డీఎస్పీ, సీఐలకు నోటీసులు
హిందూపురం అర్బన్ : హిందూపురం ముక్కిడిపేట అలీస్ట్రీట్లో నివాసముంటున్న షబానాబేగం అనే మహిళ వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్లో సమాచారం కోరింది. అయితే వారు ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌కు ఆమె అప్పీల్ చేసుకుంది. ఈ క్రమంలో డీఎస్పీ, సీఐలను వివరణ కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం హాజరు కావాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. వివరాలు.. 2014లో షబానాబేగంపై ఆమె భర్త షకీబ్ అహమ్మద్ దాడి చేసి అప్పటి మూడేళ్ల కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లారని వన్‌టౌన్ పోలీసులకు రిజిస్ట్రర్ పోస్టు ద్వారా ఆమె ఫిర్యాదు చేసింది.
దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరుతూ 2016 మే 9న వన్‌టౌన్ సీఐ పేరిట సమాచారం హక్కు చట్టం ద్వారా కోరింది. అయితే వారు సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆమె తిరిగి రెండో అప్పీల్æకింద డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆ అప్పీల్‌ను డీఎస్పీ తోసిపుచ్చడంతో తాను రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పింది. ఈ మేరకు కమిషనర్ కేసును పరిశీలించి తనతో పాటు డీఎస్పీ, సీఐలకు వివరణ కోరుతూ సోమవారం (26వ తేదీ) గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.