ఢిల్లీలో రూ. వంద కోట్ల హెరాయిన్ పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వంద కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ 47 కిలోలు, కొకైన్ 2 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ 100 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి.
పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబుల్ నుంచి డ్రగ్స్ ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు బటాలా జిల్లా నుంచి వీటిని అక్రమ రవాణా చేసుకున్నట్టు భావిస్తున్నారు. శ్రీలంకతో పాటు ఇతర ఆగ్నేయాసియా దేశాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.