Rial
-
డాలర్ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా?
కొద్దిరోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ దేశ కరెన్సీని అయినా అమెరికన్ డాలర్‌తోనే పోల్చుతుంటారు. అందువల్ల డాలర్ అంటే బాగా విలువైన కరెన్సీ అనే భావన ఉండిపోయింది. నిజానికి అమెరికన్ డాలర్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలు దాన్ని ఆమోదిస్తాయి. డాలర్లలోనే ప్రపంచ వాణిజ్యం జరుగుతుంటుంది కూడా. అందుకు ప్రతి కరెన్సీని, వాణిజ్యాన్ని డాలర్లతో పోల్చుతూ, లెక్కవేస్తూ ఉంటారు. అయితే, డాలర్ కన్నా విలువైన కరెన్సీలు కూడా ఉన్నాయి. దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, జీడీపీ, అభివృద్ధి రేటు వంటి అంశాల ఆధారంగా వాటి కరెన్సీ విలువ ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిదేశాల కరెన్సీ విలువ డాలర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక్క కువైట్ దినార్‌కు 3.26 అమెరికన్ డాలర్లు వస్తాయి. అంటే రూ.270 అన్నమాట. ఈ జాబితాలో టాప్‌లో ఉన్న దేశాలన్నీ చమురు ఉత్పత్తితో సంపన్నంగా మారినవి, పారిశ్రామిక విప్లవంతో అభివృద్ధి చెందినవే కావడం గమనార్హం. కువైట్ దినార్ కంటే కూడా విలువైన కరెన్సీ ఒకటి ఉంది. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండే గుర్తింపులేని ఓ చిన్నదేశం (మైక్రోనేషన్) ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోర్గా’కు చెందిన సెబోర్గన్ ల్యూగినో కరెన్సీ అది. ఈ కరెన్సీని స్థానికంగా లావాదేవీలకు, బ్యాంకుల్లో వినియోగిస్తారు. బయట ఎక్కడా చెల్లదు. ఇక్కడి బ్యాంకుల్లో కరెన్సీ మార్పిడి విలువ ప్రకారం.. ఒక్కో సెబోర్గన్ ల్యూగినోకు ఆరు డాలర్లు ఇస్తారు. అంటే మన కరెన్సీలో రూ.498 అన్నమాట. ఒక డాలర్‌కు 42,350 ఇరాన్ రియాల్లు ప్రపంచంలో అత్యంత తక్కువ విలువైన కరెన్సీ ఇరాన్ రియాల్. ఒక డాలర్‌కు ఏకంగా 42,350 ఇరాన్ రియాల్స్ వస్తాయి. మన కరెన్సీతో పోల్చితే.. ఒక్క రూపాయికి 510 ఇరాన్ రియాల్స్ వస్తాయి. నిజానికి భారీగా చమురు ఉత్పత్తి చేసే ఇరాన్.. ఇతర దేశాల్లా సంపన్నంగా మారి ఉండేది. కానీ ఆ దేశంలో రాజకీయ అనిశి్చతి, అణు ప్రయోగాల వల్ల ఆర్థిక ఆంక్షల వల్ల పరిస్థితి దారుణంగా మారింది. -
భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్‌కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
1,12,000లకు పడిపోయిన రియాల్
టెహ్రాన్ : అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ రియాల్ భారీగా కుప్పకూలింది. నిన్నటివరకూ ఒక డాలర్‌తో పొల్చినప్పుడు 98000 రియాల్స్ ఉన్న ఆ దేశ కరెన్సీ, ఆదివారం ఒక్కరోజే 1,12,000లకు పడిపోయింది. ఈ ఏడాది మార్చి నెలలో తొలిసారిగా ఇరాన్ దేశ కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చినప్పుడు 50 వేలకు పైచిలుకు కిందకు పడింది. అయితే, దీన్ని చక్కదిద్దేందుకు ఏప్రిల్‌లో ఇరాన్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోందన్న భయం ఆ దేశ వాసులను డబ్బును దాచుకునేలా ప్రేరేపించింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం లోపించింది. ఈ ఘటన వల్ల పెట్టుబడులు, దాని ప్రభావం కారణంగా ఉత్పత్తి, దీని వల్ల ఎగుమతులు తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో రియాల్ విలువ భారీగా పడిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015లో ఇరాన్‌తో జరిగిన అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రకటించిన తర్వాత ఇరుదేశాల సంబంధాలు సన్నగిల్లాయి. ఈ ఏడాది ఆగష్టు 6, నవంబర్ 4న ఇరాన్‌పై అమెరికా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించనుంది. -
ఒమన్‌లో రూ.65 కోట్లకు భారత మహిళ టోపీ
దుబాయ్: పెట్టుబడిదారులకు రూ.65 కోట్ల మేర టోపీ వేసిన ఓ భారత మహిళ ఒమన్ నుంచి ఉడాయించింది. తాను పలు ప్రాజెక్టులకు ఇన్చార్జినని పేర్కొంటూ ఒమన్ మంత్రిత్వ శాఖకు చెందిన నకిలీ పత్రాలను చూపించి, తమను మోసగించినట్లు బాధితులు తెలిపారు. వారంతా భారత్‌కు చెందినవారేనని ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ తెలిపింది. తమ పెట్టుబడికి కొన్ని నెలలవరకూ వడ్డీ సక్రమంగానే చెల్లించిందని, తర్వాత ఎగ్గొట్టిందని ఓ బాధితుడు తెలిపారు. ఆమె ఈ ఏడాది మే నెలలో ఒమన్ నుంచి పరారైందని.. ప్రస్తుతం మంగుళూరులో ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె కోట్లు కొల్లగొట్టిందని చెప్పారు. తాము పోలీసు కేసు పెట్టామని.. కోర్టునూ ఆశ్రయించామని చెప్పారు.