RTA officials Corruption
-
రేణిగుంట ఎంవీఐపై ఏసీబీ సోదాలు
-
ఆయన చెప్పిందే వేదం...
రేణిగుంట: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్... రేణిగుంట చెక్‌పోస్ట్ మార్గంలో వెళ్లే ప్రతి లారీ డ్రైవర్‌కు ఈ పేరు సుపరిచితమే... చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడు ముడుపులు సమర్పించుకోవాల్సిందే... దారి మళ్లించి వెళ్లిన వాహనాలను వెంబడించి మరీ అక్రమ వసూళ్లు చేపట్టే ఘనుడు ఈయన... రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో ఆయన చెప్పిందే వేదం... ఆయన మాటకు ఎదురుచెప్పిన తోటి సిబ్బందినే ఇబ్బందులకు గురిచేసిన నైజం ఆయన సొంతం. గత నాలుగేళ్లుగా ఆయన రేణిగుంట చెక్‌పోస్ట్‌లో చేపట్టిన అక్రమ వసూళ్లు అక్షరాలా రూ.100 కోట్లంటే సగటు ప్రభుత్వ ఉద్యోగి కళ్లు తేలెయ్యాల్సిందే.. అన్నీ రోజులు ఒకలా ఉండవన్న సత్యం ఆయనను పలకరించింది. శనివారం ఏకకాలంలో ఆయన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.100కోట్లు ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఫలితంగా ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బంది వెన్నులోనూ వణుకు మొదలైంది. రోజుకు అక్రమ వసూళ్లు రూ.3లక్షలు పైమాటే రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్ మీదుగా ప్రతి నిత్యం వేలాది వాహనాలు కడప, చెన్నై, నెల్లూరు,చిత్తూరు మార్గల నుంచి రాకపోకలు సాగిస్తుంటా యి. ప్రధానంగా వివిధ లోడ్లతో వెళ్లే లారీలే ఇక్కడ పనిచేసే వారి అక్రమార్జనకు ప్రధాన వనరు. సీటులో ఏ అధికారి ఉన్నా లారీ డ్రైవర్లు వాహనాలను ఆపి బిల్లుల మాటున ముడుపులు సమర్పించి వెళ్లాల్సిందే. ప్రతి వాహనదారుడు రూ.500 నుంచి రూ.10వేల వరకు సమర్పించి వెళుతుంటారు. ఇక్కడ జరిపే అక్రమ వసూళ్లు రోజుకు రూ.3లక్షలు పైనే ఉంటుందని తెలుస్తోంది. కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే రూ.14,950 లెక్కలో లేని నగదును గుర్తించిన ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు. రోజువారీ వసూళ్లు కాకుండా గూడూరు నుంచి బెంగుళూరుకు నిత్యం వందలాది లారీలలో వెళ్లే సిలికా ఇసుక వ్యాపారుల నుంచి నెలసరి మామూళ్లు రూ.లక్షల్లో వసూలు చేస్తారు. అలాగే ఈ మార్గం గుండా కబేళాలకు తరలించే మూగజీవాల అక్రమ తరలింపుదారుల నుంచి భారీస్థాయి మామూళ్లు వసూలవుతున్నాయి. ఇదంతా రేణిగుంట చెక్‌పోస్ట్ కేంద్రంగా బహిరంగంగానే ప్రతినిత్యం జరిగే తంతు. అక్రమ వసూళ్ల కోసం ఇక్కడి అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టకుని వారికి రోజుకు రూ.2వేలు ఇస్తుండటం బహిరంగ రహస్యమే. ఆయనంటే హడల్ ఎంవీఐ విజయభాస్కర్ అంటే వాహనదా రులే కాదు... తోటి సిబ్బందే హడలిపోవాల్సిందే. ఆయన గతంలో కడపలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన 2014 జూన్‌లో ఎంవీఐగా ఉద్యోగోన్నతిపై రేణిగుంట చెక్‌పోస్ట్‌కు వచ్చారు. ఆర్టీఏ ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలకు తోడు రాజకీ య అండదండలు ఆయనకు బలంగా ఉన్నట్లు తోటి సిబ్బంది వద్ద తొలినాళ్లలో హంగామా సృష్టించి తన మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఎవరు అడ్డు చెప్పినా ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురిచేస్తాడు. కార్యాలయ సీనియర్ ఎంవీఐ మరొకరు ఉన్నా తా నే ఇన్చార్జి అని చెప్పుకుంటూ అన్ని వసూళ్లు ఆ యన కన్నుసన్నల్లోనే జరిగేలా