Rs 204 crore
-
విజయాబ్యాంకు లాభం 3 రెట్లు
విజయ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మూడు రెట్లదాకా పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.71 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.204 కోట్లకు పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.3,228 కోట్ల నుంచి రూ.3,505 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.8,305 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 23 శాతం తగ్గి రూ.6,382 కోట్లకు చేరాయి. కేటాయింపులు 34 శాతం క్షీణించి రూ.553 కోట్లకు తగ్గాయి. ఒక్కో షేర్‌కు రూ.1.50(15 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. మెరుగుపడిన రుణ నాణ్యత..: ఇక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.382 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపై రూ.750 కోట్లకు పెరిగింది. కేటాయింపులు తక్కువగా ఉండడం, ఇతర ఆదాయం అధికంగా రావడం వంటి కారణాల వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. -
ఫలితాల్లో అదరగొట్టిన ఎంఫసిస్
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఎంఫసిస్కు 2016-17 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక ఫలితాల బోణి అదిరింది. తొలి త్రైమాసికంలో కన్సాలిడేటడ్ నికర లాభాలు 38శాతం దూసుకెళ్లి, రూ.204.3 కోట్లగా నమోదయ్యాయి. 2016 జూన్ క్వార్టర్ ఫలితాలను కంపెనీ శనివారం ప్రకటించింది. వరుసగా ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ దిగ్గజాలు ఫలితాల్లో నిరాశపరిచినా.. ఎంఫసిస్ మాత్రం లాభాల్లో దూసుకెళ్లింది. నిర్వహణ ఆదాయం యేటికేటికి 1.5 శాతం ఎగబాకి, రూ.1,516.6 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. తొలి త్రైమాసిక ప్రారంభం బాగుందని.. కొత్త తర సర్వీసులపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేయడంతో, స్ట్రాంగ్ రిజల్ట్స్ ను నమోదుచేసినట్టు ఎంఫసిస్ సీఈవో గణేష్ అయ్యర్ పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరం ఎంఫసిస్కు బ్యానర్ ఏడాదని, వృద్ధిని, లాభాలను ఆర్జించడానికి ఈ ఏడాది తాము వ్యూహాత్మక రోడ్ మ్యాప్‌ను రూపొందించుకున్నామని అయ్యర్ వెల్లడించారు.ఇంటర్నేషనల్ రెవెన్యూ ఏడాదికి ఏడాది 14.7 శాతం పెరిగినట్టు కంపెనీ పేర్కొంది.