Rijistresans
-
రాజధానికి స్టార్ స్టేటస్
విజయవాడ : రాష్ట్రాన్ని పర్యాటకరంగ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సోమవారం పర్యాటక రంగ మిషన్‌ను ప్రకటించారు. అదే సమయంలో ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కొన్ని కంపెనీలతో ఒప్పందాలను, మరికొన్ని కంపెనీలతో రిజిస్ట్రేషన్స్ కుదుర్చుకున్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది పర్యాటక రంగ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. స్టార్స్హోటళ్లు, రిసార్ట్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఐదు నక్షత్రాల హోటళ్లురాజధాని ప్రాంతంలోనూ, విజయవాడ నగరంలోనూ కంపెనీలు పెట్టేందుకు నగరంతో పాటు రాజధాని ప్రాంతంలోనూ ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించేందుకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. సీవ్యాలీ రిసార్ట్స్‌కు చెందిన ప్రభుకిషోర్ రూ.150 కోట్లతో నగరంలో 5 స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజ్ గ్రూప్ అండ్ జీవీ ఎస్టేట్ అండ్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ తరఫున మలినేని రాజయ్య రూ.200 కోట్లతో అమరావతిలో హోటళ్లు నిర్మించనున్నారు. ఐటీసీ గ్రూపు రూ.290 కోట్లతో విశాఖపట్నం, గుంటూరు నగరాలలో 5 స్టార్ హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్ఎల్ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్ రూ.1000 కోట్లతో రాజధాని ప్రాంతంలో పాటు వివిధ జిల్లాలో రిసార్ట్స్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కృష్ణాతీరంపై దృష్టి పెట్టండి : చంద్రబాబు పర్యాటకరంగంలో పెట్టుబడి పెట్టేందుకు రాజధాని ప్రాంతంలో ఏఏ అవకాశాలున్నాయో పెట్టుబడుదారులకు సీఎం చంద్రబాబునాయుడే స్వయంగా వివరించారు. వివిధ జిల్లాల్లో అందమైన ప్రదేశాల గురించి అవగాహన కల్పించారు.రాజధాని ప్రాంతాన్ని, విజయవాడ గుంటూరు నగరాలను అందంగా తీర్చిదిద్దుతామని, పెట్టుబడిదారులు, స్థానికులు కూడా ఈప్రాంతం పై దృష్టి పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. విజయవాడ నదీతీరంలో ఉందని ఈ ప్రాంతం పై పర్యాటక రంగ పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 30 కిలో మీటర్ల మేర నదిలో ఎప్పుడూ నీరు ఉండి ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. నగరానికి మధ్యలో మూడుకాల్వలు వెళ్లుతున్నాయని, వీటిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో రాజధాని ప్రాంతాన్ని బ్లూ, గ్రీన్ సిటీగా మార్చుతామని విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ శానిటేషన్, గ్రీనరీ, టూరిజంపై దృష్టి పెడతామని చెప్పారు. పర్యాటకరంగంలో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. -
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం
నవంబర్‌లో శ్రీకారం దస్తావేజు లేఖరులకు చెక్ నేటినుంచి విధుల బహిష్కరణ అధికారులు, సిబ్బందిలోనూ గుబులు విజయవాడ : స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియను వచ్చే నెల నుంచి ప్రారంభించనుండంతో దస్తావేజు లేఖర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఎప్పటినుంచో వినపడుతున్నప్పటికీ ఇప్పటికి కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపిందని సమాచారం. రవాణ, పాస్‌పోర్టు కార్యాలయాల్లో మాదిరిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ ద్వారా చేయాలని భావించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దస్తావేజు లేఖరులు లేకుండా నేరుగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే విధంగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇందుకు సంబంధించి సెంట్రల్ సర్వర్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసి కొత్త సాఫ్ట్వేర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సేల్డీడ్లు, గిఫ్ట్‌డీడ్‌లు, ఇతర రిజిస్ట్రేషన్లు ఎవరికి వారు సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. ఆస్తుల మార్కెట్ విలువను కూడా నెట్లో పొందుపరిచారు. ప్రజలు తాము రిజిస్ట్రేషన్ చేయించుకోదలుచుకున్న ఆస్తి మార్కెట్ విలువను నేరుగా నెట్లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఫీజులు చలానా రూపంలో నేరుగా చెల్లించుకోవచ్చు. స్లాట్ బుకింగ్ ఇలా... రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్ ప్రమేయం లేకుండా ఎవరికివారు సొంతంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయదలుచుకునే వారు ఆన్లైన్లో డాక్యుమెంటు నమూనాను పూర్తి చేయాలి. వెబ్సైట్లోకి వెళ్లి, ఆ దరఖాస్తులో ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు వేలిముద్రలతో సహా వచ్చేస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం నింపాల్సి ఉంటుంది. మార్కెట్ విలువ ఆన్లైన్లోనే తెలుసుకుని, బ్యాంకు ఖాతా నుంచే నగదు బదిలీ ద్వారా చలానా లేకుండా ఫీజు కట్టేయవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రర్ చేయదలుచుకుంటారో అందులో పేర్కొం టే ప్రాధాన్యతా క్రమంలో స్లాట్ కేటాయిస్తారు. ఆ సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే పాత దస్తావేజులు, లింకు డాక్యుమెంట్లు పరిశీ లించి మరోసారి వేలిముద్రలు, ఫొటో లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందులో డాక్యుమెంటురైటర్కు ఎటువంటి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. డాక్యుమెంటు రైటర్ దళారీగా వ్యవహరించి రిజిస్ట్రేషన్స్ సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా ఈ విషయం తెలియడంతో దస్తావేజు లేఖర్లలో, రిజిస్ట్రేషన్స్ అధికారులు, సిబ్బందిలో అలజడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వారు ఆందోళనకు దిగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. నేటి నుంచి దస్తావేజు లేఖరుల సమ్మె చల్లపలి: దస్తావేజు లేఖరుల సేవలను దూరంగా పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రెండురోజులపాటు వారు సమ్మెకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి అందిస్తున్న దస్తావేజుల సేవలను నిలిపివేసి, మీసేవా కేంద్రాలకు అప్పగించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 10రోజులు చేపట్టిన సమ్మె వల్ల జిల్లాలో రూ.24 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈసారి చేపట్టనున్న సమ్మెవ ల్ల రూ.8కోట్లు మేర ఆదాయానికి గండి పడనుంది. విజయవాడ రిజిస్ట్రార్ పరిధిలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా, మచిలీపట్నం రిజిస్ట్రార్ పరిధిలో 14 సబ్‌రిజిస్ట్రార్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 1800 మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్స్, డీటీపీ ఆఫరేటర్లు పనిచేస్తున్నారు. -
రిజిస్ట్రేషన్స్ బాదుడుకుపచ్చజెండా!
రేపటి నుంచి అమలుకు సిద్ధం! జేసీతో రిజిస్ట్రేషన్ అధికారుల భేటీ విజయవాడ : రిజిస్ట్రేషన్స్ బాదుడుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పొలాలు, స్థలాల విలువలు పెంచేందుకు రిజి స్ట్రేషన్స్, రెవెన్యూ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు అందగానే శుక్రవారం నుంచి కొత్త రేట్ల ప్రకారం మార్కెట్ విలువలు పెంచేందుకు తుది ప్రతిపాదనలను తయారుచేశారు. బుధవారం రాత్రి జాయింట్ కలెక్టర్ జె.మురళి ఆధ్వర్యంలో మార్కెట్ విలువలు నిర్ధారించే కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సబ్ రిజిస్ట్రార్లు తయారుచేసిన ప్రతిపాదనలను కమిటీ చైర్మన్, జాయింట్ కలె క్టర్ పరిశీలించినట్లు సమచారం. మొత్తం మీద గతంలో ఉన్న రేట్ల కంటే 30 నుంచి 70 శాతం పెంచాలని ఆ కమిటీ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి గురువారంలోపు వచ్చే ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలోని 28 మంది సబ్-రిజిస్ట్రార్లు తమతమ ఏరియాల్లో బహిరంగ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు ప్రతిపాదనలు తయారుచేశారు. గ్రామాల్లో పెరగనున్న విలువలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తక్కువగా ఉన్న భూములు, స్థలాల విలువలు భారీగా పెంచేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. కృష్ణాజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గన్నవరం, ఉయ్యూరు, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో బయట మార్కెట్ విలువలతో చూసుకుని ప్రభుత్వ విలువలను భారీగా పెంచారు. ఆయా ప్రాంతాల్లో గతంలో ఉన్న విలువల క ంటే 70 శాతం ప్రభుత్వ విలువలు పెరగనున్నట్లు తెలిసింది. విజయవాడలో 30 శాతం... విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలకంటే 30 శాతం పెంచినట్లు తెలిసింది. గాంధీనగర్ , గుణదల, పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 30 శాతం విలువ పెరిగినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలో అన్నిమున్సిపల్ కేంద్రాలలో కూడా మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి.