సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిద్దాం
- అధికారులతో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను అదేశించారు.మంగళవారం కాన్ఫరెన్స్‌లో హాల్‌లో సంక్రాంతి సంబరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12న ఉదయం 9–12 గంటల మధ్య గ్రామ పంచాయతీ, మండల స్థాయిల్లో నిర్వహించాలని, అదే రోజు మధ్యాహ్న 3–8 గంటల మధ్య జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహిళలకు ముగ్గుల పోటీలు, దామోదరం సంజీవయ్య ఉన్నత పాఠశాలలో రాయలసీమ రుచులపై వంటల పోటీలు నిర్వహించాలన్నారు. సాయంత్రం 5 నుంచి8 గంటల వరకు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించాలని తెలిపారు.
సంబరాల్లో భాగంగా జన్మభూమిలో బాగా పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేత. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అధిక ఉత్పతిని సాధించిన రైతులు, బాగ పనిచేసిన అధికారులకు సత్కారం చేస్తామన్నారు. వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, డీఆర్‌డీఏ, డ్వామా తదితర అధికారులు తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధిపై స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూలు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించాలనా్నరు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.