చూసుకున్నాడు. వ్యవహార శైలి, అక్రమార్జనపై గతంలో అనేకమా ర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు రేణిగుంట చెక్‌పోస్ట్‌పై గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు జరిగాయి. గతంలో ఓసారి ఏసీబీ దాడులు చేసి అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా గుండెపోటు సాకు చూపి తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా అప్పట్లో ఓ కిందిస్థాయి ఉద్యోగి బలైనట్లు సమాచారం. ఇక్కడ దాడులు చేసిన ప్రతిసారి పెద్దమొత్తంలో నగదును స్వాదీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పరంపర మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యం లో ఆయన లెక్కకు మించి అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు స్పష్టం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల చిట్టాను బహిర్గతం చేశారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బందిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి. -
ఆర్టీఏ కార్యాలయం అవినీతిమయం
తాండూరు : తాండూరులో నిబంధనలకు విరుద్ధంగా లారీల ద్వారా ఓవర్ లోడ్ రవాణా సాగిస్తున్నారు. తాండూరు ప్రాంతం నుంచి నిత్యం 2వేలకు పైగా లారీలు నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాయి. ఇందుకోసం రాయల్టీ ఫీజు కింద ఒక్కో వాహనానికి రూ.2 వేలు చెల్లించాలి. కానీ అధికారుల నిఘా లేక పోవడంతో రాయల్టీ చెల్లించకుండా పెద్దసంఖ్యలో లారీలు సరిహద్దులు దాటివెళ్తున్నాయి. ఓవర్ లోడ్‌తో సాగుతున్న ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుల వద్ద పర్సెంటీలు తీసుకుంటున్న రవాణా శాఖ అధికారులు.. అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇందుకు కృతజ్ఞతగా ప్రతినెలా రూ.లక్షల్లో ముడుపులు అందుకుంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నియోజకవర్గంలోనే సాగుతున్న వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. తాండూరు పట్టణం జిల్లాలోనే ప్రధాన వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. స్థానికంగా నాపరాయి, సుద్ద, ఎర్రమట్టి భూగర్భ నిక్షేపాలున్నాయి. తాండూరులో సిమెంట్ కర్మాగారాలు, నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉండటంతో నిత్యం రూ.కోట్లలో వ్యాపారం, లావాదేవీలు జరుగుతాయి. తాండూరు నుంచి నిత్యం సిమెంట్, సుద్ద, నాపరాతి, నిత్యావసర సరుకుల రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. 2 వేల వరకు లారీలు ప్రతిరోజూ ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. ఇందుకోసం ప్రతినెలా రవాణా శాఖ నేషనల్ పర్మిట్ వాహనాలకు రూ.3,500, లోకల్ లారీలకు రూ.2,500 వసూలు చేస్తున్నారు. ఆర్టీఏ శాఖ అధికారులు మధ్యవర్తులతో కలిసి ఈ తంతంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాండూరులోని లారీ పార్కింగ్ ఏరియాలో ప్రత్యేక ట్రాన్స్‌పోర్టులు వెలిశాయి. వీటి ద్వారా నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ల నిర్వాహకుల నుంచి క్రమం తప్పకుండా మామూళ్లు తీసుకుంటున్న కారణంగా రవాణాశాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది. బ్రోకర్లదే హవా.. తాండూరులోని రవాణా శాఖ కార్యాలయం వారానికి రెండు రోజులు మాత్రమే సేవలు అందుతాయి. దీంతో ఈ రెండు రోజులు ఆఫీసు సందడిగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే ఆర్టీఏ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఆన్లైన్లో లైసెన్స్ పొందాలనుకునే వారికి ఆరు నెలల పాటు తిరిగినా కూడా పని పూర్తి కాదు. ఈ తలనొప్పి ఎందుకని భావిస్తున్న జనాలు రూ.