సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రతకు సంబంధించి రూ.50 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ నిధులతో ప్రత్యేకంగా రహదారి భద్రతా నిధిని ఏ ర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రత, రహదారి భద్రత డ్రాప్ట్ ఆ డిట్ నివేదిక అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహ దారి ప్రమాదాల వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోడం లేదా తీవ్రంగా గాయపడడం వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నా రు.
రహదారి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుందని తెలిపారు. కొత్తగా చేపట్టే వివిధ రహదారుల ప్రాజెక్టు అంచనాల్లో 2 శాతం నిధులు రహదారి భద్రతా నిధికి జమ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. వివిధ జాతీయ, రాష్ట్ర, ఇతర ముఖ్యమైన రహదారులపై గల జంక్షన్లను మెరుగుపర్చడంతో పాటు బ్లాక్ స్పాట్లను తక్షణం సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు వినియోగంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన క ల్పించాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు నడపడం లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై నూతన మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాల్లో ప్రమాదాల నివారణకు సిగ్నల్ వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వివిధ పాఠశాలలు, కళాశా లలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లోని రహదారులపై ప్రత్యేకంగా సైనేజి బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్ర రహదారులు–భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సమావేశపు అజెండా, రోడ్డు సేఫ్టీ ఆడిట్‌కు సంబంధించిన సిఫార్సులను వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment