Roundtable
-
మళ్లీ జగనే అవసరం
సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పౌర సేవలు దేశానికే ఆదర్శం. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందుతోంది. విద్య, వైద్య రంగాల్లో పశి్చమ దేశాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ జగనే అవసరం. ఆయన గెలిస్తే ఏపీ మరో సింగపూర్‌గా మారుతుంది’ అంటూ పలువురు ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన – ప్రవాసాంధ్రుల స్పందన’ అనే అంశంపై శనివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 దేశాల నుంచి 50 మందికి పైగా ప్రవాసాంధ్రులు ప్రత్యక్షంగా, మరికొన్ని దేశాల నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంపై ప్రవాసాంధ్రులు రూపొందించిన అభివృద్ధి నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు, వాటిలో మౌలిక సదుపాయాలు పశి్చమ దేశాల్లో స్కూళ్లను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. విలువైన ట్యాబ్‌లు, అత్యుత్తమ సిలబస్‌ను ఆ దేశాల్లో ఏ ప్రభుత్వమూ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడంలేదన్నారు. ఏపీలో మాత్రం లక్షలాది విద్యార్థులు వీటిని ఉచితంగా పొందుతున్నారన్నారు. సుమారు కోటీ నలభై లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నాయని, ఇలాంటి సదుపాయం అగ్రదేశం అమెరికాలో కూడా లేదని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా 12 కోట్ల పౌర సేవలు అందడం విశేషమని చెప్పారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు గణాంకాలతో సహా వివరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని, వీటి విలువ రూ.7.75 లక్షల కోట్లని చెప్పారు. నిరుద్యోగం 4.5 శాతానికి తగ్గిందని, కొత్త పరిశ్రమల ద్వారా గతేడాది 14 లక్షల పీఎఫ్ ఖాతాలు కొత్తగా చేరాయని, 18 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పెరిగారని తెలిపారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రవాసాంధ్రులు ఏమన్నారంటే.. ముందు చూపు ఉన్న నేత జగన్ విద్యారంగంలో వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించే నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. నైపుణ్య వనరులుంటే పెట్టుబడులకు ముందుకు వస్తారు. అలాంటి వనరులను సీఎం జగన్ ఏపీలో సమకూర్చారు. ఇలాంటి ముందు చూపు అంబేడ్కర్‌కే సొంతం. మళ్లీ ఇప్పుడు జగన్‌లో అంబేడ్కర్‌ను చూస్తున్నా. రాష్ట్రంలో రూ.10 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఐటీ కంపెనీలు, అమెరికాలో మాదిరిగా రూ.2 వేల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈలు వస్తున్నాయి. తీరప్రాంతంలో కొత్తగా పోర్టులు, హార్బర్లు నిర్మిస్తున్నారు. – శివ, టెక్సాస్ స్వాతంత్య్రం వచ్చాక ఇంతలా అభివృద్ధి లేదు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలోకి చాలా పరిశ్రమలు వస్తున్నాయి. నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారాయి. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఇంతలా అభివృద్ధి జరగలేదు. వైఎస్ జగన్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. ఈ బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. – వెంకట్ కల్లూరి, కాలిఫోరి్నయా సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు వైద్య రంగంలో సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వనరులు తక్కువ ఉన్నా కోవిడ్ సమయంలో సమర్థవంతంగా మరణాల సంఖ్యను బాగా తగ్గించగలిగారు. అగ్రదేశం అమెరికాలో సైతం ఇంతలా చేయలేకపోయారు. మరో పదేళ్లు వైఎస్ జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ పవన్ పాముకుర్తి, టెక్సాస్ మరే నాయకుడైనా ఇలా పాలించాడా? ఏపీలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. పేద విద్యార్థులను అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యకు దోహదపడుతున్నారు. మరే నాయకుడైనా ఇలా పరిపాలన చేశారా? ఏపీని ముందుకు తీసుకెళ్తున్న జగన్‌ను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలి. – కార్తీక్ ఎల్లాప్రగడ, నెదర్లాండ్స్ సామాజిక న్యాయం చేసి చూపారు సామాజిక న్యాయం నినాదం కాదు.. చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్ని పారీ్టలు ధనవంతులకే అవకాశాలు కలి్పస్తే.. జగన్ మాత్రం పేదలు, సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. బీసీ ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేశారు. బీసీ ముస్లింలకు వైఎస్ రాజశేఖర్రెడ్డికంటే మిన్నగా ఆయన తనయుడు జగన్ ఎన్నో మేళ్లు చేస్తున్నారు. –ఇలియాస్, కువైట్ మహిళా సాధికారిత భేష్ ముఖ్యమంత్రి జగన్ మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా అన్నింటా అవకాశాలు కలి్పంచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. – పాలకుర్తి నీలిమ, యూఏఈ ప్రతి స్కూలూ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీనే ఏపీ సీఎం జగన్ 40 వేల ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ స్కూళ్లలో పేద, ధనిక తేడా లేకుండా అందరూ వారి పిల్లల్ని చదివించుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగానే చెప్పవచ్చు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆయన్నే మరోసారి గెలిపించుకోవలసిన బాధ్యత అందరికీ ఉంది. – కోటిరెడ్డి, సింగపూర్ అవినీతి గురించి విన్నామా? విద్యావంతులు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కాంలు, ఆశ్రిత పక్షపాతం గురించే వినే వాళ్లం. ఈ ఐదేళ్లలో ఒక్క అవినీతి గురించైనా విన్నామా? వలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందుతోంది. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు అవసరం. సీఎంగా మళ్లీ జగన్నే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు ఉంది. – వెంకట్ ఇక్కుర్తి, యూఎస్ సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది ఏపీలో సంక్షేమం, అభివృద్ధి విశేషంగా జరిగింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 280 కొత్త కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు ఎంతో గొప్ప విషయం. కొత్తగా 4 లక్షల ఎంఎస్ఎంఈలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. – వెంకట్ మేడపాటి, అమెరికా -
రైతుల ఆత్మహత్యలపై స్పందన ఏదీ?
