అన్నదాన పథకానికి రూ.10లక్షలు
శ్రీశైలం (కర్నూలు జిల్లా) : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి తిరుపతికి చెందిన ఎం.దిలీప్ అనే వ్యక్తి గురువారం రూ.10,00,348లను విరాళంగా అందజేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర విశేషపూజలను నిర్వహించుకున్న అనంతరం విరాళాల కేంద్రంలోని పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డికి నగదు మొత్తానికి సంబంధించిన డీడీని అందజేశారు. అన్నదానాన్ని కీ.శే హరిప్రసన్న పేరు మీదుగా జరిపించాలని వారు కోరారని తెలిపారు. అనంతరం వారికి స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు,లడ్డూప్రసాదాలను అందజేశారు.