రేపు కాకినాడలో ఆర్ఆర్బీ మోడల్ పరీక్ష
బాలాజీచెరువు(కాకినాడ) :
రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోకోపైలట్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కుసుమశాంతి ఆదివారం తెలిపారు. ప్రతిభ ఎడ్యుకేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ ఉత్తీర్ణులతో పాటు ఆ విభాగాల బీటెక్ అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల వారు సోమవారం సాయంత్రంలోగా రాజీవ్‌గాంధీ కళాశాలలో పేర్లు నమోదు చేయించుకోవాలని, ఇతర వివరాలకు 85229 86347లో సంప్రదించాలని సూచించారు.