Rs 10 crore
-
లాకర్లలో అక్రమ కోట్లు వెలుగులోకి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమ సొమ్ము, లెక్కతేలని సొమ్ము బయటపడుతోంది. ఇప్పటి వరకు బడా బాబుల ఇళ్లల్లో ఈ నల్లడబ్బు బయటపడుతుండగా ఇప్పుడు ఏకంగా బ్యాంకుల్లో వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని ఓ బ్యాంకులో లెక్కతేలని కోట్లు బయటపడ్డాయి. అది కూడా ఓ బ్యాంకు లాకర్లో లభించడంతో అధికారులు ఖిన్నులయ్యారు. రాష్ట్రంలోని పుణెలోగల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పార్వతీ బ్రాంచ్‌లో బుధవారం ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు లాకర్లు తెరిచి చూడగా అందులో పది కోట్ల రూపాయలు లెక్కతేలనివి బయటపడ్డాయి. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఈ డబ్బును చూసి ఐటీ అధికారులు సైతం అవాక్కయ్యారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి బ్యాంకు అధికారులే ఈ పని చేసి నల్ల డబ్బుకు ఆశ్రయం ఇచ్చి ఉంటారా అనే దిశగా ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ లాకర్ల యజమానుల కోసం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ నగదునంతా తమ స్వాధీనం చేసుకొని మరిన్ని లాకర్లు తెరిచే పని చేస్తున్నారు. -
రూ.కోట్లు వస్తాయని నమ్మి మోసపోయా: లక్ష్మణ్ రావు
బంజారాహిల్స్: రైస్‌పుల్లింగ్ యంత్రంతో రూ.10 వేల కోట్లు వస్తాయని నమ్మి మోసపోయానని, ఈ క్రమంలో తాను ఆదాయ పన్ను శాఖను మోసం చేశానని బానాపురం లక్ష్మణ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన ఈ ఘటనపై ’సాక్షి’తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కర్నాటక బెల్గాంకు చెందిన షౌకత్‌అలీ అనే వ్యక్తి తన రియల్ ఎస్టేట్ భాగస్వాములు భాస్కర్‌రావు, రమేష్‌ల ద్వారా పరిచయం అయ్యాడని, తనకు తెలిసిన వ్యక్తి వద్ద రైస్‌పుల్లింగ్ కాయిన్ ఉందని, దాని వల్ల ధనలక్ష్మి తాండవిస్తుందని చెప్పడమే కాకుండా పలు పూజలు కూడా చేయించాడని వెల్లడించారు. ఆయనను నమ్మి తాను రూ.10 వేల కోట్ల వస్తాయని ఆశతో ఆదాయపు పన్ను శాఖాధికారులకు సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు వెల్లడించారు. తన వద్ద 10 వేల కోట్లు ఉన్నాయని ఐడీఎస్ కింద దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి విడత కట్టేం దుకు ప్రయత్నించగా చిల్లిగవ్వ కూడా దొరకలేదని ఈ లోపు న ఐటీ అధికారులు ఇంటిపై దాడి చేశారని, వారికి ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. తాను షౌకత్‌అలీని నమ్మి మోసపోరుున విషయాన్ని ఆధారాలతో సహా చూపి ంచానని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నుంచి షౌకత్‌అలీ రైస్‌పుల్లింగ్ యంత్రం తెస్తానంటూ రూ. 60 లక్షల వరకు వసూ లు చేశాడని, ఉన్నవన్నీ అమ్ముకొని అప్పు తెచ్చి ఈ మొత్తాన్ని ఇచ్చానని పేర్కొన్నాడు. షౌకత్‌అలీ తనను చీటింగ్ చేసిన విషయాన్ని ఐటీ అధికారులతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరారు. కట్టు కథేనా.? 10 వేల కోట్ల ఐడీఎస్ కింద ప్రకటించి ఐటీ అధికారులకు చుక్కలు చూపించిన ఫిలింనగర్ సైట్-2 నివాసి బానాపురం లక్ష్మణ్‌రావు చెప్పిందంతా కట్టు కథేనని పోలీసులు భావిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఉన్నది ఉన్నట్టు ఐటీ అధికారులకు చదివి వినిపించాడని అనుమానిస్తున్నారు. లక్ష్మణ్‌రావు వెనుకాల ఓ బడాబాబు ఉండి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపడితే అన్ని విషయాలు బయటలకు వస్తాయని భావిస్తున్నారు. -
