rompicharla
-
మంచి జరిగితేనే ఓటెయ్యమన్నాడు సీఎం జగన్..!
-
చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బీరు బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఐదు రోజులక్రితం సోమలలో తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఘర్షణలకు దిగారు. టీడీపీ కార్యకర్తలు రొంపిచెర్ల క్రాస్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించి చెప్పులతో కొట్టి కాల్చివేశారు. దీనిపై రొంపిచెర్ల సర్కిల్లో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తిరిగి సాయంత్రం ఇరువర్గాలు రొంపిచెర్ల సర్కిల్‌కు చేరుకోగా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో రొంపిచెర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న రొంపిచెర్ల ఎస్ఐ శ్రీనివాస్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికి కల్లూరు, భాకరాపేట, పీలేరు, ఎర్రావారిపాళ్యెం స్టేషన్ల నుంచి పోలీసులు రొంపిచెర్లకు చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, దాడుల విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి రొంపిచెర్ల చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. రొంపిచెర్ల మండలంలో ఉనికి కోసమే టీడీపీ ఘర్షణలకు పాల్పడుతోందని అన్నారు. చదవండి: (నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్) -
మిత్రుడికి సాయం చేయబోయి ప్రాణాలు కోల్పోయారు
సాక్షి, జగిత్యాల: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో జగిత్యాల జిల్లా ధర్మపురి లో విషాదం అలుముకుంది. రొంపిచర్ల వద్ద ఒక కారు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు ధర్మపురికి చెందిన వారే కావడంతో ధర్మపురి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ధర్మపురికి చెందిన కటకం మహేష్, అతని బావమరిది రాయపట్నంకు చెందిన ఆనంద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీరు గౌడ్, అతని కుమారుడు శివ బాలాజీ ఉన్నారు. ఆంధ్రకు చెందిన మేస్త్రీ మాధవ్ తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా రఘునాథపురంలో ఉన్న ఇంటికి పెయింటింగ్ వేసేందుకు మిత్రుడి కారులో నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరాడు. కారులో మాధవ్‌తో పాటు మహేష్, ఆనంద్, బీరుగౌడ్, శివబాలజీ కూడా ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత రొంపిచర్ల సమీపంలో మూలమలుపు వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న మాధవ్ తప్పించుకొని సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు తో సహా నలుగురు మృతదేహాలు వెలికితీశారు. ప్రమాద విషయం తెలియడంతో ధర్మపురిలోని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ధర్మపురి లో ఉంటున్న బీరు గౌడ్ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ ముందు భార్యతో పాటు కుటుంబ సభ్యులంతా యూపీకి వెళ్లడంతో బీరు గౌడ్ అతని కుమారుడు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మేస్త్రి మాధవ్‌కు వీరంతా మంచి మిత్రులు కావడంతో అతని సొంత ఇంటికి కలర్ వేసేందుకు ధర్మపురిలోకలర్ మిక్సింగ్ చేసి తీసుకెళ్తుండగా ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పొయారు. ఇంతమంది ఓకేసారి ప్రాణాలు కోల్పొవడంతో స్థానికంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. చదవండి: విషాదం: ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి -
లాటరీ పేరిట కుచ్చుటోపీ
తొలిరోజు 5 రూపాయలు, రెండవ రోజు రూ.6, 3వ రోజు రూ.7..ఇలా రోజుకో రూపాయి పెంచుకుంటూ నెల తిరిగేసరికి రూ.656 చెల్లింపు..ఆపై లాటరీలో పలు రకాల వస్తువులు..చీప్ అండ్ బెస్ట్‌లో భలే బాగుంది స్కీమ్ అని పేద, మధ్య తరగతి మహిళలు ఎగిరి గంతేశారు..అడపాదడపా లాటరీలో చిన్నపాటి వస్తువులు ఇస్తూండడంతో సోషల్ మీడియా కంటే వీరి నోళ్లల్లో ఇది బాగా వైరల్ అయ్యింది. ఇంకేముంది? మరెందరో అమ్మలక్కలు ఈ లాటరీ స్కీమ్‌లో చేరిపోయారు. లాటరీ మాయలోడు అనుకున్న టార్గెట్ చేరుకునేసరికి రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్దేశాడు. ఈసారి అందరి నోళ్లూ లబోదిబోమన్నాయి. మళ్లీ ఇది వైరల్ అయ్యింది!! సాక్షి, రొంపిచెర్ల(చిత్తూరు) : రైస్ కుక్కర్లు, స్టీల్ బిందెలు, కుర్చీలు..వంటసామాన్లు..వేటికైనా సరే రోజూ డబ్బులు కడితే లాటరీలో వస్తువులు ఇస్తామని నమ్మించి ఓ వ్యాపారి లక్షల రూపాయలు వసూలు చేసుకుని జెండా ఎత్తేశాడు. దీంతో బాధితులు గగ్గోలు పెట్టారు. వివరాలు.. పీలేరు వాసినంటూ ఎస్.సాఫిక్‌బాషా అనే ఓ వ్యక్తి ఆరేడు నెలల క్రితం స్థానిక బజారు వీధిలో ఒక ఇంటిని బాడుగకు తీసుకుని ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ పేరిట దుకాణం తెరిచాడు. మొదటి రోజున 5 రూపాయలు కడితే చాలు..ఆ తర్వాత రోజు నుంచి రోజూ రూపాయి కలుపుకుని కడితే చాలంటూ ఊదరగొట్టాడు. ఇది మహిళల నోట బాగా నానడంతో స్థానికంగా బాగా ప్రచారమైంది. అడపాదడపా లాటరీ వేస్తూ వంద రూపాయల విలువ చేసే వస్తువులు ఆయా ప్రాంతాల్లో మహిళలకు ఇస్తూండడంతో వారికి నమ్మకం కలిగింది. పాసు పుస్తకం తరహాలో ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ పేరిట కార్డును మహిళలకు ఇచ్చి అందులో తీసుకున్న డబ్బుల వివరాలు ఎంట్రీ చేసేవాడు. దీంతో రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని ముత్యాలమ్మ గుడివీధి, పాళ్యెంవీధి, హైçస్కూల్‌వీధి, చిన్నమసీదువీధి, బలిజవీధి, శ్రీరాములగుడివీధి గ్రామాల్లో సుమారు 800 మంది నెల నెలా రూ656 చెల్లించారు. లాటరీ పేరిట వేస్తున్న వస్తువులకు మహిళలు మరింత ఆకర్షితులయ్యారు. దీంతో వందల మంది మహిళలు 6 నెలలుగా దాదాపు రూ20 లక్షల వరకూ చెల్లించారు. అయితే ఆదివారం రాత్రి ఆ వ్యాపారి ఎవరికీ చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి అదృశ్యమయ్యాడు. బాధిత కుటుంబం వ్యాపారి తమిళనాడు వాసేనా? సోమవారం అతని దుకాణం తెరవకపోవడం, అతగాడు ఇచ్చిన సెల్ నంబర్ 97860 54496కు ఫోన్ చేస్తే ‘‘ఆప్ కీ ద్వారా డయల్ కియా గయా నంబర్ ఉపయోగ్ మే నహీ హై’’! అని వస్తూండడంతో అక్కడికి వచ్చిన మహిళలు గుండెల్లో రాయి పడినట్లైంది. తొలుత తమిళంలో ఇదే విషయం వస్తూండడంతో ఇతగాడు తమిళనాడు వాసి కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందకంటే గతంలో ఇలా లాటరీ, తక్కువ ధరకే వస్తువుల పేరిట జిల్లాలో దుకాణాలు తెరచి బిచాణా ఎత్తేసినవాళ్లంతా చాలావరకు తమిళనాడు వాసులే కావడం గమనార్హం! లాటరీ వ్యాపారి జంప్ అయ్యాడనే విషయం దావానలంలా వ్యాపించడంతో బాధితులు పోలో మంటూ దుకాణం వద్దకు చేరుకున్నారు. తాము మోసపోయామని గ్రహించి లబోదిబో మన్నా రు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో వ్యాపారి కోసం పీలేరులో గాలించారు. అలాంటి వ్యక్తి ఎవరూ పీలేరులో లేరని తెలియడంతో బావురుమన్నారు. -
బాలికను డాన్స్‌తో ఆకట్టుకొని.. కిడ్నాప్ చేశాడు
