Rubella
-
ఐఐఎల్ మీజిల్స్–రూబెలా టీకాకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీజిల్స్–రూబెలా టీకా తయారీకి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ల నుంచి అనుమతులు లభించినట్లు ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ (ఐఐఎల్) తెలిపింది. ఇండో–వియత్నాం భాగస్వామ్యంతో దీని తయారీ, మార్కెటింగ్ హక్కులను దక్కించుకోవడం సాధ్యపడినట్లు వివరించింది. ఇందుకోసం వియత్నాంకు చెందిన పాలీవాక్ సంస్థతో జట్టు కట్టినట్లు ఐఐఎల్ ఎండీ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం మీజిల్స్ టీకాకు సంబంధించిన భాగాన్ని పాలీవాక్ అందించనుండగా, రూబెల్లా టీకా భాగాన్ని ఐఐఎల్ స్వంతంగా తయారు చేసి సంయుక్తంగా ఎంఆర్ వేక్సిన్‌ను రూపొందిస్తుంది. -
పుణెలో రుబెల్లా వ్యాధి కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్..
ముంబై: మహారాష్టత్ర పుణెలో మంగళవారం రెండు రుబెల్లా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చిన్నారులకు పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ఇవే తొలి కేసులు కావడం గమనార్హం. ఇద్దరు చిన్నారుల్లో ఒక్కరు కోత్రుడ్, మరొకరు ఖరాడి ప్రాంతానికి చెందిన వారని పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరిలో ఖరాడీకి చెందిన 11 ఏళ్ల బాలుడు మీజిల్స్-రుబెల్లా టీకా తీసుకున్నాడని, అయినా వ్యాధి బారినపడ్డాడని అధికారులు పేర్కొన్నారు. మరో 12 ఏళ్ల బాలుడు వ్యాక్సిన్ తీసుకున్నాడో లేదో సమాచారం లేదని చెప్పారు. ఈ రెండు రుబెల్లా కేసులతో పాటు నగరంలో మంగళవారం కొత్తగా 15 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది నమోదైన మీజిల్స్ కేసుల సంఖ్య 26కు పెరిగింది. కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. మీజిల్స్, రుబెల్లా వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని రాష్ట్ర పర్యవేక్షణ అధికారి డా.ప్రదీప్ అవాతే తెలిపారు. వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, దద్దుర్లు వస్తాయన్నారు. రుబెల్లా సోకిన వారికి మాత్రం దాదాపు లక్షణాలు కన్పించవని, స్వల్పంగా ఉంటాయని పేర్కొన్నారు. టీకాలు తీసుకున్న వారికి కూడా ఈ వ్యాధులు వస్తాయని స్పష్టం చేశారు. వాక్సిన్లు 90 శాతం ప్రభావం చూపుతున్నాయన్నారు. చదవండి: రూ.500కే వంటగ్యాస్.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు.. -
తెలంగాణకు వైరస్ టెన్షన్.. వణికిస్తున్న మీజిల్స్, రూబెల్లా కేసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూబెల్లా, మీజిల్స్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సమయంలో సంబంధిత వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో వేయకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి చోటు చేసుకుందని, పిల్లలతో పాటు పెద్దల్లోనూ కేసులు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 2021లో ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ వేసుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో మరణాలు కూడా సంభవించాయి. ఆ సంవత్సరం ప్రపంచంలో 90 లక్షల కేసులు నమోదు కాగా, ఏకంగా 1.28 లక్షల మంది చనిపోయారు. అలాగే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 13 మంది పిల్లలు మీజిల్స్ వ్యాధితో మరణించారు. గుజరాత్లో 9, జార్ఖండ్‌లో 8, బిహార్‌లో 7, హరియాణాలో ముగ్గురు చనిపోయారు. 2021లో ప్రపంచంలో 81 శాతం మంది పిల్లలు మొదటి డోసు వేసుకోగా, 71 శాతం పిల్లలు మాత్రమే రెండో డోసు మీజిల్స్, మంప్స్, రూబెల్లా (ఎంఎంఆర్) వ్యాక్సిన్ వేసుకున్నారు. 2008 తర్వాత ఇంత తక్కువగా వ్యాక్సిన్ తీసుకోవడం ఇదే మొదటిసారి. 2021లో ఈ విధంగా పూర్తిస్థాయిలో డోసులు తీసుకోకపోవడం వల్ల 2022లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ మీజిల్స్, రూబెల్లా కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వైలెన్స్ ఇండికేటర్స్–2022లో కేసులను అంచనా వేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు వేసిన అంచనా ప్రకారం తెలంగాణలో 1,452 కేసులు నమోదయ్యాయి. అందులో లేబరేటరీలో నిర్ధారించిన మీజిల్స్ కేసులు 70 కాగా, రూబెల్లా కేసులు 36 ఉన్నాయి. అంచనా వేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 208 మీజిల్స్, రూబెల్లా కేసులు రికార్డు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 144, రంగారెడ్డి 92, సంగారెడ్డి 89, వనపర్తి 69, నిజామాబాద్‌లో 67, వికారాబాద్ 66, నాగర్‌కర్నూలు 49, యాదాద్రి భువనగిరి 55, కరీంనగర్లో 40, హనుమకొండ 39, నల్లగొండ 38, మెదక్ 35, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 34 చొప్పున నమోదయ్యాయి. దద్దుర్లు వస్తే జాగ్రత్త పడాలి.. రూబెల్లాను జర్మన్ మీజిల్స్ లేదా త్రీ–డే మీజిల్స్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. బాధితుల్లో సగం మందికి తమకు సోకిందని గుర్తించలేరు. శరీరంపై దద్దుర్లు బహిర్గతమైన రెండు వారాల తర్వాత లక్షణాలు ప్రారంభం అవుతాయి. మూడు రోజుల వరకు ఉంటాయి. ఇది సాధారణంగా ముఖం మీద మొదలై శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపిస్తుంది. దద్దుర్లు కొన్నిసార్లు దురదగా ఉంటాయి. మీజిల్స్ లాగా పూర్తిస్థాయిలో కనిపించవు. కొన్ని వారాల పాటు కూడా ఉండవచ్చు. జ్వరం, గొంతు నొప్పి, అలసట ఉంటుంది. పెద్దవారిలో కీళ్ల నొప్పులు సాధారణం. సమస్యలలో రక్తస్రావం, మెదడువాపు, నరాల వాపు వంటివి ఉండవచ్చు. గర్భధారణ ప్రారంభ సమయంలో సంక్రమణ.. గర్భస్రావం లేదా రూబెల్లా సిండ్రోంతో కూడిన బిడ్డ జననాని ఇది దారితీయవచ్చు. పిల్లల వీపుపై రూబెల్లా కారణంగా దద్దుర్లు ఉంటాయి. అవి తక్కువ ఎరుపు రంగులో ఉంటాయి. రూబెల్లా వైరస్ ఇతరుల నుంచి గాలి ద్వారా వ్యాపిస్తుంది. రక్తం, గొంతు లేదా మూత్రంలో వైరస్‌ను యాంటీబాడీ పరీక్షలతో నిర్ధారించవచ్చు. మీజిల్స్లో 104 డిగ్రీల వరకు జ్వరం మీజిల్స్ అనేది మీజిల్స్ వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. సాధారణంగా వ్యాధి సోకిన వ్యక్తికి 10–12 రోజుల తర్వాత లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. 7–10 రోజుల వరకు ఉంటాయి. సాధారణంగా జ్వరం, తరచుగా 104 నిడిగ్రీల వరకు వస్తుంది. దగ్గు, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు ఉంటాయి. ఎరుపు, చదునుగా ఉండే దద్దుర్లు సాధారణంగా ముఖం మీద మొదలై, మిగిలిన శరీరానికి వ్యాపిస్తాయి, సాధారణ సమస్యల్లో 8 శాతం కేసుల్లో అతిసారం, ఏడు శాతం మందిలో చెవి ఇన్ఫెక్షన్, ఆరు శాతం మందిలో న్యుమోనియా ఉంటాయి. కొన్ని కేసుల్లో మాత్రం మూర్ఛలు, అంధత్వం, మెదడు వాపు సంభవించే అవకాశం ఉండొచ్చు. దీన్ని తట్టు అని కూడా పిలుస్తారని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల పేర్కొన్నారు. -
రష్యా ఔట్! అన్ని దారులు మూసేస్తున్న యూఎస్
US Treasury announced To Close: రష్యా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో దురాక్రమణకు దిగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వంటి ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సైతం ముందుకు వచ్చి యుద్ధాన్ని ఆపేయమన్నా ససేమిరా అంటూనే వచ్చింది. రష్యా ఆటకట్టించేలా ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టేలా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ లావాదేవీలపై ఆంక్షలు విధించాయి కూడా. అయినా రష్యా ఏ మాత్రం దూకుడు తగ్గించపోగా, యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. దీంతో రష్యాను ఆంక్షల నుంచి తప్పించుకోకుండా ఉండేలా దారులన్నింటిని మూసేసింది యూఎస్. అందులో భాగంగానే అమెరికా యూఎస్ ట్రెజరీని మూసేసినట్లు ప్రకటించింది. దీంతో రష్యా విదేశీ రుణాన్ని చెల్లించటానికి యూఎస్ బ్యాంకులోని నిధులను యాక్సెస్ చేసుకునే సామార్థ్యాన్ని నిరోధించింది. ఐతే రష్యా కూడా తన విదేశీ రుణాన్ని రూబెళ్లలోనే చెల్లిస్తానని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు రష్యన్ ఆర్థిక వ్యవస్థను ఏజెంట్‌గా ఉంచి చెల్లింపులు నిర్వహిస్తామని రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలతో రష్యాను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరే చేసింది. మళ్లీ అమెరికా ఈ ప్రకటనతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని ప్రభుత్వ చెల్లింపులు చేయనీకుండా విదేశీ కరెన్సీ నిల్వల పై యూఎస్ షాకిచ్చింది. ఈ మేరకు రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిలువానోవ్ మాట్లాడుతూ..."రష్యాకు ఎలాంటి స్నేహ పూర్వ వాతావరణం లేకుండా ఒంటరిని చేసింది. ప్రధానంగా రష్యన్ రుణ సాధనాల్లో విదేశీ పెట్టుబడిదారుల హక్కులను కూడా యూఎస్ దెబ్బతీసింది. అయినా మా వద్ద డబ్బు ఉంది. చెల్లింపులు చేయగలం. ఇదేమీ రష్యన్ జీవన నాణ్యతను పెద్దగా ప్రభావితం చేయలేదు" అని చెప్పారు. ఏదీఏమైన రష్యా విదేశీ రుణాన్ని చెల్లించాలంటే చాలా బాండ్లు రూబెళ్లలో చెల్లించడానికి అనుమతించవు. మే 27న రష్యా చెలించాల్సిన తదుపరి విదేశీ రుణం రెండు బాండ్ల పై 100 డాలర్లు వడ్డీ. అందులో ఒక బాండ్‌కి రష్యా డాలర్లు, యూరోలు, పౌండ్లు లేదా స్విస్ ఫ్రాంక్లలో మాత్రమే చెల్లించాలి, మరోదానికి రూబెళ్లలో చెల్లించవచ్చు. మరోవైపు రష్యా కూడా విదేశీ రుణ ఎగవేత (డీఫాల్ట్) తలెత్తకుండా ఉండేలా ఇప్పటికే త్వరితగతిన దేశం నుంచి నిధులను బదిలీ చేసింది. ప్రస్తుతం రష్యా జూన్ చివరినాటి కల్లా 400 డాలర్లు విదేశీ రుణం చెల్లించాలి. ఒకవేళ గ్రేస్ పిరియడ్ లోపు చెల్లించకపోతే డీఫాల్ట్‌గా ప్రకటిస్తుంది. 1918లో బోల్షివిక్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ పదవీచ్యుతుడైన సమయంలో తొలిసారిగా రష్యాని డీఫాల్ట్‌గా ప్రకటించారు. (చదవండి: పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు?) -
రుబెల్లాతో తట్టుకు చెక్
►పిల్లల్లో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ ►9 నెలల నుంచి 15 ఏళ్ల పిల్లలకోసం ►ఉచితంగా ఇవ్వనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ►ఈనెల17 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం ►విస్తృత ప్రచారం చేపడుతున్న జిల్లా వైద్యారోగ్యశాఖ జ్యోతినగర్: ఒక్క టీకా..జీవితకాలం రక్ష. అదే ఎంఆర్ వ్యాక్సిన్. తట్టు వ్యాధి నిర్మూలనకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త టీకాను కనిపెట్టింది. చిన్నారులకు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కల్పించేందుకు రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 17 నుంచి వేసేందుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తొమ్మిదినెలల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు ఈ టీకా వేయనున్నారు. ఈనెల17 నుంచి ఐదు వారాలపాటు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. మీజిల్స్ అంటే.. ∙ మీజిల్స్ (తట్టు) అనేది ప్రాణాంతకమైన వ్యాధి. చిన్నారులలోని వైకల్యాలు, మరణాలకు ప్రధాన కారణాల్లో ఇది ఒక్కటి. ∙ ఇది అంటువ్యాధి. ఇది సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల వ్యాపిస్తుంది. ∙ పిల్లల్లో నిమోనియా, డయేరియా, మెదడు సంక్రమణాల వంటి ప్రాణాంతక రోగాలకు మీజిల్స్ కారణమవుతుంది. ∙ ఎక్కువ జ్వరంతో కూడిన ఎర్రటి దద్దుర్లు, దగ్గు, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడడం ద్వారా మీజిల్స్‌ను సాధారణంగా గుర్తించవచ్చును. రుబెల్లా అంటే మహిళకు గర్భం దాల్చిన తొలిదశలో రుబెల్లా ఇన్ఫెక్షన్ సంక్రమిస్తే ఫలితంగా కంజెనైటేల్ (పుట్టుకతో సక్రమించే) రుబెల్లా సిండ్రోమ్ సీఆర్ఎస్ కలగవచ్చు. అది గర్భస్త శిశువులకు, నవజాత శిశువులకు తీవ్రతరమైన ప్రాణాంతకమైన పరిణామాలను కలుగజేస్తుంది. గర్భంతో ఉన్న తొలి దశలో రుబెల్లా ఇన్ఫెక్షన్ సోకిన తల్లులకు పుట్టిన చిన్నారుల్లో కళ్లు బెబ్బతినడం, చెవులు, మెదడు (చిన్నసిరస్తు, బుద్దిమాంద్యాం) గుండె సంబంధిత లోపాలు కలిగే దీర్గకాలిక జన్మసిద్ధ ఇబ్బందులు తలెత్తుతాయి. రుబెల్లా సోకిన గర్భిణులకు గర్భస్త్రావం, గర్భపాతం, మృతశిశువు జన్మించడం కలగుతాయి. ఎవరెవరికి వ్యాక్సినేషన్ ∙ తేలికపాటి శ్వాస సంబంధింత ఇబ్బందులు, అతిసారం, తక్కువ గ్రేడ్ జ్వరం వంటి అస్వస్తలకు గురైన చిన్నారులకు కూడా ఈ టీకాను వేయించవచ్చు. ఎవరికి వేయవద్దు.. ∙ అధిక జ్వరం, ఇతర తీవ్రమైన వ్యాధులు, ఉదాహరణ: సృహలో లేకపోవడం, అపస్మారకంలో ఉన్న వారికి ఈ టీకాలు వేయవద్దు. ∙ అసుపత్రిలో చేరిన చిన్నారులకు, గతంలో మీజిల్స్, రుబెల్లా టీకా వల్ల తీవ్రమైన అలర్జీ, ప్రతిచర్యకు లోనైన వారు. టీకాలు ఎక్కడ వేస్తారు.. ∙ జిల్లా వ్యాప్తంగా టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కార్యక్రమం మొదటివారంలో అన్ని పాఠశాలల్లో టీకాలు వేస్తారు. ∙ పాఠశాలలకు వెళ్లని మిగతా చిన్నారులను గుర్తించి టీకాలు వేస్తారు. మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. మొదటి దశలో టీకాలు వేయించుకోని వారిని గుర్తించి 4వ వారంలో మళ్లీ టీకాల కార్యక్రమం చేపడుతారు. టీకా ప్రయోజనాలు.. ∙ ఒక్కసారి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జీవిత కాలం పని చేస్తుంది. ∙ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ∙ కంటి చూపు మందగించడం, చెవుడు, గుండె జబ్బులను నిరోధిస్తుంది. ∙ అమ్మతల్లి తట్టు దూరం. ∙ వివాహం తర్వాత పుట్టే బిడ్డలకు కడుపులో వ్యాధుల నుంచి రక్షణ. ∙ తక్కువ నెలలో పిల్లలు పుట్టడం, గ్రహణమొర్రి, గుండె జబ్బుల నివారణ. -
రెండు వ్యాధులకు చెక్
►17న మీజిల్స్ రూబెల్లా టీకా పంపిణీ ►జిల్లాలో 2.72 లక్షల చిన్నారులు పిల్లలకు వచ్చే తట్టు, రూబెల్లా వ్యాధులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మీజిల్స్ రూబెల్లా టీకాను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విజయవంతంకాగా.. ఈనెల 17 నుంచి మన రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ టీకాను 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు వేయనున్నారు. జీవితంలో ఒకేసారి ఒకే మోతాదులో వేస్తారు. కరీంనగర్‌హెల్త్: మీజిల్స్(తట్టు) ప్రాణాంతకవ్యాధి, వైరస్ ద్వారా సోకే అంటువ్యాధి. చిన్నపిల్లల్లో అత్యంత వేగంగా సోకుతుంది. సెలైవా, మ్యుకస్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. శ్వాసకోశాలకు ఇన్ఫెక్షన్ కల్గిస్తుంది. తీవ్రమైన అతిసారంతో ప్లేట్లేట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. జ్వరం, వంటిపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడి, తుమ్ములు, దగ్గు వస్తుంటాయి. దీని ద్వారా మనదేశంలో మూడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. రూబెల్లా రూబెల్లా వ్యాధి చిన్న పిల్లలకే కాకుండా పెద్దవారికి సైతం వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారి చర్మంపై ఎర్రటి దద్దుర్లు వచ్చి, తీవ్ర జ్వరం, తలనొప్పి, కళ్లు గులాబీ రంగులోకి మారుతాయి. ఒక్కోసారి మరణం సంభవించే అవకాశాలున్నాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే నవజాత శిశువుకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. వినికిడిలోపం, మెదడు లోపాలు, మానసిక వైకల్యం, గుండె దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో గర్బస్రావం, నర్జీవ జననాలు సంభవిస్తాయి. దీనికి చికిత్స లేదు. వ్యాక్సిన్ ద్వారా మాత్రమే నివారించగలం. ఆర్థిక, సామాజిక సమస్యగా గుర్తించి 2020 వరకు అదుపు చేయాలనే ఈ టీకాను ఉచితంగా పిల్లలకు చేస్తోంది ప్రభుత్వం. తప్పనిసరిగా వేయించాలి గతంలో ఈ వ్యాక్సిన్ వేయించినా మళ్లీ వేయించాలని వైద్యాధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వేసే డోసు అదనపు శక్తినిచ్చి మరింత రక్షణ కల్పింస్తుందని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టీకా తప్పనిసరిగా వేయించాలని డీఎంహెచ్‌వో రాజేశం తెలిపారు. 2,72,779మంది పిల్లలకు.. జిల్లాలో 2లక్షల 72వేల 779మంది 9నెలలు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు మీజిల్స్ రూబెల్లా టీకా వేయనున్నారు. 2,80,000 మందికి సరిపడేలా 30,728 ఇంజక్షన్ బుడ్లు అందుబాటులో ఉంచారు. ఈనెల 17న ప్రారంభించి ఒకే రోజు ఒకగ్రామంలో టీకా వేయనున్నారు. మొదటి రెండు వారాలు పాఠశాలలు, తర్వాత రెండు వారాలు బయట, సంచార ప్రదేశాల్లో మొబైల్ టీమ్‌ల ద్వారా వేస్తారు. ఈ కార్యక్రమంలో వేసుకోని పిల్లలను గుర్తించి ఐదో వారంలో వేయనున్నారు. వ్యాక్సినేషన్‌కు టీమ్ మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నలుగురు సభ్యులు టీమ్‌గా వ్యవహరిస్తారు. ఇందులో ఏఎన్ఎం లేదా హెల్త్‌అసిస్టెంట్, ఆశా వర్కర్, అంగన్‌వాడీవర్కర్, వలంటీర్ ఉంటారు. ఈ టీమ్‌ను వైద్యాధికారి ఆమోదించాల్సి ఉంటుంది.