హైదరాబాద్ : ఫోన్ బిల్లు వేయి రూపాయలు వచ్చిందంటేనే బెంబేలు పడతాం.అలాంటిది ఏకంగా రెండు లక్షల బిల్లు వస్తే.....? కట్టేది మనం కాకపోతే ఎంత బిల్లు వస్తే ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ ఠక్కర్ ఫోన్ బిల్లు లక్షల్లో వచ్చింది. అది కూడా నెల రోజుల బిల్లు కాదు... జస్ట్ మూడు రోజుల బిల్లే....ఏంటీ అంతా బిల్లంటారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గత నెలలో సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆయన ...అక్కడ తన మొబైల్కు చిన్న సాంకేతిక సమస్య రావటంతో వై-ఫైని కాకుండా మొబైల్ డేటాను ఉపయోగించారు.
గత నెల 12,13, 14 తేదీల్లో ఠక్కర్ ...మొబైల్ డేటాను భారీగా వాడుకున్నారు. పర్యటన అనంతరం వచ్చిన ఆయన ఫోన్ బిల్లు రూ.2,15,000 రావటం చూసి అవాక్కవటం ప్లానింగ్ విభాగం అధికారుల వంతైంది. ఫోన్ బిల్లును ఠక్కర్ సిబ్బంది.. విడతలు విడతలుగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జపాన్ పర్యటనకు వెళ్లిన అధికారులు అప్రమత్తమై మొబైల్ డేటా జోలికి పోలేదట.
మూడురోజుల్లో ఫోన్ బిల్లు..జస్ట్ రూ.2లక్షలు
Published Wed, Dec 3 2014 11:23 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM
Advertisement
Advertisement