rupee dollar exchange
-
విదేశీ విద్య మరింత భారం.. భారత విద్యార్థులకు కొత్త టెన్షన్!
సాక్షి, అమరావతి: విదేశీ విద్య భారత విద్యార్థులకు మరింత భారమవుతోంది. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో విద్యా రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. అయితే విదేశాల్లో చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అత్యధిక వేతనాలు వస్తాయన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధికులు చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చదువులు ముగిసిన వెంటనే విద్యార్థులు మంచి కొలువులు సాధిస్తే సరి.. లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. విదేశీ చదువులు ముగిస్తున్న వారిలో కేవలం నాలుగో వంతు మందికి మాత్రమే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. కంపెనీలు ఆర్థిక పరిస్థితులతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తక్కిన వారంతా స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. మరోవైపు ఇక్కడి వేతనాలు, విదేశీ చదువుల కోసం చేసిన అప్పులకు పొంతన లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఆ కొలువులూ దక్కని వారి కుటుంబాలు ఆ అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నాయి. గత ఐదారేళ్లలో ఒక్క కరోనా సమయంలో మినహాయిస్తే ఏటా కనీసం 4 లక్షల వరకు విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక.. కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ చదువులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సహజంగానే ఆ మేరకు రుణాల శాతం కూడా ఎక్కువైంది. 2019లో 5.86 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లారు. 2020లో ఆ సంఖ్య ఒక్కసారిగా సగానికి తగ్గి 2.59 లక్షలకు పడిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా అనేక దేశాల్లో రాకపోకలపై నిషేధాలు, విద్యా సంస్థల మూత ఇందుకు కారణాలుగా నిలిచాయి. 2021 నుంచి కరోనా తగ్గుదలతో క్రమేణా మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో ఆ సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. గతేడాది 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అధిక రుణాలు విదేశాల్లో చదువులకోసం వెళ్లే విద్యార్థులు ఫీజుల కోసం అత్యధికంగా ప్రభుత్వ బ్యాంకుల రుణాలపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థులు ఈ రుణాల ఆధారంగానే విదేశీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 2021లో విదేశీ విద్య కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు అందించిన రుణాల మొత్తం రూ.4,503.61 కోట్లుగా ఉంది. 2020లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 23.5 శాతం తక్కువ. కరోనా కారణంగా 2020లో విదేశీ విద్యకు ఆటంకాలు ఏర్పడడంతో విద్యా రుణాల మంజూరు కూడా భారీగా తగ్గింది. 2022లో రుణాల మంజూరు అమాంతం పెరిగింది. గతేడాది ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రూ.7,576.02 కోట్లను మంజూరు చేశాయి. 2021లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 68.2 శాతం అధికం. 2022లో మొత్తం విద్యా రుణాలు రూ.15,445.62 కోట్లు ఇవ్వగా అందులో దాదాపు సగం మేర అంటే రూ. 7,576.02 కోట్లు విదేశీ విద్యకోసం ఇచ్చినవే. చెల్లించడానికి ఇబ్బందులు ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఆ ప్రభావం విద్యా రుణాలపైన పడుతోందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతోందని, దీన్ని తీర్చడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరిస్తున్నారు. ఉద్యోగాల్లో చేరి అధిక వేతనాలు తీసుకుంటున్న వారే తిరిగి కట్టలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అలాంటిది అరకొర వేతనాలు, లేదా అసలు ఉద్యోగమే లేని వారి కుటుంబాలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. -
రెండో రోజూ రూపాయి పరుగు
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ జోరు చూపుతోంది. ప్రస్తుతం డాలరుతో మారకంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడవుతోంది. ఇది రెండున్నర నెలల గరిష్టంకాగా.. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 15 పైసలు పుంజుకుని 73.16 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 73.05 వరకూ బలపడింది. బుధవారం సైతం డాలరుతో మారకంలో రూపాయి 11 పైసలు లాభపడి 73.31 వద్ద స్థిరపడింది. చదవండి: (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్) కారణాలేవిటంటే.. ఇటీవల కొద్ది రోజులుగా డాలరు ఇండెక్స్ బలహీనపడుతోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 90 దిగువకు చేరింది. 89.64 వద్ద 32 నెలల కనిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2018 ఏప్రిల్‌లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం సెంటిమెంటు బలపడేందుకు దోహదం చేసినట్లు తెలియజేశాయి. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలరుతో మారకంలో యువాన్ 6.54ను తాకింది. దేశీ ఎఫెక్ట్ సెప్టెంబర్‌కల్లా కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరినట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల వెల్లువెత్తడం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దేశీ ఈక్విటీ మార్కెట్లో గత 12 ఏళ్లలోలేని విధంగా ఎఫ్‌పీఐలు నవంబర్‌లో 8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయగా.. డిసెంబర్‌లోనూ 5 బిలియన్ డాలర్లకుపైగా పంప్చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020లో ఇప్పటివరకూ 22.6 బిలయన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
మూడో రోజూ రూపాయి రయ్
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 52 పైసలు పుంజుకొని రూ.75.66 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం నేపథ్యంలో విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్ బలహీనపడటం, మన స్టాక్ మార్కెట్ భారీ లాభాలు సాధించడం, వివిధ దేశాల్లో లాక్డౌన్ దశలవారీగా తొలగనుండటం దీనికి కారణాలు. గత మూడు రోజుల్లో రూపాయి 80 పైసలు(దాదాపు 1 శాతం మేర) బలపడింది. నెల గరిష్ట స్థాయికి చేరింది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.18 వద్ద ముగిసింది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసల లాభంతో 75.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.60–75.96 గరిష్ట–కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు 52 పైసల లాభంతో 75.66 వద్ద ముగిసింది. -
71 దిశగా రూపాయి పయనం?
