sankranti sambaralu
-
జల్లికట్టు.. గిత్తను పట్టు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు. ముగిసిన బండలాగుడు పోటీలు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు. -
ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయం..
ఒంగోలు: స్థానిక గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్దలగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలినేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దలగుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు వీరయ్య సినిమా కేక్‌ను కట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుందన్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్యగా చిరంజీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుంచి గాంధీబొమ్మ సెంటర్లో 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుంటను వైఎస్సార్ సీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్ తాడి కృష్ణలత సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. మీ వాడిని.. ఎప్పుడూ అందుబాటులో ఉంటా ‘‘నేను మీ వాడిని... మీతో కలిసి పెరిగిన వాడ్ని..తిరిగిన వాడ్ని... నా బాల్యం అంతా గద్దలగుంటలోనే గడిచింది. ఇక్కడి ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గద్దలగుంటతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఇప్పటికే గద్దలగుంటలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, మరో వారం రోజుల్లో రూ.10 లక్షలతో మహిళా భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గద్దలగుంటలో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్‌బాబు, కాపు కళ్యాణ మండపం చైర్మన్ టీవి రంగారావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివరావు, కమిటీ సభ్యులు ఈదుపల్లి అంకబాబు, కాటా నాగేశ్వరరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, చిట్టెం వెంకటేశ్వర్లు, తోటకూర చైతన్య, మలిశెట్టి రాజేంద్రప్రసాద్, దండే వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. (క్లిక్ చేయండి: 2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా) -
పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే
పండగ అంటే ఆధ్యాత్మిక.. సంప్రదాయాల వేదిక.. ఏడాదికోసారి వచ్చే తెలుగువారి పెద్ద పండగంటే.. ఆ ప్రత్యేకతే వేరు.. చుట్టాల పిలుపులు.. తోబుట్టువులతో మాటలు.. ఆత్మీయతాను బంధాలను ఓ చోటకు చేర్చి జరుపుకొనే ఆనందాల వేడుక.. రక్త సంబంధాల సరదా కలయిక.. అలాంటి పండగలు ప్రస్తుత యాంత్రిక జీవన వేగంలో అంతే మెరుపు వేగంతో సాదాసీదాగా వెళ్లనీయకుండా అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలతో.. నూరు శాతం పండగల్లానే జరుపుకొనేలా మనమంతా సంక్రాంతి మూడు రోజుల పండగలను మనసారా స్వాగతిద్దాం. తీయని జ్ఞాపకాలను ప్రతి మదిలో దాచుకుందాం.. సాక్షి, అమలాపురం : మా చిన్న తనంలో పండగలు ఎంతో గొప్పగా జరిగేవి.. పూర్వం పెద్దలు పండగలను సంప్రదాయబద్ధంగా జరిపేవారు...వంటి గత వైభవ మాటలను పక్కన పెట్టి ఆ సంప్రదాయాలను.. ఆ అనుభూతులను మన తరం కూడా ఆస్వాదించేలా.. అచ్చమైన.. స్వచ్ఛమైన. పండగలను ఆవిష్కరించుకుందాం. ఇందుకు మనం చేయాల్సిందల్లా యాంత్రిక జీవనంలో కొన్ని అలవాట్లను కాస్త పక్కన పెట్టి ఊరును, ఊళ్లో జరిగే పండగలను.. వాటి ప్రాధాన్యాన్ని ముందు తరాలకు తెలియజేద్దాం. ప్రతి ఇంట ప్రతిరోజూ పండగ అనేలా చేద్దాం. ఉమ్మడి భోజనమే ముద్దు సంక్రాంతి మూడు రోజులూ బయట స్నేహితులతో డిన్నర్లు, పార్టీలంటూ కుటుంబ ఆత్మీయత వాతావరణాన్ని దూరం చేసుకోవద్దు. మామూలు సమయాల్లో తరచూ పార్టీలు, డిన్నర్లు అంటూ సరదాగా గడిపేస్తాం. కనీసం ఆ పండగ మూడు రోజులైనా ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతింట్లో అయిన వాళ్ల మధ్య పూర్తి సమయం కేటాయిస్తే అదే పెద్ద పండగ. భోజనాలు, అల్పాహారాలు ఇంట్లోనే ఆత్మీయులందరూ ఒకే చోట కూర్చుని ఒకేసారి కలసిమెలిసి భుజిస్తే ఆ ఆనందం విలువ చాలా గొప్పగా ఉంటుంది. వ్యసనాలనూ పక్కన పెడదాం సంక్రాంతి పండగల కోసమని సుదూరాల నుంచి సొంతిళ్లకు చాలా మంది వస్తారు. అలాగే ఈ పండగల పేరుతో ఇళ్లన్నీ చుట్టాలతో నిండిపోతాయి. అయితే రోజూ చేసే తన వ్యసనాల పనిని పండగల నాడూ చేసి పండగ సంతోషాలకు దూరం కాకండి. మద్యం సేవించడం, పేకాట ఆడుతూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే.. మీరు పండగలను ఆస్వాదించలేరు. మామూలు రోజుల్లో ఎలాగూ తాగుతారు, తిరుగుతారు.. ఈ మూడు రోజులైనా తమ వాళ్లతో, నా అనుకున్న వాళ్లతో కబుర్లు, కాలక్షేపాలతో ఆనందంగా ఉంటే.. అదే పెద్ద పండగ.. పెద్దలను గౌరవిద్దాం.. పండగలకు సొంతిళ్లకు వచ్చే వారంతా తమ మూలాలైన పెద్దలు జీవిత చరమాంకంలో వృద్ధాప్యంతో ఇంట్లో ఓ గదిలోనే గడిపే వారితో కొన్ని క్షణాలైనా గడపాలి. వారిని గౌరవిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి. వారిపై ప్రేమ చూపిస్తూ.. వారిపై అనురాగాన్ని కురిపించాలి. మనవళ్లు అయితే వారితో కొంతసేపు కూర్చొని నాటి సంక్రాంతి వైభవాలను వారి మాటలతో చెప్పించుకోవాలి. అందరూ గ్రూప్ ఫొటోలు దిగి పండగ జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలి. గతించిన మన ఇంటి పెద్దల పేరు చెప్పి ఎవరికైనా నూతన వస్త్రాలు కానుకగా ఇవ్వాలి. ‘సెల్’ఫిష్‌గా వద్దు మనిషితో మనిషి ఆప్యాయంగా నేరుగా మాట్లాడుకునే రోజులు తగ్గాయి. పక్క రూమ్‌లో ఉన్నా సెల్ఫోన్లో చాటింగ్ చేసుకునే రోజులొచ్చేశాయి. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుందని సంబరపడాలో.. లేక సంబంధబాంధవ్యాలను దూరం చేస్తుందని బాధ పడాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో ఎక్కడెక్కడో స్థిరపడి పండగలకు కార్లు, బైక్‌లపై సొంతూళ్లకు వారు ఈ సెల్ ఫోన్లు పట్టుకుని వాటితో గడిపేయకండి. పండగల మూడు రోజులూ వాటిని కాస్త పక్కన పెట్టి మీ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులతో సంతోషంగా పండగ చేస్కోండి. జాగ్రత్తగా నడుపుదాం పండగలను సొంతూళ్లలో జరుపుకోవాలని హైదరాబాద్, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లో స్థిర పడ్ద వారు కార్లలో కుటుంబ సమేతంగా రెక్కలు కట్టుకుని మరీ బయలుదేరతారు. అలాంటి వారు అప్రమత్తతో డ్రైవింగ్‌ను అప్రమత్తతతో చేయాలి. అందరూ ఒకేసారి సొంతూళ్లకు బయల్దేరడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో ఉంటాయి. ఆ ట్రాఫిక్‌లో నెమ్మదిగా డ్రైవ్ చేసుకుని రావాలి. అతివేగం వల్ల నీ సొంతింటికి ఓ గంట ముందే చేరుకోగలవు. అదే నెమ్మదిగా రావడం వల్ల ఓ గంట ఆలస్యంగా వస్తావు. ఏదైనా ప్రమాదం జరిగితే నీ పయనమే కాదు నీ వేగమూ ఎందుకూ...ఎవరికీ పనికి రాదు. పండగను పండగలానే జరుపుకోవాలి పండగను పండగలానే జరుపుకోవాలి. ఏదో క్యాజువల్‌గా అన్నట్టుగా ఫ్యాషన్, టెక్నాలజీ పేరుతో పైపైనే జరుపుకోకూడదు. మనకు ఎన్ని పనుల ఒత్తిడి ఉన్నా.. ఎంతటి బిజీ లైఫైనా సంక్రాంతి పండగల మూడు రోజులూ సంప్రదాయ దుస్తుల దగ్గర నుంచి రుచులు, వినోదాలు, ఆచారాలు అన్నీ నిండైన పండగలో మనమంతా మమేకం కావాలి. ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతింటికి చేరుకుని ఉమ్మడి కుటుంబంలా పండగలను జరుపుకొంటాం. – పేటేటి శాంకరీ, మురమళ్ల, ఐ.పోలవరం మండలం బంధాలను బలపరిచేవే పండగలు నా దృష్టిలో అన్ని పండగల కంటే సంక్రాంతి పండగలు మనుషుల మధ్య బంధాలను బాగా బలపరుస్తాయి. ఉద్యోగాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఏ పండగలు ఎలా ఉన్నా సంక్రాంతి పండగలకు మాత్రం వచ్చి వాలిపోతారు. అందుకే సంక్రాంతి పండగలు ప్రతి ఊరే కాదు.. ప్రతి కుటుంబం ఓ సంబరాల సందడిగా మారిపోతాయి. పిల్లలు, పెద్దలు ఇలా అన్ని వయసుల వారిని మూడు పండగలు సంతోషపెడతాయి. – పేరి లక్ష్మీనరసింహం, విశ్రాంత బ్యాంక్ అధికారి, అమలాపురం -
