Rowdy politics
-
సీఎం రమేష్ రౌడీయిజం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ మాజీ నేత, బీజేపీ ప్రస్తుత నేత సీఎం రమేష్ తన మార్క్ రౌడీ రాజకీయాలకు తెరతీశారు. అనకాపల్లి జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడా తనిఖీలు నిర్వహించకుండా ముందస్తుగానే అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల వద్దకు వెళ్లి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అధికారులు తనిఖీలు నిర్వహించకూడదంటూ ప్రశి్నస్తున్నారు. ఎదురుదాడికి మించిన ఆత్మరక్షణ లేదనే ధోరణితో ఎన్నికల్లో తాము చేసే అక్రమాలకు అడ్డురాకూడదనే ఆలోచనతో ఈ తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అనకాపల్లిలోని లాడ్జీల్లో కడప నుంచి వచ్చిన అనుచరులు మకాం వేసి హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుతో తనకున్న పాత పరిచయాలతో ఇద్దరూ కలిసి నోటికి పనిచెబుతున్నారు. ఇప్పటికే అయ్యన్నకు భారీ ప్యాకేజీని సీఎం రమేష్ అందించారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో తాము చేసే విచ్చలవిడి అరాచకాలకు అడ్డులేకుండా చూసుకునేందుకే.. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకట్ట వేసేందుకు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రమేష్ రాకతో అలజడి ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన నర్సీపట్నంలో చీరల పంపిణీని అడ్డుకున్న పోలీసులపై చిందులేస్తున్న కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ కోతికి కొబ్బరి చిప్ప! అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇష్టారీతిలో చెలరేగి అధికారులపై మాటల దాడికి దిగుతున్నారు. ఇప్పుడు కల్లు తాగిన కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా... ఈయనకు కాస్తా సీఎం రమేష్ జతకలిశారు. దీంతో నోటికి అదుపులేకుండా అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం చోడవరంలోని ఒక షాపులో పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు వస్తే.. వెంటనే సీఎం రమేష్ రంగంలోకి దిగారు. అధికారులు తనిఖీలు చేయవద్దంటూ అడ్డుకోవడంతోపాటు బెదిరింపులకు దిగారు. తాజాగా నర్సీపట్నంలో నోట్లు, చీరలు పంచుతూ ఓటర్లను ప్రలోభపరిచేందుకు కూటమి చేసే ప్రయత్నాలపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలకు వెళ్లారు. వెంటనే ఒకవైపు సీఎం రమేష్... మరోవైపు అయ్యన్నపాత్రుడులు అధికారులపై మాటల దాడికి దిగారు. తనిఖీలు ఎలా చేస్తారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీపై పరుష వ్యాఖ్యలు ఇక అయ్యన్న ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీలు వెధవలు అంటూ పరుషంగా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారులు తనిఖీలకు వస్తే అభ్యర్థులు సహకరించడం సహజం. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తుల వద్ద తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరించడం పరిపాటి. ఇందుకు భిన్నంగా ఈ ఇద్దరూ అడ్డగోలుగా అధికారులపై ఆరోపణలు గుప్పిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తూ తమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే బెదిరింపుల ద్వారా లబ్ధి పొందేందుకు ఆ ఇద్దరూ ప్రయతి్నస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాడ్జీల్లో మకాం! స్థానికంగా కనీసం ఒక్క ఓటరూతోనూ పరిచయం లేని సీఎం రమే‹Ù... కేవలం రౌడీయిజం ద్వారానే ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లిలోని లాడ్జీల్లో ఇప్పటికే 200 మందికిపైగా తన అనుచరులు మకాం వేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకూ అనకాపల్లిలోని లాడ్జీలను బుకింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ వరకూ ఇక్కడే మకాం వేసి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మరోవైపు మొదటగా సీఎం రమేష్ నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ, జనసేన నాయకులను కలిసి తమకు సహకరించాలంటూ భారీగానే ప్యాకేజీని ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం సీఎం రమేష్ రాక సందర్భంగా హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయ్యన్నకు నోట్ల కట్టలు? ఇన్నాళ్లూ అనకాపల్లి ఎంపీ సీటు స్థానికుడికి ఇవ్వాలని హడావుడి చేసిన అయ్యన్న.. సీఎం రమేష్ విషయంలో మాత్రం ఒక్క మాట మాట్లాడడంలేదు. పైగా అయ్యన్ననే వెంటబెట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే అయ్యన్నకు ప్యాకేజీ ముట్టిందని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు రౌడీయిజం.. మరోవైపు నోట్ల కట్టల ద్వారా ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు సీఎం రమేష్ చేస్తున్న ప్రయత్నాలపై అనకాపల్లి జిల్లాలో ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి జిల్లాలో వీరి రాకతో రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందుతున్న ఓటర్లు అందరివాడు, సౌమ్యుడు బూడి ముత్యాలనాయుడుతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చోడవరంలో కేసు నమోదు జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం (డీఆర్ఐ) అధికారుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసినందుకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమే‹Ù, టీడీపీ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చోడవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లు రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో పాటు కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ధిక్కరించడం, విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. -
పొలిటికల్ కారిడార్: రౌడీ షీటర్ విడుదల కోసం రోడ్డెక్కిన పరిటాల సునీత
-
అమరావతిలో రౌడీ రాజ్యం
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు : అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ఐదేళ్లుగా రెచ్చిపోయిన తెలుగు దేశం పార్టీ నాయకులు.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరింతగా బరితెగిస్తున్నారు. తమ పార్టీకి ఎదురుతిరిగిన నాయకులు, ప్రజలపై దాడులు చేయడమే కాకుండా ‘అడ్డు’ తొలగించుకునేందుకు సైతం సిద్ధపడుతున్నారు. సాధారణ ప్రజలను కారుతో తొక్కించి చంపేస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటుండగా.. వాస్తవం మాత్రం ఆందోళనకరంగా ఉంది. రాజధాని ప్రాంతంలో సాధారణ ప్రజలకు రక్షణ లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శుక్రవారం నెక్కల్లులో తాడికొండ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రధాన అనుచరులు బీసీ కులస్తులపై కారుని ఎక్కించి హత్య చేసిన ఘటనతో రాజధాని ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దౌర్జన్యాలు పెరుగుతాయంటూ సీఎం స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారాలకు దిగుతుంటే.. ఏకంగా రాజధాని ప్రాంత ప్రజలే గత ఐదేళ్లలో ఎన్నడూ లేని రౌడీ రాజ్యాన్ని చూసినట్లు వాపోతున్నారు. ఐదేళ్లలో పెరిగిన దాడులు, దౌర్జన్యాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు రాజధానిలో చేయని అరాచకాలు లేవు. ప్రతిపక్ష నాయకులు, తమ అవినీతి, అక్రమాలకు అడ్డొచ్చిన అమాయక ప్రజలే టార్గెట్‌గా దాడులు, అక్రమ కేసులు బనాయించారు. సామాన్య ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేసేలా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. మాట వింటే సరే.. లేదంటే అంతమొందించడం, దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి హింసించడం వారికి పరిపాటిగా మారిపోయాయి. మందడంలో హోటల్ మేనేజర్‌పై దాడి చేస్తున్న టీడీపీ నేత గుర్రం సాయికృష్ణ (ఫైల్) రాజధాని భూములు తగలబెట్టడం ప్రారంభించి.. రాష్ట్ర రాజధానికి భూములివ్వలేదనే అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దలు ఎలాగైనా భూములు లాక్కోవాలని 2014 డిసెంబర్లో రాత్రికి రాత్రే రాజధాని ప్రాంతంలో ఆరు చోట్ల పంట పొలాలు, వ్యవసాయ పనిముట్లు తగలబెట్టించారనేది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారంలో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ పని చేయించారని టీడీపీ పెద్దలు అసత్య ప్రచారం చేయించారు. ఆ తర్వాత రైతులే చేశారంటూ వందలాది మంది రైతులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం వైఎస్సార్సీపీ బాపట్ల లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న నందిగం సురేష్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి భౌతికంగా, మానసికంగా హింసించారు. వైఎస్ జగన్ స్వయంగా తనతో చేయించినట్లు ఒప్పుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఇందుకు ఆయన, రైతులు ఒప్పుకోకపోవడంతో చేసేదేమీలేక గతేడాది అక్టోబర్‌లో కేసు మూసేశారు. అధికారులపై, రాజధాని రైతులపై నిత్యం దాడులు 2018 జనవరి 22న మందడం గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, జన్మభూమి కమిటీ సభ్యుడైన మాదాల శ్రీను అధికార మదంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి గద్దె రామ్ హనుమాన్‌పై దుర్భాషలకు దిగడంతో పాటు పంచాయతీ కార్యాలయంలోనే దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కార్యదర్శిని పంచాయతీ కార్యాలయంలోనే నిర్భందించి తాళాలు వేశాడు. అనంతరం జిల్లాకు చెందిన ఓ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే బెదిరింపులకు తోడు ప్రభుత్వ ఉద్యోగులు.. రాజీ పడాలని గద్దె రామ్ హనుమాన్‌పై తీవ్రంగా ఒత్తిడి చేయడంతో కేసు వెనక్కు తీసుకున్నాడు. 2018 ఫిబ్రవరి 25వ తేదీ అర్ధరాత్రి హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సాక్షాత్తూ సచివాలయం వెనుక రాజధానికి భూమి ఇవ్వని తన పొలంలో రహదారి నిర్మిస్తున్న అధికారులను రైతు గద్దె మీరాప్రసాద్ అడ్డుకున్నాడు. దీంతో రాజధాని పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు రైతును చొక్కా చింపి రోడ్డు మీదకు ఈడ్చేశారు. దీంతో రైతు స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు. 2018 జూన్ 28న మందడం గ్రామానికి చెందిన టీడీపీ నేత గుర్రం సాయికృష్ణ ఓ హోటల్ మేనేజర్‌పై పాత బకాయిలు చెల్లించాలని కోరితే.. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ నడిరోడ్డుపైనే గుండా మాదిరి దాడికి పాల్పడ్డాడు. నెక్కల్లులో టీడీపీ నేత ఆలూరి సుధాకర్‌బాబు మహిళను కారుతో తొక్కించేసిన దృశ్యం(ఫైల్) అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై బరితెగింపు రాజధాని ప్రాంతంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పడం, సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా చేయడం వంటి నీచ రాజకీయాలకు సైతం టీడీపీ నేతలు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం తుళ్లూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గద్దె రాకేష్‌ను రహదారిపై వెళుతున్న సమయంలో కవ్వించి టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో దాడికి పాల్పడ్డారు. తాజాగా, గురువారం టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు ఆలూరి బ్రహ్మయ్య, సుధాకర్‌బాబు తుళ్లూరు మండలం నెక్కలు గ్రామానికి చెందిన బీసీలను తమపై కేసు పెట్టడానికి వెళ్తారా అంటూ 8 మందిని రాక్షసత్వంగా కారుతో తొక్కించేశారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. సిట్టింగ్ ఎమ్మల్యే శ్రావణ్‌కుమార్ ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వ్యక్తులే ఇటువంటి దాడులకు పాల్పడుతుండడంతో రాజధాని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఎలా బతకాలో తెలియడం లేదని బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతగాక.. ప్రతిపక్షంపై నిందలు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు దిగజారి విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షం అధికారంలోకి వస్తే దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతాయని అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగినన్ని అక్రమాలు, హత్యలు ఎప్పుడూ జరగలేదు. ప్రశాంతంగా ఉండే రాజధాని ప్రాంతం టీడీపీ అధికారంలోకి వచ్చాక హింసాత్మకంగా మారింది. తమ అవినీతి, అక్రమాలకు అడ్డొస్తే సామాన్యులను సైతం హత్య చేసేందుకు వెనుకాడడం లేదు. నెక్కల్లులో జరిగిన దుర్ఘటనలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ప్రధాన అనుచరులే ఉన్నారు. ఇలాంటి వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. – ఉండవల్లి శ్రీదేవి, వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి -
రౌడీరాజ్యం!
వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి ఈ నెల ఏడో తేదీన రామగిరి మండలంలో పర్యటించారు. నసనకోట పంచాయతీకి చెందిన బోయ సూర్యనారాయణ అలియాస్ సూర్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రశేఖర్‌రెడ్డి వెంటే ఉన్నాడు. ఇది తెలుసుకున్న టీడీపీ వారు బోయ సూర్యనారాయణపై దాడి చేసి గాయపరిచారు. పైగా అతడిని స్టేషన్‌కు పిలుచుకెళ్లి తనపై వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డే దాడి చేయించినట్లు కేసు పెట్టించారు. తమ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటిస్తున్నారనే సమాచారంతో రామగిరి మండలం పేరూరుకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సుబ్బుకృష్ణ 2017 నవంబరు 12న గ్రామంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సుబ్బుకృష్ణపై దాడి చేసి తిరిగి అతనిపైనే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ఈ రెండు ఉదాహరణలు చాలు రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు ఎలా గాడితప్పాయనేందుకు. అనంతపురం: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమ భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ రాప్తాడు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, వారి బంధువులు చెప్పినట్లు వినాల్సిందే. మాట వినని వారిపై పోలీసులను ఉసిగొలుపుతున్నారు. ‘ఎద్దు ఈనిందంటే గాడికి కట్టేయ్’ అన్న చందంగా పోలీసుల తీరు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉంటూ తప్పొప్పులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేసులు నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చివరికి తెగబడి అధికారులపై కూడా దాడులు చేస్తుంటే చోద్యం చూడాల్సిన పరిస్థితి. కనగానపల్లి ఎంపీపీ భర్త ముకుందనాయుడు స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారు. రామగిరి ప్రవేశానికి ప్రత్యేక ఆంక్షలు రామగిరి మండలంలోకి విపక్ష నేతలు వెళ్లనీయకుండా ప్రత్యేక ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్న పోలీసులు.. విపక్షనేతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసుల ఏకపక్ష తీరుపై ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలను పరిరక్షించకపోతే అధికార పార్టీ నేతల ఆగడాలు మరింత ఎక్కువవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆగడాల్లో కొన్ని.. ► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులు అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించడానికి వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై కూడా దాడికి యత్నించారు. ► 2016 సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి రోజున కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ► 2016 నవంబరు 16న రాప్తాడు మండలం బండమీదపల్లిలో మంత్రి లోకేష్ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీలు చింపేశారనే సాకుతో యర్రగుంటలో ఓ మహిళపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ► గొందిరెడ్డిపల్లిలో 2017 నవంబరులో భూ సమస్య కారణంగా సర్పంచ్ కుమారుడు బాబయ్య, బంధువులపై టీడీపీ వారు దాడి చేశారు. ఓటమి భయంతోనే ఫ్యాక్షన్‌కు బీజం మంత్రి సునీతపై ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ధ్వజం ఆత్మకూరు: ఎన్నికలకు ముందే ఓటమి భయం వెంటాడటంతో మంత్రి పరిటాల సునీత ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ఆరోపించారు. ఫ్యాక్షన్ సంస్కృతిని ఆత్మకూరుకు తీసుకురావద్దంటూ ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్ మీనుగ నాగరాజుపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క హామీనీ పూర్తిగా నెరవేర్చకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. ఎలాగైనా గెలిచేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫ్యాక్షన్‌కు బీజం వేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే రామగిరి మండలంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటించకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారని విరుచుకుపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే మంత్రిని కూడా నియోజకవర్గంలో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి సోదరుడు బాలాజీ వైఎస్సార్సీపీ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, అమాయక ప్రజలను నేర వృత్తిలోకి బలవంతంగా దింపుతున్నారని అన్నారు. అనంతరం గూలి కేశవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉండగా ..వాటిని పూర్తిగా రద్దు పరిచి కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారన్నారు. ఆత్మకూరుకు లిఫ్ట్ ఇరిగేష్‌న్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలంటూ వినతిపత్రం అందచేశారు. -
టిడిపి రౌడీ రాజకీయాలు: మిత్రపక్ష నేత కావూరి
ఏలూరు: టిడిపి మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని బిజెపి నేత కావూరి సాంబశివరావు చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. 2019లో రాష్ట్రంలో టీడీపీ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కావూరి విమర్శించారు. -
తాడిపత్రిలో వైసీపీ నేతలకు బెదిరింపులు