పంజగుట్ట: రాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సేద్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని... అయితే రాష్ట్రం వచ్చిన 9 సంవత్సరాల్లో 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురు వక్తలు ఆరోపించారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి?’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పద్మజాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, కో కన్వినర్లు కన్నెగంటి రవి, పృధ్విరాజ్ యాదవ్, ప్రొఫెసర్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల అధ్యక్షులకు ఇచ్చి వారి మేనిఫెస్టోలో పెట్టాలని సూచించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ... రాష్ట్రంలో 59 లక్షల రైతులు కోటి 45 లక్షల భూమిని సాగుచేస్తున్నారన్నారు. వారికి 3.2 టన్నుల విత్తనాలు అవసరమున్నదని రాష్ట్ర ప్రభుత్వం విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకూ తగ్గించడంతో నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్లు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి సమగ్ర చట్టం విత్తన విధానం తీసుకురావాలని సూచించారు. రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సహకరించేందుకు రాజ్యాంగ బద్ద సంస్థ ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిషన్ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించడం, విత్తనాలు సరఫరా, నాణ్యమైన విత్తనలు, జన్యుపరంగా మార్పు చేసి ఇవ్వాలన్నారు. క్రిమి సంహారక మందులు కూడా ఏ పంటకు ఏ మేర క్రిమిసంహారక మందులు వాడాలో సూచించాలన్నారు. రైతుబంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని కొనసాగిస్తూనే పది ఎకరాలు పైబడి మాగాణి, వర్షాధార భూములు ఉన్న వారికి ఇవ్వరాదన్నారు. ఆదాయపు పన్ను కట్టే ఏ రైతుకుటుంబానికి, భూ యజమానులకు రైతుబందు ఇవ్వకూడదని, ఇతరదేశాల్లో స్థిరపడి ఉన్న భూ యజమానులకూ ఇవ్వరాదని సూచించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎలాంటి పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి సంవత్సరం కరువుతోనో, అధిక వర్షాలతోనో రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏ ఒక్క రైతుకూడా నష్టపోకుండా పటిష్టమైన పంటల బీమా వర్తింపచేయాలన్నారు. రైతులు బాగుపడేందుకు ప్రభుత్వం రూ. 38500 కోట్లు అవసరం అవుతాయని ప్రతి సంవత్సరం అదనంగా రూ. 6400 కోట్లు కేటాయించాలని సూచించారు. సమావేశంలో రంజిత్ కుమార్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య పరికరాల పరిశ్రమలకు చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అభివృద్ధి కోసం సరైన విధానాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని.. ఈ రంగానికి తగిన చేయూతనిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. ‘బయో ఆసియా 2023’ సదస్సులో భాగంగా ఆదివారం హెచ్ఐసీసీలో దేశంలోని 20 ప్రముఖ వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ అందులో పాల్గొని మాట్లాడారు. దేశంలో వైద్య పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలు, పారిశ్రామిక సానుకూలతలను వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. కాగా దేశంలో వైద్య పరికరాల తయారీ రంగానికి అవసరమైన ప్రోత్సాహం, ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఇందులో మెడ్‌ట్రానిక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ బ్లాక్ వెల్, రాజీవ్‌నాథ్ (ఎండీ, హిందుస్థాన్ సినర్జీస్), ఆదిత్య బెనర్జీ (ఎండీ, బీబ్రౌన్ మెడికల్ ఇండియా), సుమీత్‌భట్ (సీఈవో, ట్రైవిట్రాన్ హెల్త్‌కేర్), శిశిర్ అగర్వాల్ (ఎండీ, టెరుమో ఇండియా), భార్గవ్ కోటాడియా (షాజహాన్ మెడికల్ టెక్నాలజీస్), సచిన్ గార్గ్ (డైరెక్టర్, ఇన్నోవేషన్ ఇమేజింగ్ టెక్నాలజీస్), జతిన్ మహాజన్ (ఎండీ, జె.మిత్రా) సహా ఇరవై ప్రముఖ వైద్య పరికరాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పోలవరం పునరావాసంపై రీ సర్వే నిర్వహించాలి
