russh
-
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
సాక్షి, తిరుమల: వారాంతపు సెలవులతో తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 57,624 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 30 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 12 గంటలు, 16 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. కేంద్రీయ విచారణ కార్యాలయం, పద్మావతి, ఎంబీసీ–34 రిసెప్షన్ కేంద్రాల్లో గదుల కోసం భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాచారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కనీసం రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 57,937 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 12 గంటలు, 14 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. కేంద్రీయ విచారణ కార్యాలయం, పద్మావతి, ఎంబీసీ–34 రిసెప్షన్ కేంద్రాల్లో గదుల కోసం భక్తులు నిరీక్షించారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కనీసం రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. హుండీ కానుకలు రూ.2.76 కోట్లు లభించాయి.