round
-
ఉద్యోగాలపై బారి వేటు అదిరి పోయే ప్యాకేజ్..
-
వ్యక్తి చుట్టు కుప్పగా హాట్ చిప్స్.. ఫన్నీ వీడియో..
కాన్బెర్రా: సోషల్ మీడియాలో చాలా మంది వెరైటీ చాలెంజ్‌లు వేసుకుంటూ ఓవర్‌నైట్ ఫేమస్ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైస్‌బకెట్ చాలెంజ్, ట్రీ చాలెంజ్ వంటి.. అనేక రకాల చాలెంజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, మైఖేల్ బ్రోఖుయ్స్, మార్టిన్ సోకోలిన్స్కి జంట ఒక కొత్త రకం స్కిట్‌ను చేశారు. ఈ ఫన్నీ జంట.. ఎప్పటి కప్పుడు కొత్త ప్రయోగాలు, కామెడి స్కెచ్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా వీరు.. ఒక విచిత్రమైన వీడియోను తమ మార్టియండ్ అండ్ మైఖేల్ అనే ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం దాన్ని చూసి నెటిజన్లు ఫన్నీగా ఫీలవుతున్నారు. ఈ వీడియోలో.. ఆస్ట్రేలియాలోని సర్ఫర్స్ ప్యారడైజ్ బీచ్‌లో మైఖేల్ తనను తాను.. హట్ చిప్స్‌తో కప్పించుకున్నాడు. దాదాపు 75వేలరూపాయల.. చిప్స్‌లను అతని చుట్టు కుప్పగా పోశారు. ఈ చిప్స్‌లను తినడానికి అక్కడి పక్షులు.. అతని చుట్టు కొన్ని వందల పక్షులు గుమిగూడాయి. పాపం.. అతను మాత్రం కదలకుండా ఒక శిల్పం మాదిరిగా ఉండిపోయాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘బలే.. ఫన్నీగా ఉంది..’..‘పాపం.. చిప్స్‌లో కప్పేసారుగా..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Marty and Michael (@martyandmichael) -
జీఎస్టీపై పోరాటం
11న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ‘జీఎస్టీ-ప్రజలపై దాని ప్రభావం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం రాజమహేంద్రవరం సిటీ : సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విషయంలో ప్రజలకు న్యాయం జరిగే వరకూ సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని, దేశంలోని పార్లమెంట్ సభ్యుల సహకారంతో పార్లమెంట్లో చర్చిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు, జీఎస్టీ ప్రజలపై దాని ప్రభావం అనే అంశంపై శుక్రవారం రాజమహేంద్రవరం వై.జంక్షన్ ఆనం రోటరీ హాల్లో సీపీఐ ఆద్వర్యంలో అఖిలపక్షనేతలు, వ్యాపారులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో జీఎస్టీ పై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న విధానాన్ని భారతదేశంలో అమలు చేయడం దారుణమన్నారు. నూతన చట్టం అమలుతో ఇప్పటికే చిరువ్యాపారులు, చేనేతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 28 శాతం పన్ను మన దేశంలోనే ఉందని మండిపడ్డారు. సామాన్యప్రజలకు న్యాయం జరిగే వరకూ ïసీపీఐ ఆద్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. జీఎస్టీ విషయమై ఈ నెల 11న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కొత్త చట్టం ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. దాన్ని అమల్లోనికి తీసుకువచ్చే అధికారులకు సైతం అవగాహన లేని పరిస్థితి ఉందన్నారు. సీపీఐ తమ పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధానమంత్రితో చర్చ ఏర్పాటు చేస్తే తాను పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.యూపీఏ పాలనలో జీఎస్టీ 18 శాతం ఉండేలా ప్రతిపాదనలు చేస్తే మొదటగా వ్యతిరేకించింది మోడీయేనని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి,కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఏమాత్రం అవగాహాన లేని చట్టాన్ని అమల్లోనికి తీసుకుని వచ్చారన్నారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టే విధంగా అమల్లోనికి వచ్చిన జీఎస్టీ ప్రజలను సైతం ఆర్థికంగా ఇబ్బందిపెట్టే విధంగా తయారైందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ వ్యాపారాన్ని వృత్తిగా చూడాలన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ సుబ్బారాయుడు, హోల్‌సేల్ బట్టల వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బొమ్మనరాజ్‌కుమార్, సీపీఐ జిల్లా నాయకులు మధు, నగర కార్యదర్శి నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
