Rs 25 crore
-
ఒక్క మంత్రి కోసం 25 కోట్ల మినహాయింపా?
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క వ్యక్తి ఆస్తికి పన్నును మినహాయించడం కోసం ఏకంగా 750 ఇళ్లపై ఆస్తి పన్నును రద్దు చేసిందని, ఫలితంగా ఇప్పటికే ఈ ఏడాది 2,700 కోట్ల రూపాయల లోటుతో నడుస్తున్న మున్సిపల్ కార్పొరేషన్‌పై మరో 25 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ గోయెల్ కుటుంబానికి ధర్మపురలో ఓ చారిత్రక హవేలి ఉంది. నాలుగంతస్తులుగల ఆ భవంతిలో 13 గదులు ఉన్నాయి. వాటిలో రెస్టారెంట్, స్పా, ఆర్ట్ గ్యాలరీలు కమర్షియల్‌గా నడుస్తున్నాయి. కమర్షియల్ కార్యకలాపాలకుగాను ఇంటిపన్నును, కార్ పార్కింగ్ చార్జీలను ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేస్తూ వస్తోంది. ఈ పన్ను నుంచి మినహాయింపు కావాలని కోరుతూ గోయెల్ కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఒక్క దరఖాస్తుపైన మాత్రమే స్పందిస్తే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించిన కార్పొరేషన్ స్థాయీ సంఘం మొత్తం కార్పొరేషన్ పరిధిలోని 750 చారిత్రక భవనాలను పన్ను పరిధి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 750 భవనాల్లో ఖరీదైన రెస్టారెంట్లు, అతిథి గృహాలు, చేతికళలు, నగల దుకాణాలు నడుస్తున్నాయని, వాటిపై కోట్లలో అద్దె వస్తుండగా, పన్ను మినహాయింపు కల్పించడం అర్థరహితమని ఢిల్లీ ఆప్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కార్పొరేషన్ చర్యపై విరుచుకు పడుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తున్న విషయం తెల్సిందే. -
అఖిలేశ్ యాదవ్‌కు జయలలిత కృతజ్ఞతలు
చెన్నై: ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఉదారతకు తమిళనాడు సీఎం జయలలిత శనివారం కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు అఖిలేశ్ యాదవ్ రూ. 25 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళనాడు సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. 'వరదల్లో చిక్కుకున్నప్రాంతాలను తిరిగి మామూలు స్థితికి తిరిగి తేవడానికి తమ ప్రభుత్వం అవిశ్రామంగా కృషి చేస్తోంది. వరదబాధితులను ఆదుకోవడానికి మీరు చూపించిన ఉదారతకు హృదయపూర్వకు ధన్యవాదలు' అంటూ అఖిలేశ్ చేసిన సాయానికి జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. -
జోడేఘాట్‌లో ప్రపంచస్థాయి మ్యూజియం
-
ఎంపీకి బ్లాక్ మెయిల్: రూ.25 కోట్లు డిమాండ్
హైదరాబాద్ : ‘నామినేషన్లో ఎలక్షన్ కమిషన్‌కు మీరు తప్పుడు ఆస్తులు చూపించారు. మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.25 కోట్లు ఇవ్వండి’ అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొద్ది రోజుల క్రితం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని రిమాండ్ చేశారు. నిందితుల్లో ఓ మాజీ ఎంపీ బంధువు ఉండడం గమనార్హం. సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం..జూబ్లీహిల్స్‌కు చెందిన వెకంటరమణారెడ్డి, బెంగుళూరుకు చెందిన రాజేష్, కుమార్ కలిసి ఎంపీ కుమారుడు కొండా అనిధిత్‌రెడ్డికి డిసెంబర్ 8వ తేదీన మెయిల్ చేశారు. మీ ఆస్తుల వివరాలపై ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ మెయిల్‌ను అతడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి చూపించాడు. రెండు రోజులకు మరో మెయిల్ పెట్టారు. వరుసగా సెల్ఫోన్లో కూడా వేధించడం ప్రారంభించారు. దీంతో ఎంపీ జనవరి 8వ తేదీన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ కేసు నమోదు చేసుకుని ఎస్ఐలు కె.శ్రీనివాస్, కె.విజయవర్ధన్‌లతో కలిసి నిందితులతో డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. రూ.25 కోట్లు ఇస్తామని ముగ్గురు నిందితులను గచ్చిబౌలికి పిలిపించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
25 కిలోల హెరాయిన్ స్వాధీనం
అమృత్సర్: పంజాబ్‌లో పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పంజాబ్ స్పెషల్ నార్కోటిక్ సెల్ పోలీసులు అమృత్సర్ సమీపంలో ని కొహాలీ గ్రామంలో డ్రగ్స్ ముఠా స్థావరంపై దాడి చేశారు. 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా అతని సహాయకుడు పోలీసుల నుంచి తప్పించుకుని బైక్‌పై పారిపోయాడు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ 25 కోట్ల రూపాయిలు ఉంటుందని పోలీసులు చెప్పారు. దీన్ని పాకిస్థాన్ నుంచి అక్రమంగా రవాణా చేసినట్టు తెలిపారు. నిందితులకు పాకిస్థాన్ స్మగ్లర్లతో సంబంధాలున్నాయని చెప్పారు.