టెహ్రాన్ : అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ రియాల్ భారీగా కుప్పకూలింది. నిన్నటివరకూ ఒక డాలర్‌తో పొల్చినప్పుడు 98000 రియాల్స్ ఉన్న ఆ దేశ కరెన్సీ, ఆదివారం ఒక్కరోజే 1,12,000లకు పడిపోయింది. ఈ ఏడాది మార్చి నెలలో తొలిసారిగా ఇరాన్ దేశ కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చినప్పుడు 50 వేలకు పైచిలుకు కిందకు పడింది.
అయితే, దీన్ని చక్కదిద్దేందుకు ఏప్రిల్‌లో ఇరాన్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోందన్న భయం ఆ దేశ వాసులను డబ్బును దాచుకునేలా ప్రేరేపించింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం లోపించింది. ఈ ఘటన వల్ల పెట్టుబడులు, దాని ప్రభావం కారణంగా ఉత్పత్తి, దీని వల్ల ఎగుమతులు తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో రియాల్ విలువ భారీగా పడిపోయింది.
ఇరాన్, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015లో ఇరాన్‌తో జరిగిన అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రకటించిన తర్వాత ఇరుదేశాల సంబంధాలు సన్నగిల్లాయి. ఈ ఏడాది ఆగష్టు 6, నవంబర్ 4న ఇరాన్‌పై అమెరికా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించనుంది.
Comments
Please login to add a commentAdd a comment