స.హ చట్టం ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు
– ఫోరం ఫర్ ఆర్టీఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి – దేశానికే నష్టం: వైఎస్సార్సీపీ నేత కందుల దుర్గేష్ సాక్షి, రాజమహేంద్రవరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ప్రస్తుత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కారు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీలో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, ఆర్టీఐ కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఫోరం జిల్లా కన్వీనర్ వరదా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల 70 శాతం అవినీతి అంతమవుతుందన్న సమయంలో ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దీన్ని రాజకీయ నేతలు, మేధావులు, ఆర్టీఐ కార్యకర్తలు తిప్పికొట్టాలని కోరారు. స.హ. చట్టానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తమ పార్టీ నేతలతో చర్చించి పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆర్టీఐ లేకపోతే దేశానికే నష్టమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ తమ పార్టీ తరఫున చట్ట సవరణకు వ్యతిరేకత తెలియజేస్తామని చెప్పారు. కార్పొరేటర్ కోసూరి చండీ ప్రియ మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టీఐ చేసే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పిల్లి నిర్మల, రెడ్డి పార్వతి, పితాని లక్ష్మి కుమారి, ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ కార్యకర్త చేతన్, జనం పత్రిక సంపాదకులు కె.వెంకటరమణ, బీసీ నేత హారిక, తదితరులు పాల్గొన్నారు. -
అలా లేకుంటే విమానాలు కూలిపోతాయి
ఒక వస్తువు నిర్మాణానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకే, ప్రతిపనికి భవిష్యత్ అంచనాలు, గతంలోని పరాభావాలు, ప్రస్తుత అనుభవాలు మేళవించుకొని ఒక వస్తువును రూపొందిస్తారు. అది చూసేందుకు తేలికగా అనిపించినా, పెద్దగా ఆలోచింపలేకపోయినా అసలు కథ తెలిస్తే మాత్రం అవునా.. అలాగా అని ఆసక్తిగా అనుకోవాల్సిందే. సాధారణంగా మనం విమానాలు చూస్తుంటాం. కొందరికైతే వాటిలో ప్రయాణించిన అనుభవం కూడా ఉండి ఉండేఉంటుంది. ఆ సమయంలో గమనించారో లేదో ఏ విమానానికి చూసిన దాని కిటికీలు గుండ్రంగా ఉంటాయి. అసలు విమానాల కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయో ఆలోచించారా.. అలా ఉండటం వల్ల మతలబు ఏమిటి? ఎప్పటి నుంచి వాటిని గుండ్రంగా తయారుచేయడం మొదలుపెట్టారు? వాటిని చతురస్రాకారంలోనో, దీర్ఘ చతురస్రాకారంలోనో, త్రిభుజాకారంలోనో ఎందుకు తయారు చేయలేదు? అని పరిశీలిస్తే.. దాని వెనుక అసలు కథ తెలిసింది. అది 1950. అప్పుడు జెట్ లైనర్ విమానాలు బాగా ట్రెండింగ్. ఇవి మిగతా విమానాల కన్నా వేగంగా దూసుకెళ్లగల లక్షణాలు కలిగి ఉండటంతోపాటు ఎంతో ఒత్తిడినితట్టుకోగలవి. కానీ,దీని కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉన్నాయి. అయితే, అనుహ్యంగా ఇదే జెట్ లైనర్ విమానాలు 1953లో కూలిపోయి 56 మంది ప్రాణాలు విడిచారు. ఇలా ఎందుకు జరిగి ఉంటుందని విచారణచేస్తే ఆ విమాన కిటికీలే సమస్య అని తెలిసింది. సాధారణంగా చతురస్రాకరంలో ఉంటే వాటికి కోణాలు ఉంటాయిని, ఒక్కోకోణం ఒక్కో బలహీనత ఉండి అక్కడ లోపలికి గాలి చొచ్చుకొచ్చి విండో పగిలిపోయి అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉండి విమానాన్ని కూలిపోయేలే చేస్తుందని వారు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి విమానాల కిటికీలు గుండ్రంగా రూపొందించడం మొదలు పెట్టారు. అలా ఉండటం వల్ల ఒత్తిడి అనేది ఒక చోట కేంద్రీకృతం కాకుండా విండో చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుంది. తక్కువ ఒత్తిడి మాత్రమే విండోస్‌పై పడి విమానాలు సురక్షితంగా ఉంటాయి. -
భూగోళం చుట్టేసిన బుజ్జాయి!!
