ఉత్తర్ ప్రేదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఉదారతకు తమిళనాడు సీఎం జయలలిత శనివారం కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నై: ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఉదారతకు తమిళనాడు సీఎం జయలలిత శనివారం కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు అఖిలేశ్ యాదవ్ రూ. 25 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళనాడు సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు.
'వరదల్లో చిక్కుకున్నప్రాంతాలను తిరిగి మామూలు స్థితికి తిరిగి తేవడానికి తమ ప్రభుత్వం అవిశ్రామంగా కృషి చేస్తోంది. వరదబాధితులను ఆదుకోవడానికి మీరు చూపించిన ఉదారతకు హృదయపూర్వకు ధన్యవాదలు' అంటూ అఖిలేశ్ చేసిన సాయానికి జయలలిత కృతజ్ఞతలు తెలిపారు.