పీసీ కోసం పేచీ
ప్రజల కోసం కోట్ల ఆస్తులను పణంగా పెట్టిన నాయకుల కాలం పోయి.. ప్రతి పనిలో పీసీల్ని (పర్సంటేజీలు) దండుకుని, కోట్లు కూడబెట్టుకునే నేతల కాలం వచ్చిపడింది. ప్రజా ప్రయోజనం నీట కలిసినా స్వార్థం కోసం ఒక ముఖ్యనేత రూ.10 కోట్ల పనికి ‘టెండర్’ పెట్టేందుకు వెనుకాడటం లేదు. సదరు నేత ఉప్పాడ-పిఠాపురం రోడ్డుకు అడ్డం పడుతున్న విషయం వెల్లడి కావడంతో జనం నిర్ఘాంతపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రస్తుతం ఉప్పాడ-పిఠాపురం రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు కొన్ని చోట్ల 3 మీటర్లు, మరికొన్ని చోట్ల ఐదు మీటర్లతో ఇరుకుగా ఉండి ప్రమాదాలకు నెలవుగా మారింది. సముద్రతీరంలో ఉన్న సుమారు 50 మత్స్యకార గ్రామాల ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలన్న సంకల్పంతో ఆ రోడ్డును ఏడున్నర మీటర్ల మేర విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. సుమారు రూ.10 కోట్ల కేంద్ర రోడ్ ఫండింగ్ (సీఆర్ఎఫ్) నిధులకు పరిపాలనా ఆమోదం లభించిం ది. అందుకు సంబంధించి ఇటీవల ఈ టెండర్లను రోడ్లు భవనాలశాఖ ఆహ్వానించింది. విషయం తెలుసుకున్న ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి అన్ని కోట్ల పనిని పర్సంటేజీలు లేకుండా ఎలా చేసుకుపోతారని, ముందుగా సంబంధితశాఖపై ఒత్తిడి తెచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. అలా లాభం లేదనుకుని ఆగమేఘాలపై తన అనుయాయులు ఇద్దరితో టెండర్లు వేయించారు. పిఠాపురం, రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన ఇద్దరితో 4.9 శాతం (ఈ పనులకు 5 శాతం ఎక్కువకు కోట్ చేయడానికి అనుమతిస్తారు) అధికంగా కోట్ చేశారని సమాచారం. జిల్లా నుంచి మరెవరినీ టెండర్లు వేయనివ్వలేదని సమాచారం. తన వారిద్దరు ఎంతకైతే కోట్ చేశారో ఆ మేరకు పీసీ (పర్సంటేజీ) అంటే (సుమారు రూ.50 లక్షలు) సదరు నేతకు ముట్టచెప్పాలనేది ఒప్పందం. అయితే అనుయాయులిద్దరు టెండర్లు హడావిడిగా దాఖలు చేయడంలో నిబంధనల ప్రకారం కొన్ని పత్రాలు జత చేయలేకపోయారని తెలిసింది. ఫలితంగా ఆ టెండర్లు అనర్హతకు గురయ్యే చిక్కు ఎదురైంది. టెండర్ల అనర్హతపై నివేదిక హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ స్థాయికి కూడా వెళ్లిందని విశ్వసనీయంగా తెలిసింది. విషయం తెలిసిన సదరు నేత ఆరునూరైనా ఆ టెండర్ అనుయాయులకే దక్కేలా ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు కాంట్రాక్టర్లు కూడా దాదాపు అదే రేటుతో టెండర్లు దాఖలు చేయడంతో ఆ నేత గొంతులోపచ్చి వెలక్కాయపడ్డట్టయింది. అయినా ఆ పని పర్సంటేజీలు లేకుండా ఎలా పూర్తి చేస్తారో చూస్తానంటూ అనుచరుల ద్వారా బయటకు సంకేతాలు పంపిస్తున్నారంటున్నారు. తమ వారి టెండర్ ఏదోరకంగా ఖాయం చేయించుకోవడం, అది వీలు కాకుంటే హైదరాబాద్ కాంట్రాక్టర్లనైనా దారిలోకి తెచ్చుకోవడం అనే వ్యూహంతో పావులు కదుపుతున్నారని సమాచారం. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలలా కాక సీఆర్ఎఫ్ చేపట్టే పనులు 80 శాతం మించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రం రోడ్ ఫండింగ్ పేరుతో విడుదల చేసే ఈ నిధులతో చేపట్టే పనులపై ప్రత్యేక బృందాలు విజిలెన్స్‌కు వస్తుంటాయి. ఈ కారణంగా సీఆర్ఎఫ్ పనులపై కాంట్రాక్టర్లు పెద్దగా లాభాలు ఆశించకుండా 80 శాతం నాణ్యతతో పనిచేస్తారంటున్నారు. అటువంటి పనులను మరింత పారదర్శకంగా దగ్గరుండి చేయించాల్సిన నేతలు అందుకు భిన్నంగా పర్సంటేజీల కోసం ఎగబడటం విమర్శలకు తావిస్తోంది. సదరు నేత తిమ్మినిబమ్మిని చేసైనా ఆ టెండర్‌ను తన వారి ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. అనర్హతపై ఉన్నతస్థాయిలోనే నిర్ణయం నిబంధనల ప్రకారం టెండర్లు ఆహ్వానించాం. వచ్చిన టెండర్లను పరిశీలన అనంతరం హైదరాబాద్‌కు నివేదించాం. గ్రూప్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు. టెండర్ల అనర్హతపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. - సీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ, ఆర్ అండ్ బి, కాకినాడ -
పందాలకు రూ.10 కోట్లు
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: సంక్రాంతి పండగ నేపథ్యంలో జిల్లాలో పందాలరాయుళ్ల హవా కొనసాగింది. పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కోడిపందాలను కొనసాగించారు. రెండు వారాలుగా పోలీసులు కోడిపందాలపై నిఘా వేసినా జోరుమాత్రం తగ్గలేదు. గత ఏడాది రూ.5 కోట్లవరకు బెట్టింగ్ జరగ్గా ఈ ఏడాది సుమారు రూ.10 కోట్లకు పైగా పందాలు సాగాయని పందాలరాయుళ్లు చెబుతున్నారు. కురుపాం, ఎస్.కోట, నెల్లిమర్ల, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో కోడిపందాలు ఎక్కువగా జరిగాయి. ఎన్నడూ లేని విధంగా కోడిపందాల బెట్టింగ్‌లకు ఇతర జిల్లాల నుంచి వచ్చారు. దీంతో బెట్టింగ్‌లు రెండింతలు పెరిగాయి. కోడిపందాల బెట్టింగ్‌లో ఒకటికి... రెండు, రెండుకు... మూడు, మూడుకు నాలుగు ఇలా బెట్టింగ్‌లు కాశారు. మరో పక్క మరీ ఉత్సాహం ఎక్కువైన వారు రూ.లక్షకు రూ.50,000, లక్షకు రూ.75,000, లక్షకు, లక్ష కాసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగలో ప్రతి మండలంలోని ఏడు ఎనిమిది వరకు తీర్థాలు జరిగాయి. ప్రతి తీర్థంలో కూడా కోడిపందాలు బెట్టింగ్‌లు కొనసాగాయి. ప్రతి సంక్రాంతికి కొన్ని ప్రత్యేక గ్రామాల్లో కేవలం కోడిపందాలు బెట్టింగ్‌లు నిర్వహిస్తారు. తగ్గిన పొట్టేళ్ల పందాలు.. అయితే పొట్టేళ్ల పందెలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. పొట్టేళ్ల పందాలు చూసేందుకు ఎక్కువగా మంది జనాభా రావడం.. పోలీసులకు వెంటనే సమాచారం వెళ్తుండడంతో నిర్వాహకులు భయపడ్డారు. దీంతో పందేలు కొంత తగ్గుముఖం పట్టాయి. కొనసాగిన పేకాట జిల్లా వ్యాప్తంగా పేకాట కూడా భారీ స్థాయిలో కొనసాగింది. పోలీసులు బహిరంగంగా ఆడుతున్న కొంతమందిని పట్టుకుని తర్వాత వదిలేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న రెండు క్లబ్‌లకు పోలీసులు లెసైన్సు ఇవ్వడంపై పలువురు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక స్థలాల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసుకుని లక్షల్లో బెట్టింగ్‌లు కాసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో పేకాట జోరుగా సాగింది.