rws ae
-
ఏసీబీ వలలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ
యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా పనిచేస్తున్న బి.వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు. ఒకరి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుపడ్డారు. వేసిన బోరుకు బిల్లులు చేయకుండా డబ్బులకోసం వేధింపులకు గురిచేస్తుండటంతో పుల్లలచెరువు ఎస్సీపాలెంకు చెందిన లింగంగుంట్ల మరియదాసు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ ఒంగోలు డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది యర్రగొండపాలెం పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని వెంకటరెడ్డి నివాస గృహంపై దాడులు నిర్వహించారు. ముందుగా స్థానిక మార్కాపురం రోడ్డులోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంవద్ద రెక్కీ నిర్వహించారు. అక్కడ ఏఈ లేకపోవడంతో ఫిర్యాదుదారునితో ఫోనులో మాట్లాడించి ఇంటివద్దకు వెళ్లారు. ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ. 10 వేల నోట్లను తీసుకొనివెళ్లి ఏఈకి ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆయన్ను పట్టుకున్నారు. ఏం జరిగింది? గత సంవత్సరం ఏప్రిల్‌లో ఎంపీ నిధుల కింద బోరుకు రూ. 1.25 లక్షలు మంజూరయ్యాయి. ఈ బోరును పుల్లలచెరువు ఎస్సీ పాలెంలో మేనెలలో వేసిన మరియదాసు పంచాయతీకి స్వాధీనం చేశాడు. కాగా ఏఈ చెక్ మెజర్ చేయడం, సెప్టెంబరునెలలో క్వాలిటీ కంట్రోల్ పరిశీలించడం జరిగాయని డీఎస్పీ ప్రభాకర్ తెలిపాడు. అయితే ఏఈ పర్సెంటేజీల కోసం బిల్లులు చేయకుండా ఆపివేశాడని, క్వాలిటీ కంట్రోల్ ఫైల్ కూడా ఉన్నతాధికారులకు పంపకుండా తనవద్దనే ఉంచుకున్నాడని తెలిపారు. మరియదాసు అధికారిచుట్టూ తిరగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడని డీఎస్పీ తెలిపారు. ఇంజినీరింగ్‌శాఖ అధికారులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైన అధికారులు తమ వ్యవహారశైలిని మార్చుకొని ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని హెచ్చరించారు. తగిన ఆధారాలతో బాధితులు ఏసీబీని ఆశ్రయించవచ్చని వివరించారు. దాడుల్లో ఏసీబీ సర్కిల్ఇన్స్పెక్టర్ టీవీవీ ప్రతాప్ పాల్గొన్నారు. -
‘కియా’ పనుల కోసం రూ.25 కోట్లతో ప్రణాళిక
– ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్‌నాయక్ అనంతపురం సిటీ : కియా కార్ల కంపెనీకి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హారేరామ్‌నాయక్ తెలిపారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం కియా కంపెనీ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి నివేదికను పంపించామన్నారు. కియా కార్ల కంపెనీకి రోజుకు 2 లక్షల లీటర్ల నీరు అవసరమని చెప్పారు. నీటి అవసరాలు తీర్చేందుకు గొళ్లపల్లి నుంచి పైప్‌లైన్, 20 లక్షల లీటర్ల నీటిని నిల్వ ఉంచేందుకు సంపు, సరఫరాకు రెండు విద్యుత్ మోటార్లు అవసరం ఉందన్నారు. వీటిని ఏర్పాటు చేసి పైపులైన్ వేయడానికి రూ. 125 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టెండర్లకు పిలుస్తామన్నారు. తాత్కాలికంగా రూ. 3 కోట్లతో నీటిని అందిస్తామని చెప్పారు. టెండర్లపై ఐదుగురికి శిక్షణ ఆర్‌డబ్ల్యూఎస్‌లో టెండర్ల ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లాల వారిగా ఆ శాఖ నుంచి ఐదుగురికి అమరావతిలో 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్ఈ తెలిపారు. రెండు రోజుల్లో ఐదుగురిని అమరావతికి పంపుతామన్నారు. -
కదిలిన యంత్రాంగం
సోమ్లాతండాను పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు డోర్నకల్ : డోర్నకల్ పట్టణ శివారులోని సో మ్లాతండాకు బుధవారం పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకు లు తరలివచ్చారు. తండాలో గిరిజనులు జ్వ రాలతో బాధ పడుతున్న పరిస్థితిపై పత్రికలలో కథనాలు రావడంతో అంతా కదిలారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ తన సిబ్బందితో వచ్చి నీటి నమూనాలను సేకరించారు. పీహెచ్సీ వైద్యులు మాధవీలత, ఉపేందర్ వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వర పీడితులకు పరీక్ష లు నిర్వహించారు. గ్రామసర్పంచ్ మాదా లావణ్య, ఎంపీపీ మేకపోతుల రమ్య, ఎంపీటీసీ సభ్యురాలు నలబోలు సునిత తండాలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. తండా లో పారిశుధ్యం, తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నాయంటూ స్థానికులు అధికారులతో వా గ్వాదానికి దిగారు. కాగా, డోర్నకల్ సీఐ వై.హరీష్‌కుమార్,ఎస్ఐలు ఖాదర్‌బాబా, హన్నన్ తండాలో పర్యటించి గ్రామపంచాయితి సి బ్బందితో వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.