రుద్రేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన
హన్మకొండ కల్చరల్ : హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో ఆదివారం శ్రావణ బహుళ ఏకాదశి ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని రుద్రేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, మంగళవాద్య సేవ, తదితర పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుకుంటూ పంచ భూతాలకు అధిపతి అయిన పరమేశ్వరున్ని ప్రార్థిస్తూ 51 లీటర్ల పాలతో క్షీరాభిషేకం చేశారు. పూజల్లో పాల్గొన్న ప్రముఖుల్లో న్యాయవాది పశుపతి ఈశ్వర్నాథ్, శోభారాణి దంపతులు, ప్రముఖ వస్త్ర వ్యాపారి కాసం పుల్లయ్య దంపతులు, భక్తులు పాల్గొన్నారు.