rs. 60 lakh
-
రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
-
రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి జూపార్క్ సమీపంలోని ఎమ్ ఆర్ పల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఎర్రచందనం కూలీలు పోలీసులకు తారసపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యే లోపల కూలీలు పరారయ్యారు. ఈ తనిఖీల్లో రూ. 60 లక్షల విలువ చేసే 35 ఎర్రచందనం దుంగలను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది.