Romanian
-
కెనడా–అమెరికా సరిహద్దు దాటబోతూ... భారతీయ కుటుంబం దుర్మరణం
టొరొంటో: కెనడా నుంచి నదీ మార్గంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో బోటు తిరగబడి ఓ భారతీయ కుటుంబం దుర్మరణం పాలైంది. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటిదాకా 8 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఇవి భారత, రొమేనియా సంతతికి చెందిన రెండు కుటుంబాలవిగా తేలింది. మృతుల్లో భారతీయులు ఎంతమంది అన్నది తేలాల్సి ఉంది. అలాగే మరో మృతదేహం దొరకాల్సి కూడా ఉందని పోలీసులు చెప్పారు. -
నేను బతికున్న దెయ్యాన్ని...!
బతికున్న దెయ్యమేమిటా అని అనుకుంటున్నారా ? రుమేనియాకు చెందిన కాన్స్టాంటిన్ రేలూ స్వానుభవమిది. ఎవరికీ ఎదురుకాని వింత పరిస్థితిని ఆయన ఎదుర్కుంటున్నారు. జీవించి ఉన్నా.. ప్రభుత్వ లెక్కల్లో మరణించినట్టే. ఈ మేరకు స్థానిక న్యాయస్థానం కూడా దానిని ధృవీకరించేసింది. టర్కీలో వంటవాడిగా 20 ఏళ్లకు పైగా పనిచేసి రెండునెలల క్రితం రుమేనియాకు తిరిగొచ్చాక తాను జీవించిలేనన్న కఠోర వాస్తవం ఆయనకు తెలిసొచ్చింది. అప్పటి నుంచి తనను తాను బతికున్నట్టుగా చట్టపరంగా నిరూపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు. దీనిపై కోర్టు గుమ్మమెక్కినా గత గురువారం ప్రతికూల తీర్పు రావడంతో హతాశుడయ్యాడు. 1992లో టర్కీలో పనిచేసేందుకు వెళ్లి, 1995లో స్వదేశానికి తిరిగొచ్చాడు కాన్స్టాంటిన్ రేలూ. తన భార్య తీరు బాగా లేకపోవడంతో 1999లో శాశ్వతంగా టర్కీకి వెళ్లిపోయాడు. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో ఈ జనవరిలో టర్కీ అధికారులు ఆయనను రుమేనియాకు తిప్పి పంపించేశారు. బుకారెస్ట్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులు రేలూ రికార్డుల్లో చనిపోయినట్టు ఉన్న విషయాన్ని తెలియజేశారు. అంతటితోనే ఆగకుండా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ముఖం, కళ్ల మధ్య దూరం తదితర కొలతలు, వేలిముద్రలు తీసుకుని, పాత పాస్‌పోర్టులోని ఫొటో వివరాలతో సరిపోల్చి చూశారు. అతడు పుట్టిన పట్టణం, టౌన్‌హాల్, ఇతర విషయాల గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. రేనూ చెప్పిన వివరాలతో విమానాశ్రయ అధికారులు సంతృప్తి చెందినా అక్కడితో ఆయన సమస్యలు తీరలేదు. ఆయన స్వస్థలం వాస్లూయి కౌంటీలోని బార్లాడ్ నగర ప్రభుత్వ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. వచ్చిన చిక్కల్లా రేనూ భార్య 2016లో ఆయన మరణించినట్టుగా ధృవీకరించి ఆ మేరకు ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ను కూడా పొందింది. దానిని తిరగరాస్తూ తాను బతికున్నట్టుగా మరో సర్టిఫికెట్‌ను ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటీషన్‌ను కూడా కోర్డు కొట్టేసింది. భార్య కూడా ఇటలీలో స్థిరపడడంతో ఆమె జాడ కనుక్కోవడం అసాధ్యమై పోయింది. మళ్లీ కొత్తగా కేసు పునర్విచారణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు డబ్బులు లేక తిరిగి టర్కీ వెళ్లకుండా విధించిన బహిష్కరణతో అక్కడకు వెళ్లలేక త్రిశంకుస్వర్గంలో వేలాడుతున్నాడు. ‘నేను బతికున్న దయ్యాన్ని. ప్రాణంతోనే ఉన్నా అధికారికంగా మరణించినట్లు ప్రకటించిన వాడిని’ అంటూ రేలూ వాపోతున్నాడు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హై స్పీడ్ ట్రైన్‌ను పట్టుకొని వేలాడుతూ..
59 ఏళ్ల వ్యక్తి హై స్పీడ్ జర్మన్ ట్రైన్‌ను పట్టుకొని వేలాడుతూ దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించారు. జర్మనీలో పర్యటిస్తున్న ఓ రొమానియన్ తన లగేజీని ట్రైన్లోనే మరిచి పోయి బిలేఫీల్డ్ స్టేషన్ ఫ్లాట్‌ఫాంపై దిగిపోయారు. అంతలోనే ట్రైన్ స్టార్ట్ అవ్వడంతో డోర్లు మూసుకుపోయాయి. ఎలాగైనా తన లగేజీని తీసుకోవాలనే తొందరలో హై స్పీడ్ ట్రైన్‌ని పట్టుకున్నారు. రెండు బోగీలను కలిపే భాగంలో ట్రైన్‌ని పట్టుకొని సదరు వ్యక్తి దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించారు. ట్రైన్ స్టాఫ్ బయటవైపు ఉన్న రొమానియన్ను గమనించి డ్రైవర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో స్టాప్లేకపోయినా తదుపరి స్టేషన్లో డ్రైవర్ ట్రైన్‌ని ఆపారు. ఆ వ్యక్తి తిరిగి అదే ట్రైన్లో తన లగేజీని తీసుకొని హనోవర్ వరకు వెళ్లారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని జర్మనీ అధికారులు తెలిపారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్‌ను ఎలా పట్టుకుని వేలాడో... మిషన్ ఇంపాజిబుల్ సినిమా చాలా సార్లు చూశాడేమో అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, అతన్ని విచారించనున్నారని అధికారులు తెలిపారు. -
రొమేనియాలో ఘోర ప్రమాదం 27 మంది మృతి
-
రుమేనియా బ్యూటితో సల్మాన్ పెళ్లి
బ్యాచిలర్ లైఫ్ తో విసిగెత్తిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న సల్మాన్.. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న రుమేనియా బ్యూటి లులియా వాంటర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. గత కొద్దికాలంగా పెళ్లిపై దృష్టి మరలిందన్నాడు. కొద్ది రోజులుగా నిట్టూర్పులతో జీవితం గడుస్తోందని.. ఇక నిట్టూర్పులకు ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు సల్మాన్ వెల్లడించారు. మానవత్వం అంటే ఇష్టమని.. ఇస్లాం, క్రైస్తవ మతాలను నమ్ముతాను.. నా తండ్రి ముస్లిం.. తల్లి హిందువు.. రెండవ తల్లి కాథలిక్.. బావ పంజాబీ.. అయితే ఈసారి మా ఇంట్లోకి బయట నుంచి కోడల్ని తీసుకురావాలనుకుంటున్నానని సల్మాన్ చమత్కరించారు. ఎంతోమంది హీరోయిన్లతో సల్మాన్ కు అఫైర్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను లవర్ కంటే మంచి ఫ్రెండ్ గా సరిపోతానని సల్మాన్ తెలిపారు.