కమాన్ రాక్‌స్టార్స్
దక్కన్ పీఠభూమిలో ఠీవీగా నిల్చున్న భాగ్యనగరంలో హిల్స్‌కు కొదవేం లేదు. కాంక్రీట్ వనంలా మారిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వదిలిపెడితే.. నగర శివార్లకు వెళ్తే.. ఇప్పటికీ.. ఎన్నో బండరాళ్లు సహజమైన అందాలతో దర్జాగా నిల్చుని ఉన్నాయి. ఉలి అలికిడి లేకుండానే వెలిసిన ఈ రాళ్ల సోయగాన్ని కాపాడే ల క్ష్యంతో కొన్ని సంస్థలు రాకథాన్, రాక్వాక్, రాక్ క్లయింబింగ్ వంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఈ రోజు శంషాబాద్ దగ్గర్లోని వైట్ క్వార్ట్జ్ క్లిఫ్ దగ్గర రాక్వాక్ నిర్వహిస్తోంది ద సొసైటీ టు సేవ్ రాక్స్. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్ఎమ్డీసీ ప్రధాన ద్వారం దగ్గర రాక్స్టార్లంతా జట్టుకట్టి ఉదయం 7.30 గంటలకు అక్కడ్నుంచి మెయిన్స్పాట్కు బయల్దేరుతారు. ఇందులో పాల్గొనేవారు సొంత వాహనాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఫోన్: 9866019402, 9848418085