RK Nagar assembly bypoll
-
'అమ్మ, దేవుడి దీవెనలు మాకే'
సాక్షి, చెన్నై : ఎన్నికల ప్రచార సమయంలోనే కాదు పోలింగ్ రోజు కూడా తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఆసక్తికర మాటలు వినిపిస్తున్నాయి. ఓపక్క తమ అభ్యర్థికే అమ్మ(జయలలిత), దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయంటూ అన్నాడీఎంకే పార్టీ చెప్పుకుంటుండగా విజయం తనదేనంటూ టీటీవీ దినకరన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా తన వెంటే ఉన్నారని, వారికి తనపై పూర్తి విశ్వాసం ఉందని చెబుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ తరుపున ముఖ్యమంత్రి పళనీస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కలిసి మధుసూధనన్ అనే వ్యక్తిని ఎన్నికల బరిలో దింపగా దినకరన్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక ప్రతిపక్ష డీఎంకే ఎన్ మారుదు గణేశ్ అనే వ్యక్తిని, బీజేపీ కే నాగరాజన్ అనే అభ్యర్థిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
మరింత వేడెక్కిన ఆర్కేనగర్ బరి
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరి మరింత వేడెక్కింది. తాజాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 12వ తేదీన జరగనున్న ఈ ఉప ఎన్నికలలో తాను ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ఆమె తెలిపారు. పోలింగ్ అధికారి ప్రవీణ్ నాయర్‌కు ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దానికి ముందుగా చెన్నై మెరీనా బీచ్‌లోని అమ్మ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. జయలలిత మరణం తర్వాత ముందుగా వచ్చింది ఆర్కేనగర్ వాసులేనని, ఇప్పుడు అమ్మకు అసలైన వారసులు ఎవరన్న విషయాన్ని వాళ్లే ఈ ప్రపంచానికి చాటి చెబుతారని ఉద్వేగంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. అన్నాడీఎంకేకు మంచి నాయకత్వం అవసరమని, కేవలం తాను మాత్రమే జయలలిత చూపించిన మార్గంలో పార్టీని నడిపించగలనని కార్యకర్తలు భావిస్తున్నారని దీప అన్నారు. ఎన్నికల కమిషన్ తమకు ఏ గుర్తు కేటాయిస్తే దానిమీదే పోటీ చేస్తానని తెలిపారు. తాను ప్రచారం ప్రారంభించగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని వివరించారు.