rivew
-
దుర్గమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. టీటీడీ తరపున దుర్గమ్మకు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వైవీ తెలిపారు. రాష్ట్ర్రంలో అన్ని దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు దేవాదాయ శాఖ నిధులు కేటాయించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు దుర్గమ్మ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుబ్బారెడ్డికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేష్‌బాబు,అర్చకులు స్వాగతం పలికారు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దుర్గమ్మ తెప్పోత్సవానికి రెండంచెల భద్రత దుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదివారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రెండంచెల భద్రత నడుమ దుర్గమ్మ తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు. బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన తర్వాతే తెప్పోత్సవం నిర్వహించాలని వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ,పోలీస్, దేవాదాయ, పురపాలక, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష
పాతగుంటూరు: జిల్లా సూపరింటెండెంట్ కె.నారాయణ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నేర సమీక్షసమావేశం ఆదివారం ఉమేష్ చంద్ర సమావేశమందిరంలో జరిగింది. సమావేశంలో కృష్ణా పుష్కరాలు అత్యంత సమర్థవంతంగా పనిచేసిన జిల్లా పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ఈనెల 11న జరిగిన లోక్ అదాలత్‌లో జిల్లాపోలీసులు సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాను మూడో స్థానం నిలిపినందుకు అభినందనలు తెలిపారు. రానున్న మహాశివరాత్రికి కోటప్పకొండ, జిల్లాలోని ఇతర శైవక్షేత్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేసి, నేరాలను అరికట్టాలన్నారు. స్టేషన్ల పరిధిలో బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఆప్రాంతంలో ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు రామాంజనేయులు, వై.టి.నాయుడు, ఏఎస్పీ తుళ్లూరు విక్రమ్‌పాటిల్, డీఎస్పీలు మధుసూధనరావు, నాగేశ్వరరావు, మహేష్, రమణమూర్తి, వెంకటనారాయణ, సుధాకర్, సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు, లక్ష్మయ్య, విక్రమ్ శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పాల్గొన్నారు. -
సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిద్దాం
- అధికారులతో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను అదేశించారు.మంగళవారం కాన్ఫరెన్స్‌లో హాల్లో సంక్రాంతి సంబరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12న ఉదయం 9–12 గంటల మధ్య గ్రామ పంచాయతీ, మండల స్థాయిల్లో నిర్వహించాలని, అదే రోజు మధ్యాహ్న 3–8 గంటల మధ్య జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మహిళలకు ముగ్గుల పోటీలు, దామోదరం సంజీవయ్య ఉన్నత పాఠశాలలో రాయలసీమ రుచులపై వంటల పోటీలు నిర్వహించాలన్నారు. సాయంత్రం 5 నుంచి8 గంటల వరకు పోలీసు పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. సంబరాల్లో భాగంగా జన్మభూమిలో బాగా పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేత. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అధిక ఉత్పతిని సాధించిన రైతులు, బాగ పనిచేసిన అధికారులకు సత్కారం చేస్తామన్నారు. వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, డీఆర్డీఏ, డ్వామా తదితర అధికారులు తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధిపై స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూలు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించాలనా్నరు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.