సంక్రాంతి సంబరాల్లో ఆకర్షణగా గుర్రపు స్వారీలు..
సాక్షి. విజయవాడ: జిల్లాలోని అంపాపురంలో యార్లగడ్డ యూత్ ఆధ్వర్యంలో మన ఊరు-మన సంక్రాంతి పేరుతో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నృత్యాలు, కోలాటాలు, ముగ్గుల పోటీలతో పాటు గ్రామీణ క్రీడలు, గుర్రపు బండ్ల స్వారీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా యజమాని పరువు నిలిపేందుకు కదనరంగంలో కాలుదువ్విన కోడిపందాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అనంతరం పోటీలో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ సాంప్రదాయ సక్రాంతి పండుగ సంబరాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. కృష్ణా: జిల్లాలోని గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కనులపండుగగా జరిగాయి. పౌరుషానికి ప్రతీకగా సాగిన కోడిపందాలు ఆకర్షణగా నిలిచాయి. కోడిపందాలను తిలకించేందుకు మహిళలు ఎంతో ఆసక్తిని కనబరచగా.. వివిధ జిల్లాల నుంచి పందెం ప్రియులు తరలివచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన కాక్ ఫైట్‌ను తిలకించడానికి రైతులు ఉత్సాహాన్ని చూపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొనడంతో సంక్రాంతి సంబరాలకు కొత్త కళ వచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి: జిల్లాలోని అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు, గన్నవరం నియోజకవర్గంలో కోడింపందాలు, గుండాటలు జోరు సాగాయి. ఈ క్రమంలో కోడిపందాళ్లలో పోలీసుల ఆంక్షల్ని పందెం రాయుళ్లు బేఖాతరు చేశారు. -
సాక్షి: సంక్రాంతి స్పెషల్ సాంగ్
-
విజయవాడ నలంద విద్యానికేతన్ లో సంక్రాంతి సంబరాలు
-
అట్టహాసంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
డాలస్/ఫోర్ట్ వర్త్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) డల్లాస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. సాంస్కృతిక బృంద సమన్వయకర్త లక్ష్మి పాలేటి , కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం ఆధ్వర్యంలో ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జనవరి 28న డల్లాస్ లోని ఇర్వింగ్ హైస్కూల్లో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రధాన వ్యాఖ్యాతలుగా సమీరా ఇల్లందుల, మధుమహిత మద్దుకూరి, అభినుత మద్దుకూరిలు సంప్రదాయానికి పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. 2017 వ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని టాంటెక్స్ నూతన అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డిని పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సభకు పరిచయం చేశారు. ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పర్వదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్ధంగా భావిస్తానని చెప్పారు. తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని, మహా తెలుగు సభలు టాంటెక్స్ ఆధ్వరంలో నిర్వహిస్తామన్నారు. మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గతేడాది మీరు అందించిన సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని, తెలుగు జాతి అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జొన్నలగడ్డకి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో టాంటెక్స్అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి గారు, పాలకమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే కార్యనిర్వాహక సభ్యులుగా విశేష సేవలందించిన జ్యోతి వనం, వెంకట్ దండ, రఘుగజ్జల, సుగన్ చాగర్లమూడి, శ్రీనివాస రెడ్డి గుర్రంలను జ్ఞాపికలతో సత్కరించారు.