Rs.2
-
వామ్మో... అంత కరెంట్ బిల్లా?
మొరదాబాద్: పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అంటే ఇదేనేమో. జాతీయ వినియోగదారుల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యంతో ఓ వినియోగదారుడికి పెద్ద షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీల్) అధికారులు పంపిన కరెంట్ బిల్లు చూసి సదరు వినియోగదారుడికి గుండె ఆగినంతపనైంది. రూ.232 కోట్లు కట్టాలని బిల్లు ఇవ్వడంతో అతడు అవాక్కయ్యాడు. మొరదాబాద్ లో ఓ చిన్న పరిశ్రమ నడుపుతున్న పరాగ్ మిత్తల్ అనే వ్యక్తి ఈ భారీ బిల్లు వచ్చింది. 300,00,92,466 యూనిట్లు వాడినందుకు రూ. 232,07,08,464 కట్టాలని బిల్లులో చూపించారు. పాషిమంచల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఈ బిల్లు వచ్చింది. అయితే మిత్తల్ కంపెనీకి 49 కిలోవాట్ల వరకు మాత్రమే విద్యుత్ వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే రూ.232 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందని పీవీవీఎన్ లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఒకరు తెలిపారు. -
మూడురోజుల్లో ఫోన్ బిల్లు..జస్ట్ రూ.2లక్షలు
హైదరాబాద్ : ఫోన్ బిల్లు వేయి రూపాయలు వచ్చిందంటేనే బెంబేలు పడతాం.అలాంటిది ఏకంగా రెండు లక్షల బిల్లు వస్తే.....? కట్టేది మనం కాకపోతే ఎంత బిల్లు వస్తే ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ ఠక్కర్ ఫోన్ బిల్లు లక్షల్లో వచ్చింది. అది కూడా నెల రోజుల బిల్లు కాదు... జస్ట్ మూడు రోజుల బిల్లే....ఏంటీ అంతా బిల్లంటారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గత నెలలో సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆయన ...అక్కడ తన మొబైల్కు చిన్న సాంకేతిక సమస్య రావటంతో వై-ఫైని కాకుండా మొబైల్ డేటాను ఉపయోగించారు. గత నెల 12,13, 14 తేదీల్లో ఠక్కర్ ...మొబైల్ డేటాను భారీగా వాడుకున్నారు. పర్యటన అనంతరం వచ్చిన ఆయన ఫోన్ బిల్లు రూ.2,15,000 రావటం చూసి అవాక్కవటం ప్లానింగ్ విభాగం అధికారుల వంతైంది. ఫోన్ బిల్లును ఠక్కర్ సిబ్బంది.. విడతలు విడతలుగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జపాన్ పర్యటనకు వెళ్లిన అధికారులు అప్రమత్తమై మొబైల్ డేటా జోలికి పోలేదట.