సాక్షి, రొంపిచెర్ల(చిత్తూరు) : బాలిక కిడ్నాప్‌కు గురైన ఘటన రొంపిచెర్లలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రసాద్ కథనం..మండలంలోని బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ రామచంద్రాపురం కాలనీకి చెందిన బాలిక స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఈ బాలిక ఉండగా చిన్నగొట్టిగల్లుకు చెందిన పవన్‌కుమార్(24) మాయమాటలు చెప్పి తన నలుగురు స్నేహితులతో కలసి ఈ నెల 20న కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరుకు చెందిన రమ్య(22), గోవిందరాజులు (23), చిన్నగొట్టిగల్లు చెందిన సాయికుమార్ (19), చిన్నగొట్టిగల్లు కుమ్మరపల్లెకు చెందిన మునిరత్నం (22)పై కేసు నమోదు చేశారు. వీరిలో గోవిందరాజులు, సాయికుమార్, మునిరత్నం రొంపిచెర్ల క్రాస్‌లో ఉండగా బుధవారం ఉదయం అరెస్టు చేశారు. నిందితులను పీలేరు కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రధాన నిందితుడు పవన్‌కుమార్‌పై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. డ్యాన్స్‌తో బుట్టలో పడేశాడు! పవన్ కుమార్ బెంగళూరులోని ఓ నృత్య శిక్షణ సంస్థలో డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. రొంపిచెర్లలోని ప్రైవేటు స్కూలు నిర్వాహకులు ప్రతి ఏటా నిర్వహించే వార్షికోత్సవంలో అతను మూడేళ్లుగా క్రమం తప్పకుండా తన నృత్యప్రదర్శన ఇస్తున్నట్లు తెలిసింది. అతడి నృత్యానికి ఫిదా అయిన బాలిక అతడితో చేసుకు న్న పరిచయం కిడ్నాప్ వరకూ వ్యవహా రం వరకూ నడిచింది. ఆ బాలిక కిడ్నాప్‌కు సహకరించిన అతని మిత్రులైన గోవిందరాజులు, రమ్య కూడా బెంగళూరులోనే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు నిందితుల్లో సాయికుమార్ ప్రధాన నిందితుడికి తమ్ముడని తెలిసింది. మొత్తానికి కిడ్నాప్ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, పోలీసులు వెంటాడుతున్న వైనం..వెరసి సినిమాను తలపిస్తోంది! ప్రధాన నిందితుడు పట్టుబడితే మాత్రం పోలీసులు తమదైన డ్యాన్స్ చేయించడం గ్యారంటీ. బెంగళూరుకు రయ్..రయ్ బాలిక కిడ్నాప్ కేసు ఛేదనకు సంబంధించి స్థానికులందించిన సమాచారం పోలీసులకు ఉపకరించింది. అలాగే, ఇక్కడి నుంచి మోటార్ సైకిల్‌పై పీలేరు మీదుగా బెంగళూరుకు బాలికను తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు పీలేరులోని సీసీ కెమెరాల పుటేజీ కీలకంగా నిలిచింది. కెఏ 05 హెచ్‌టి 5642 బజాజ్ పల్సర్ బైక్‌లో నిందితుడు బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. అంతేకాకుండా పవన్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను ఎటు వెళ్తున్నాడో పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బెంగళూరు నుంచి ఆ తర్వాత బస్సులో బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లిన పవన్‌కుమార్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వైపు వెళ్తున్నట్లు సమాచారం. -
హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ
రొంపిచెర్ల: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రొంపిచెర్లలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వసీం అక్రం వూట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవిని కాదని సీఎం చంద్రబాబు చెప్పడం సబబు కాదన్నారు. ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమస్యను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రవుంలో ఎన్ఎస్యూఐ నేతలు అలీ, నిషార్ అహ్మద్, బరకత్, షాజహాన్, వుుజీబ్, ప్రకాష్, రవి పాల్గొన్నారు.