స్పందించిన హృదయం
లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ రూ.లక్ష సాయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) :
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 11 నెలల నితీష్‌కి లివర్ ఫ్లాంటేష¯ŒS సర్జరీకి సొమ్ము అవసరమని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న దాత స్పందించారు. రాజమహేంద్రవరానికి చెందిన జనసేవా సంస్థ వ్యవస్థాపకురాలు గంటా స్వరూపదేవి ఎ¯ŒSఆర్ఐ జనసేన (డల్లాస్) సభ్యులు చిట్టిముత్యాలు, స్వామి అనిశెట్టి, కానా గ్రూపు సభ్యులందరికీ నితీష్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది. స్పందించిన వారు రూ.లక్ష చెక్కును ఘంటా స్వరూపదేవికి పంపింపగా సోమవారం ఆమె నివాసంలో నితీష్ తల్లి దుర్గాప్రశాంతికి అందజేశారు.