నేడు సీఎం పర్యటన ఇలా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఏలూరు రానున్నారు. దోమలపై యుద్ధం–పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి ఫైర్స్టేçÙన్ సెంటర్ మీదుగా సురేష్ బహుగుణ స్కూల్ వరకూ జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం స్కూల్లో జరిగే సమావేశంలో మాట్లాడతారు. ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో నగరపాలక సంస్థ మేయర్, అధికారులు సమావేశమై కార్యక్రమం విజయవంతం చేసే అంశంపై చర్చించారు. గురువారం జరిగిన యువభేరి కార్యక్రమం విజయవంతం కావడంతో దానికి దీటుగా జనాన్ని సమీకరించాలని కార్పొరేటర్లకు లక్ష్యాలు ఇచ్చారు.