పది నెలల వయసుకే ప్రపంచ దేశాలు తిరిగిన పసివాళ్ళ గురించి ఎప్పుడైనా విన్నారా? లండన్ కు చెందిన ఓ చిన్నారి ఇప్పుడు అదే పనిలో ఉంది. పదినెలలకే ప్రారంభించిన ప్రయాణంతో పదహారు నెలలు వచ్చే సరికల్లా భూగోళం చుట్టేసి.. ఇప్పుడు ఆన్లైన్లో అందర్నీ ఆకట్టుకుటోంది. అతి చిన్న వయసులో ప్రపంచ పర్యాటకురాలిగా పేరు తెచ్చుకుంది. సాధారణంగా తల్లులంతా తమకు పుట్టిన పిల్లలతో మెటర్నిటీ లీవ్ ను ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటారు. వారి ఆలనా పాలనా చూసుకుంటూ.. వారి ముద్దు మురిపాలను ఆస్వాదిస్తుంటారు. కానీ ఎడ్వర్డ్స్ దంపతులు అందుకు భిన్నంగా తమ చిన్నారిని తీసుకొని ప్రయాణం ప్రారంభించారు. ఓ బ్యాక్ ప్యాక్ ను తగిలించుకొని ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కాంబోడియా, ఇండోనేషియా, థాయిల్యాండ్ వంటి దేశాలన్నీ చుట్టేశారు. దీంతో అడుగులు కూడా వేయడంరాని వయసులో ఆ దంపతుల గారాలపట్టి ఎస్మె.. ఏకంగా 12 దేశాలు తిరిగేసింది. ఇప్పుడు అమ్మానాన్నలతో కలసి దిగిన ఫొటోలతో బ్లాగుల్లోనూ, ఇన్ స్టా గ్రామ్ లోనూ అందర్నీ ఆకట్టుకుంటోంది. లండన్ కు చెందిన 31 ఏళ్ళ కరేన్ ఎడ్వర్డ్స్.. మెటర్నిటీ లీవ్ ను అందరికీ భిన్నంగా వినియోగించుకుంది. తన కూతురు ఎస్మె కు పది నెలలు వచ్చాయోలేదో... ఆమెను భుజాన వేసుకొని భర్త షాన్ బేన్స్ తో కలిసి ప్రపంచ పర్యటన ప్రారంభించింది. చిన్నారికి పదహారు నెలలు వచ్చేసరికి పదిసార్లు విమాన ప్రయాణం చేసింది. తమ అద్భుత ప్రయాణ అనుభవాలను పొందుపరుస్తూ ఎడ్వర్డ్స్.. తన బ్లాగ్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లోనూ ఫోటోలు పోస్ట్ చేసింది. ఎడ్వర్డ్స్ దంపతులకు ట్రావెలింగ్ అంటే ఇష్టంతోపాటు.. ప్రపంచం మొత్తం పర్యటించాలన్న కోరికా బలంగా ఉంది. కల సాకారం చేసుకునేందుకు ఉన్న కారును అమ్మేశారు. ఇల్లు కూడా అమ్మకానికి పెట్టారు. బేన్స్ తన ఉద్యోగాన్ని వదిలేశాడు. అంతేకాదు తమ ప్రయాణాన్ని ఇప్పట్లో ఆపాలని కూడా వాళ్లు అనుకోవడం లేదు. ఇలా వాళ్లు చేపడుతున్న ప్రయాణాలతో వారి ముద్దుల పట్టి ఎస్మె అతి చిన్న వయసులోనే ప్రపంచ పర్యాటకుల్లో ఒకరిగా స్థానం సంపాదించేసింది.