ఎయిర్ పోర్ట్లో రూ. కోటి బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడు విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం దోహా నుంచి చెన్నై వచ్చిన సిరాజ్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు.
ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.