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారంతో పోల్చితే 15 పైసలు బలహీనపడింది. 70.74 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒక దశలో 70.90ని సైతం తాకింది. ఈ రెండూ రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. బుధవారం రూపాయి 70.59 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 70.65ని చూసింది. అయితే గురువారం మరింత కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ►అమెరికా పటిష్ట వృద్ధి ధోరణి ‘డాలర్ బలోపేతం’ అంచనాలను పటిష్టం చేసింది. మున్ముందు డాలర్ మరింత పెరుగుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీనితో చమురు దిగుమతిదారుల నుంచి ‘నెలాంతపు’ డాలర్ల డిమాండ్ తీవ్రమయ్యింది. దీనితో రూపాయి భారీ పతనం అనివార్యమయ్యింది. ►గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 70.64 వద్ద ప్రారంభమయ్యింది. ►వివిధ దేశాలకు సంబంధించి క్రాస్ కరెన్సీలో కూడా రూపాయి బలహీనపడింది. బ్రిటన్ పౌండ్లో రూపాయి విలువ 90.98 నుంచి 92.07కు పడిపోయింది. యూరోలో 82.34 నుంచి 82.69కి దిగింది. జపాన్ యన్‌లో మాత్రం స్థిరంగా 63.46 వద్ద ఉంది. ఎగుమతిదారుల్లో అనిశ్చితి... రూపాయి విలువలో స్థిరత్వం అవసరం. ఇలా లేకపోతే ప్రత్యేకించి ఎగుమతిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది. గ్లోబల్ మార్కెట్లో వస్తువుల అమ్మకాలకు ఏ స్థాయి ధర నిర్ణయించాలన్న అంశంపై సంక్లిష్టత నెలకొంటుంది – గణేష్ కుమార్ గుప్తా, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
మరింత దూకుడు కొనసాగిస్తున్న రూపాయి
ముంబై : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం రూపాయికి భలే కిక్కిచ్చింది. డాలర్ తో పోలిస్తే తగ్గుతూ వచ్చిన రూపాయి మారకం విలువ నిన్నటి ట్రేడింగ్ లో ఒక్కసారిగా ఏడాదిన్నర గరిష్టానికి ఎగిసింది. నేటి ట్రేడింగ్ లోనూ ఈ రూపాయి విలువ మరింత పెరిగింది. విదేశీ క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ తో రూపాయి మరో 38 పైసలు బలపడి 65.44 వద్ద ట్రేడైంది. ఎంతో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఫైనాన్సియల్ మార్కెట్లలో సెంటిమెంట్ భారీగా బలపడింది. అంతేకాక సుస్థిర ప్రభుత్వం రూపాయికి బూస్ట్ ఇచ్చింది. డాలర్ పై దూకుడు కొనసాగిస్తూ రూపాయి మంగళవారం ఇంట్రాడేలో గరిష్ట స్థాయి 65.76ని తాకింది. చివరికి 78 పైసలు బలపడి 1.17 శాతం పెరుగుదలతో 65.82 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుకు మరింత బలపడుతూ మార్నింగ్ ట్రేడ్ లో రూపాయి 65.41, 65.44 స్థాయిలో ట్రేడైంది. ప్రస్తుతం 32 పైసల లాభంతో 65.49 వద్ద ట్రేడవుతోంది.. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.06 శాతం కిందకి దిగజారింది. ఆరు కరెన్సీల బాస్కెట్ లో డాలర్ విలువ మార్నింగ్ ట్రేడ్ లో 101.68 వద్ద కొనసాగింది. మరోవైపు నేడు ఫెడరల్ రిజర్వు మీటింగ్ నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు మాత్రం ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి.