ్రామాల్లో మద్యం బెల్టు షాపులను ఇప్పటి వరకు ఎత్తేయలేదని.. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పురుషులతో సమానంగా విద్య, ఉద్యగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో స్త్రీలు రాణించాలన్నారు. హక్కుల సాధనకు మహిళలందరూ ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళలపై వేధింపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిచలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టం వచ్చినా..హింసలు మాత్రం ఆగడం లేదన్నారు. విజయవాడలో ఈనెల 26 నుంచి రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభలకు జాతీయ కమిటీ నాయకులు హాజరవుతారన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నిర్మల మాట్లాడుతూ.. మ హిళా సమస్యలపై తమ సంఘం నిరంతర పోరు కొనసాగిస్తుందన్నారు. మహా సభలకు జిల్లా అధ్యక్షురాలు జి. ధనలక్ష్మీ అధ్యక్షత వహించగా సహాయ కార్యదర్శులు అలివేలమ్మ, పిఎస్ సుజాత, నగ ర కార్యదర్శి అరుణమ్మ పాల్గొన్నారు. -
మాఫీ లేదు..రివాల్వింగ్ ఫండే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నీటి మూటలేనని తేలిపోయింది. స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న లింకేజీ రుణాలు మాఫీ లేదని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రుణాల మాఫీ లేదని ఐకేపీ సిబ్బంది స్పష్టంగా చెబుతోంది. దీంతో డ్వాక్రా మహిళలు ఆందోళన బాట పడుతున్నారు. అయితే ‘తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించండి.. లేదంటే చర్యలు తీసుకుంటాం. బకాయిలు చెల్లిస్తే.. మీకు రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం’ అంటూ ఎస్‌హెచ్‌జీ మహిళలపై ఐకేపీ సిబ్బంది తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఆ మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో ఏప్రిల్ నుంచి లింకేజీ రుణాల నెలవారీ కంతులను చెల్లించడం మానేశారు. ప్రస్తుతం తీసుకున్న రుణాలు, వాటికి వడ్డీ చెల్లించకపోతే రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ పొందేందుకు సంఘానికి అర్హత లేదని తేల్చిచెప్పటంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. నమ్మి ఓట్లేస్తే.. దారుణంగా మోసం చేశారని టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. పొదుపు మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని తుంగలో తొక్కారని వారు విమర్శిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 42వేలకుపైగా డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అందులో 4 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. వీరంతా వివిధ బ్యాంకుల్లో రూ.525 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఒక్కో సంఘం లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకుంది. తీసుకున్న రుణాలకు సంబంధించి కంతుల వారీగా ప్రతి నెలా రూ. వెయ్యి నుంచి రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి 5 నెలల మొత్తం అంటే రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఒకేసారి చెల్లించాలని ఐకేపీ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారంలోకి రాకమునుపు మహిళలకు సంబంధించిన రుణాలన్నింటిని మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు విస్పష్టంగా ప్రకటించి ఇప్పుడు చెల్లించమనటం అన్యాయమని సభ్యులు మండిపడుతున్నారు. అయితే ప్రతి సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ ఇస్తానని పేర్కొన్నారు. ఈ లక్ష రూపాయలు ఎప్పుడు సంఘాలకు చెల్లిస్తారో కూడా చెప్పలేదు. ప్రతి సంఘం లక్ష రూపాయల రివాల్వింగ్ ఫండ్ పొందడానికి కూడా షరతులు పెట్టారు. ఏప్రిల్ నుంచి చెల్లించకుండా ఉండిపోయిన అన్ని నెలల బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిబంధన పెట్టారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరిపై మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎక్కడి నుంచి తేవాలి.. ఏప్రిల్ నుంచి అన్ని నెలల బకాయిలను ఒకేసారి చెల్లించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని కర్నూలుకు చెందిన శశిరేఖ ప్రశ్నించారు. మొన్నటి వరకు జిల్లాలో వర్షాలు కురవకపోవటంతో వేసిన పంటలన్నీ ఎండిపోయాయని హాలహర్వికి చెందిన చంద్రమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా వర్షం కురుస్తున్నా ప్రయోజనం లేదని బోరుమన్నారు. ఈ పరిస్థితుల్లో బకాయి పడిన మొత్తాలను చెల్లించాలంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చినట్లు రుణాలు మాఫీ చేయకపోతే టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.