పట్టిసీమ ప్యాకేజీ ఇక్కడెందుకు అమలు చేయరు..? జాతీయ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం మెరుగైన ప్యాకేజీ తరువాతే పనులు చేపట్టాలి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ కాకినాడ సిటీ : పోలవరం ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీ చెల్లింపులకు సంబంధించి రీ సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సోమవారం కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో సీపీఐ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. నిర్వాసితుల సమస్యలపై సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతోందన్నారు. ముంపు బాధితులను నిర్లక్ష్యం చేస్తూ ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థలకు అండగా ఉంటోందని విమర్శించారు. బాధితులకు మెరుగైన ప్యాకేజీ కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు గుత్తేదారులకు లాభాలు చేకూర్చేవిధంగా అంచనాలను పెంచేందుకు వెనుకాడటంలేదన్నారు. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటనను ఖరారు చేస్తామన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించిన మర్నాడే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టర్లకు 2014–15 ధరలను వర్తింపజేస్తూ పాత పనులకు కూడా అంచనాలు పెంచుతూ జీఓ 96 జారీ చేసిందన్నారు. అయితే కనీసం ముంపు బాధితులకు పునరావాసాన్ని పెంచే ఆలోచన చేయకపోవడం చూస్తే ప్రభుత్వతీరు అర్ధమవుతుందని మండిపడ్డారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ పట్టిసీమ పునరావాసంలో ఎకరాకు రూ.52లక్షలు కూడా ఇచ్చారని, పోలవరం పునరావాసానికి వచ్చేటప్పటికి రూ.5 లక్షలు ఇవ్వడానికి తర్జనభర్జన ఎందుకు పడుతోందన్నారు. పా్యకేజీ తరువాతే పనులు చేపట్టాలి... పోలవరం బాధితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించిన తరువాతనే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిహారాన్ని పట్టిసీమ తరహాలోనే పోలవరం బాధితులకు ఇవ్వాలని, ఎకరానికి రూ.15 లక్షలు చెల్లించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతను ప్రత్యేకంగా గుర్తించి రూ.10 లక్షలు చెల్లించాలని, ఆరు సంవత్సరాల క్రితం చెల్లించిన పరిహారం భూములకు కూడా ప్రస్తుతం ఇచ్చే పరిహారాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. మెరుగైన ప్యాకేజీ ప్రకటించే విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే అమరావతిలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు నురుకుర్తి వెంకటేశ్వర్లు, పోలవరం నిర్వాసితుల అఖిలపక్ష నాయకులు కె.మంగరాజు, ఎం.దుర్గాప్రసాద్, ఇంటి పూర్ణయ్య, పొడియం అప్పారావు, కుంజా మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలపై తొందరపాటు వద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : కొత్త జిల్లాలపై తొందరపాటు వద్దని టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు. జిల్లాను విభజించే సందర్భంలో ఇతర జిల్లాలకు చెందిన మండలాలు, నియోజకర్గాలను ప్రస్తుత జిల్లాలో కలవకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాకు కష్ణా నదితీరం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాస్థాయి అధికారుల సంఖ్యను పెంచాలని, ఖాళీ పోస్టులను జనాభా నిష్పత్తితో సర్దుబాటు చేసి వెంటనే నియమించాలని కోరారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని, రాష్ట్ర, జిల్లా క్యాడర్లుగా 90శాతం స్థానిక, 10శాతం ఓపెన్ కోటా పద్ధతిలో నియమకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు రామకష్ణరావు, బాల్కిషన్, రాఘవాచారి, ర ఘురాంరెడ్డి, ఫారుక్‌హుస్సేన్, వెంకట్‌రెడ్డి, వీరబ్రహ్మాచారి, నారాయణగౌడ్, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. -
నేడు విశాఖలో లోక్‌సత్తా రౌండ్‌టేబుల్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: పౌర సేవల హక్కు చట్టం కోసం లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రజా ఉద్యమంలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.