ఇక్కడికి విచ్చేసిన టాటా సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు, డైమండ్పోషక దాత డా.ఝాన్సి రెడ్డిని కార్యవర్గం సన్మానించింది. విశిష్ట అతిధి, బుల్లి తెర వ్యాఖ్యాత, చలన చిత్ర నటుడు జెమిని సురేష్ తన సినీ అనుభవాలను పంచుకున్నారు. స్వరమంజరి అనే కార్యక్రమం ద్వారా టాంటెక్స్ వారు నూతన కళాకారులను వెలుగులోకి తెచ్చి వారికి చక్కని అవకాశాలు కల్పిస్తారు. 2016 విజేతలయిన స్నిగ్ధ ఏలేశ్వరపు, కీర్తి చామకూర, దీపికా కాకర్ల అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. శ్రీ లక్ష్మితోరం నేతృత్వంలో నాట్య ప్రదర్శన, గిరిజా ఆనంద్ రూపకల్పనలో ‘శివ పూజకు వేళాయరా’, శ్రీ దేవి యడ్లపాటి గారి ఆధ్వర్యంలో ‘శంభో శివ శంభో’ అనే పాటకు, జయలక్ష్మి గొర్తి ‘శ్రీమాన్నారాయణ’ శాస్త్రీయ నృత్యం, రూప బంద రూపకల్పనలో ‘ఓం మహాప్రాణ దీపం’ నృత్యం, హేమమాలిని చావలి ‘కొలువైతివా రంగ సాయి’ అంటూ చక్కని నృత్యాలు కనుల విందు చేశాయి. నూతన కార్యనిర్వాహక సభ్యులు భాను లంక, మనోహర్ కాసగాని, ప్రబంధ రెడ్డి తోపుదుర్తి, శరత్ రెడ్డి ఎర్రం, సమీరా ఇల్లందులను, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, రాం కొనార, వేణు పావులూరిలను కమిటీలోకి ఆహ్వానించారు. క్రాంతి కార్యక్రమం చేపట్టిన చంద్రశేఖర్ కాజ,అజయ్ గోవాడ, శ్రీలు మండిగ, జెమిని సురేశ్ లను సత్కరించారు. ఆహూతులకు టచ్ నైన్ వారు పసందైన విందు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో చీరలు, చుడిదార్లు, గాజులతో నిండిన ఎన్నో స్టాల్ లు అతివలకోసం ఏర్పాటుచేశారు. అక్కడే టాక్స్ ఫైలింగ్ ఏర్పాట్లు, యోగ, ఆర్యోగ సంబంధిత స్టాల్ ల ద్వారా ఎన్నో విషయాలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం , ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. -
సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిద్దాం
- అధికారులతో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను అదేశించారు.మంగళవారం కాన్ఫరెన్స్‌లో హాల్లో సంక్రాంతి సంబరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12న ఉదయం 9–12 గంటల మధ్య గ్రామ పంచాయతీ, మండల స్థాయిల్లో నిర్వహించాలని, అదే రోజు మధ్యాహ్న 3–8 గంటల మధ్య జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మహిళలకు ముగ్గుల పోటీలు, దామోదరం సంజీవయ్య ఉన్నత పాఠశాలలో రాయలసీమ రుచులపై వంటల పోటీలు నిర్వహించాలన్నారు. సాయంత్రం 5 నుంచి8 గంటల వరకు పోలీసు పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. సంబరాల్లో భాగంగా జన్మభూమిలో బాగా పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేత. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అధిక ఉత్పతిని సాధించిన రైతులు, బాగ పనిచేసిన అధికారులకు సత్కారం చేస్తామన్నారు. వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, డీఆర్డీఏ, డ్వామా తదితర అధికారులు తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధిపై స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూలు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించాలనా్నరు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. -
సంక్రాంతి సంబురాలు