వెయ్యి అదనంగా పెట్టి పని పూర్తి చేసుకుంటున్నారు. కార్యాలయం ఎదుట మధ్యవర్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఆర్టీఏ ద్వారా లభ్యమయ్యే ధ్రువీకరణ పత్రాలకు ఒక్కోదానికి ఒక్కొ రేటు నిర్ణయించి.. వసూలు చేసి పంచుతున్నారు. దీనిపై అడిగేం దుకు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆపీసర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. డబ్బులిస్తేనే పని తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్ పొం దాలన్నా, కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ప్రభుత్వ ఫీజుతో పాటు అ దనంగా చెల్లించాల్సిందే. లేదంటే ఒకటికి ప దిసార్లు తిరిగినా పనికాదు. మధ్యవర్తులను ఆశ్రయిస్తే చటుక్కున పని అయిపోతుంది. నేరుగా వెళ్లి రూల్స్ మాట్లాడితే.. అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. – బాబు వారణాసి,తాండూరు -
నిప్పులుగక్కిన నిర్లక్ష్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆర్టీఏ అధికారుల అవినీతి, బస్సు ఓనర్ అత్యాశ, డ్రైవర్ నిర్లక్ష్యమే బీజీఆర్ ఓల్వో బస్సును కాల్చివేశాయి. ఎలాంటి పర్మిషన్లు లేకుండా 4 నెలలుగా అక్రమంగా ముంబై నుంచి హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్న ఈ ఏసీ బస్సు ప్రమాదకర స్థితిలోనే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. జహీరాబాద్ వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న శ్రీనివాస్ ప్రమాదాన్ని పసిగట్టి ఉండకపోతే మరో పాలెం సంఘటన పునరావృతం అయ్యేది. బ్యాటరీ నుంచి యాసిడ్ లీకు... బస్సు బ్యాటరీ నుంచి యాసిడ్ లీక్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. యాసిడ్ కారుతున్న విషయాన్ని పూణేలోనే గమనించిన బస్సు డ్రైవర్ జావీద్ విషయాన్ని ఓవర్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు ప్రయాణికులు తెలిపా రు. అయితే బ్యాటరీని ఎలాగోలా రిపేర్ చేయించి బస్సును హైదరాబాద్ వరకు తీసుకురావాలని చెప్పినట్టు తెలిసింది.బ్యాటరీలో వాడే యాసిడ్ కొద్దికొద్దిగా కారుతూ పక్కనే ఉన్న రబ్బర్ మ్యాట్ మీద పడటంతో పడటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ లేకున్నా... చిరాగ్పల్లివద్ద ప్రమాదానికి గురైన సహారా ట్రావెల్స్ ఓల్వో వాహనం (ఏపీ 13వై-0952) ఫిట్నెస్ గడువు సెప్టెంబర్ 30, 2014తోనే ముగిసింది. ఇక తరువాత బస్సుకు ఎలాంటి ఫిట్నెస్ గుర్తింపు పత్రాలు లేకుండానే నడుస్తోంది. రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్ను గడువు కూడా జూన్ 20, 2014తో ముగిసింది. ముఖ్యంగా వోల్వో వాహన బీమా గడువు సెప్టెంబర్ 25, 2013 ముగిసింది. ఏపీ 13వై-0952 వోల్వో బస్సుపై ట్రావెల్స్ టూరిజం శాఖ నుంచి తీసుకున్న అనుమతి సెప్టెంబర్ 25, 2013 ముగియడం గమనార్హం. ఫిట్నెస్, బీమా, పన్ను చెల్లింపుల్లో ఒక్కటీ రెన్యూవల్ చేయించుకోకున్నా బస్సును రహదారులపై ప్రయాణించేందుకు అనుమతించడం రవాణాశాఖ అధికారులపై వచ్చే ఆరోపణలకు మరిం త బలం చేకూరుస్తోంది. ఫిట్నెస్ ముగిసిన విషయాన్ని గుర్తించి తనిఖీ చేయాల్సిన అధికారులు పట్టనట్టుగా ఉండిపోయారు.